Battery Saving Tips: మీరు శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నారా? దాని బ్యాటరీ లైఫ్ ని పెంచుకోవడానికి సింపుల్ టిప్స్ కావాలా? సింపుల్ సెట్టింగ్స్ మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్ ను పెంచవచ్చు. అవి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం ఫుల్ గా ఛార్జింగ్ ఉన్న ఫోన్ బ్యాటరీ మధ్యాహ్నానికే ఖాళీ అయిపోతుందా? ముఖ్యమైన గ్రూప్ చాట్ లో హాట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు బ్యాటరీ డిస్ఛార్జ్ అయిపోవడం, గూగుల్ మ్యాప్స్ లో అడ్రస్ వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు ఛార్జింగ్ దిగిపోయి ఫోన్ ఆఫ్ అయిపోవడం లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారా? ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే బ్యాటరీ లైఫ్ ను పెంచుకుంటే సరిపోతుంది. మీది శాంసంగ్ గెలాక్సీ ఫోన్ అయితే ఈ టిప్స్ మీకు బాగా పనిచేస్తాయి.
స్క్రీన్ బ్రైట్ నెస్ తగ్గించండి
మీ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ స్క్రీన్ ఎంత బ్రైట్ నెస్ గా ఉంటే అది బ్యాటరీని అంత ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. ఎక్కువసేపు బ్యాటరీ రావాలంటే స్క్రీన్ ఆఫ్ అయ్యే టైం తగ్గించడం, బ్రైట్ నెస్ తగ్గించడం వల్ల బ్యాటరీ లైఫ్ బాగా పెరుగుతుంది.
స్క్రీన్ పైన నుంచి కిందకి లాగి బ్రైట్ నెస్ తగ్గించండి. అలాగే ఫోన్ వాడనప్పుడు స్క్రీన్ త్వరగా ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోండి. ఆటో బ్రైట్ నెస్ గాని, 30 సెకన్స్ టైమ్ అవుట్ గాని పెట్టుకుంటే మీ ఫోన్ బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జ్ కాకుండా ఉంటుంది.
అనవసరమైన యాప్స్ ఆఫ్ చేయండి
చాలా మంది చేసే తప్పేంటంటే.. బ్లూటూత్, GPS, వైఫై వాడిన తర్వాత ఆఫ్ చేయకుండా వదిలేస్తారు. మీరు వాటిని వాడనప్పుడు ఆఫ్ చేసేయండి. ఈ ఫీచర్స్ ఎప్పుడూ కనెక్షన్ కోసం వెతుకుతూ ఉంటాయి. కాబట్టి బ్యాటరీ త్వరగా అయిపోతుంది. క్విక్ సెట్టింగ్స్ మెనూ లో ఇవి కనిపిస్తాయి. అవసరం లేని వాటిని వెంటనే ఆఫ్ చేయండి.
Always On Display ఆఫ్ చేయండి
సామ్సంగ్ ఫోన్ లో Always On Display వల్ల ఎప్పుడు పడితే అప్పుడు మెసేజెస్, టైం చూసుకోవడం ఈజీ అవుతుంది. కాని ఇది బ్యాటరీని ఎక్కువగా వాడేసుకుంటుంది. దీన్ని పూర్తిగా ఆఫ్ చేయడానికి లేదా కొన్ని సమయాల్లో మాత్రమే చూపించడానికి సెట్టింగ్స్ మార్చండి.
Settings > Lock screen > Always On Display కి వెళ్లి మీకు కావాల్సిన ఆప్షన్ ని సెలక్ట్ చేసుకోండి.
బ్యాటరీ సేవింగ్ మోడ్ వాడండి
బ్యాటరీ లైఫ్ పెంచుకోవడానికి పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోండి. దీని వల్ల బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీస్ తగ్గుతాయి. స్క్రీన్ బ్రైట్ నెస్, పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. దీన్ని మీరు మాన్యువల్ గా ఆన్ చేయొచ్చు. లేదా సెట్టింగ్స్ లోకి వెళ్లి మార్చొచ్చు.
Settings > Device Maintenance > Battery లో ఆటోమేటిక్ గా ఆన్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.
సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయండి
పాత సాఫ్ట్ వేర్ వల్ల కూడా బ్యాటరీ త్వరగా అయిపోతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్లి About phone లో కొత్త అప్డేట్స్ ఉన్నాయేమో చూసుకోండి. అలాగే సోషల్ మీడియా, ఈమెయిల్ లాంటి యాప్స్ ఎప్పుడూ సింక్ అవుతూ ఉంటాయి. సింక్ అయ్యే ఫ్రీక్వెన్సీ తగ్గించండి. లేదా మాన్యువల్ గా అప్డేట్ చేసుకోండి.
ఈ టిప్స్ పాటిస్తే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఆటోమెటిక్ గా పెరుగుతుంది.