వాట్సాప్ వాడుతున్నారా? ఇలా కూడా మోసపోతారు జాగ్రత్త..!
ఈ యాప్ ని సైబర్ నేరగాళ్లు.. మోసాలు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారట. వాట్సాప్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న మోసాలు ఏంటి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్లు లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? ఇక స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ వాట్సాప్ వాడేవాళ్లే. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో.. పెద్దా, చిన్నా అందరూ సులభంగా వాడేస్తున్నారు. కానీ.. ఈ యాప్ ని సైబర్ నేరగాళ్లు.. మోసాలు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారట. వాట్సాప్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న మోసాలు ఏంటి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1.ఎక్కువగా జరుగుతున్న మోసాల్లో ఇది ఒకటి. మోసగాళ్లు మన కుటుంబ సభ్యుల్లానే నటిస్తారు. తర్వాత నెమ్మదిగా ఆర్థిక సహాయం అవసరమని అడగడం మొదలుపెడతారు. మనవాళ్లు అవసరంలో ఉన్నారు కదా అని డబ్బులు సాయం చేసేస్తారు.
2.ఇక.. ఇది మరో రకం మోసం.మనకు తెలియని వారి నుంచి మెసేజ్ లు వస్తూ ఉంటాయి.మనకు తెలిసిన వాళ్లు లాగా నటిస్తూ మెసేజ్ లు చేస్తారు. నమ్మాం అంటే మోసపోయినట్లే.
3.వాట్సాప్ కాల్ ఫార్వార్డింగ్ స్కామ్‌లు: మోసగాళ్లు కాల్ ఫార్వార్డింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి సున్నితమైన సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. బాధితుల నమ్మకాన్ని ఆసరా చేసుకొని వారి ఖాతాలపై పట్టు సాధిస్తారు.
స్కామర్లు ప్రత్యేక ఆఫర్‌లు లేదా బహుమతులు అందిస్తామని చెప్పి, సర్వేలు పూర్తి చేయాలని కోరే సందేశాలు పంపుతారు. ఇవి ప్రధానంగా ఫిషింగ్ ప్రయత్నాలు, వాటి ద్వారా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించడమే లక్ష్యం. సామాన్యంగా, ఈ స్కామ్‌లు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై విస్తృతంగా కనిపిస్తాయి. లింక్‌పై క్లిక్ చేస్తే, మీ పర్సనల్ డేటా స్కామర్లకు చేరి, వారు దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది.
వాట్సాప్ లో రొమాన్స్ చేస్తూ స్కామ్ లు కూడా చేస్తూ ఉటారు. ఈ స్కామ్ లో కొందరు అమ్మాయిలు కాల్ చేసి.. ప్రియురాలిలాగా మాట్లాడుతూ నటిస్తూ.. బంధాన్ని పెంచుకుంటారు. ప్రేమ పెరిగి, బంధం పెరగిన తర్వాత ఆర్థిక సహాయం కోరడం మొదలుపెడతారు. వాట్సాప్ లో ఎక్కువ స్కామ్ లు ఈ రకంగానే జరుగుతుండటం గమనార్హం.
ఇక.. ఉద్యోగం ఇస్తామంటూ చాలా మంది స్కామ్ లు చేస్తున్నారు. ఉచితంగా శిక్షణ ఇస్తామని, ఉద్యోగం గ్యారెంటీ అని కూడా చెబుతుంటారు. నమ్మినవారికి.. ముందుగా కొంత డబ్బులు కట్టమని అడుగుతారు. నమ్మి డబ్బులు కట్టి, మోసపోయిన వారు చాలా మందే ఉన్నారు.
ఎక్కువ మంది యూజర్లు భద్రత కోసం 2FAని ప్రారంభిస్తుండటంతో, మోసగాళ్లు ధృవీకరణ కోడ్లను పంచుకోవడానికి బాధితులను మోసం చేసే పద్ధతులు అభివృద్ధి చేసారు. అందుకే.. ఈ కోడ్స్ ఎవరితోనూ పంచుకోకూడదు.