MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే

iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే

iQOO Neo 11 Ultra: ఆగస్టు 18న లాంచ్ కానున్న ఐక్యూ నియో 11 ఆల్ట్రా స్పెక్స్ లీక్ అయ్యాయి. 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లే, డైమెంసిటీ 9500M చిప్‌సెట్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఐక్యూ నియో 11 ఆల్ట్రా పూర్తి స్పెక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 12 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
9100mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఐక్యూ నియో 11 ఆల్ట్రా.. స్పెక్స్ చూస్తే మైండ్ బ్లాకే
Image Credit : X/techfryerr

9100mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఐక్యూ నియో 11 ఆల్ట్రా.. స్పెక్స్ చూస్తే మైండ్ బ్లాకే

స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐక్యూ నియో 11 ఆల్ట్రా (iQOO Neo 11 Ultra) లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ కొత్త ఫోన్‌ను వచ్చే, అంటే ఆగస్టు 18న సాయంత్రం 7:00 గంటలకు చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నారు. ఐక్యూ బ్రాండ్ తన నియో సిరీస్‌లో 'ప్రో' అనే పేరుకు బదులుగా మొదటిసారిగా 'ఆల్ట్రా' ట్యాగ్‌ను ఉపయోగిస్తుండటం విశేషం. ఈ లాంచ్ కంటే ముందే చైనా టెలికామ్ వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ V2573A తో ఈ ఫోన్ లిస్ట్ అయింది. దాంతో లాంచ్‌కు ముందే దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్ అయి టెక్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ సైట్‌లో ఈ ఫోన్ ప్రి-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
9,100mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Image Credit : X/techfryerr

9,100mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఐక్యూ నియో 11 ఆల్ట్రా ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ కెపాసిటీనే అని చెప్పవచ్చు. ఐక్యూ నియో సిరీస్ చరిత్రలోనే అత్యంత పెద్దదైన 9,100mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది. రోజంతా గేమింగ్ ఆడినా, ఎంత హెవీగా వాడినా బ్యాటరీ ఛార్జ్ అయిపోతుందనే భయం ఉండదు. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. దీనివల్ల ఇంత పెద్ద బ్యాటరీని కూడా చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. ఫోన్ సైజు విషయానికి వస్తే 163.42 x 75.88 x 8.6 మిమీ కొలతలతో, 225 గ్రాముల బరువుంటుంది.

Related Articles

Related image1
Fake Rapido Driver: హైదరాబాద్‌లో కొత్త టైప్ ఫ్రాడ్.. ఫేక్ రాపిడో డ్రైవర్‌ బ్యాండ్ బాజాయించిన యువతి
Related image2
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
35
2K OLED డిస్‌ప్లే, పవర్ ఫుల్ డైమెన్సిటీ చిప్‌సెట్
Image Credit : X/techfryerr

2K OLED డిస్‌ప్లే, పవర్ ఫుల్ డైమెన్సిటీ చిప్‌సెట్

గేమింగ్, వీడియో కంటెంట్ లవర్స్ కోసం ఈ ఫోన్‌లో టాప్ నోచ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో 6.83-అంగుళాల ఫ్లాట్ విజనోక్స్ F2 OLED 2K రెసల్యూషన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది కళ్లకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక ప్రొటెక్షన్‌తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో మీడియాటెక్ డైమెన్సీటీ 9500ఎం ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌కు మోడిఫైడ్ వెర్షన్. ఇందులో 11-కోర్ మాలి G1-ఆల్ట్రా జీపీయూ ని అమర్చారు. ఫలితంగా మల్టీ టాస్కింగ్, హెవీ గేమ్స్ సూపర్ స్మూత్‌గా నడుస్తాయి.

45
కెమెరా, స్టోరేజ్ వేరియంట్లు, డిజైన్ వివరాలు
Image Credit : X/techfryerr

కెమెరా, స్టోరేజ్ వేరియంట్లు, డిజైన్ వివరాలు

ఫోటోగ్రఫీ విభాగంలో ఐక్యూ నియో 11 ఆల్ట్రా వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్‌లో 16-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఈ ఫోన్ 5 రకాల స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది

• 8GB RAM + 256GB స్టోరేజ్

• 12GB RAM + 256GB స్టోరేజ్

• 12GB RAM + 512GB స్టోరేజ్

• 16GB RAM + 256GB స్టోరేజ్

• 16GB RAM + 512GB స్టోరేజ్

ఈ ఫోన్ లైట్ వైట్, షాడో బ్లాక్, విండ్ ఛేజర్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం 3D ఆల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

55
10,000mAh బ్యాటరీతో రానున్న ఐక్యూ Z11S అప్‌డేట్స్
Image Credit : X/techfryerr

10,000mAh బ్యాటరీతో రానున్న ఐక్యూ Z11S అప్‌డేట్స్

ఆగస్టు 18న జరిగే ఇదే ఈవెంట్‌లో ఐక్యూ నియో 11 ఆల్ట్రాతో పాటు ఐక్యూ Z11S (iQOO Z11S) అనే మరో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా కంపెనీ పరిచయం చేస్తోంది. ఐక్యూ చరిత్రలోనే మొదటిసారిగా ఏకంగా 10,000mAh బ్యాటరీతో రాబోతున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 2160Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ ఫీచర్లు ఉన్న 6.83-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇది వైట్, బ్లాక్, పేల్ గ్రీన్ కలర్లలో రానుంది. ఈ రెండు ఫోన్లు ప్రస్తుతం చైనా మార్కెట్లోనే లాంచ్ అవుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ అగ్గిపుల్ల‌ను ఎన్నిసార్లు వెలిగించినా వెలుగుతూనే ఉంటుంది.. బెస్ట్ కిచెన్ గ్యాడ్జెట్
Recommended image2
ఐఫోన్ 18 ప్రో vs ఐఫోన్ 15 ప్రో: అప్‌గ్రేడ్ చేయడం వర్త్ ఏనా? ఫీచర్లు, కెమెరా, ధర వివరాలు ఇవే
Recommended image3
iPhone: భారీగా పడిపోయిన ఐఫోన్ ధర, ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే?
Related Stories
Recommended image1
Fake Rapido Driver: హైదరాబాద్‌లో కొత్త టైప్ ఫ్రాడ్.. ఫేక్ రాపిడో డ్రైవర్‌ బ్యాండ్ బాజాయించిన యువతి
Recommended image2
Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved