Oppo Reno14 5G: బడ్జెట్ ధరలో హై రేంజ్ ఫీచర్లు.. ఒప్పో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో రెనో 14 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో కళ్లు చెదిరే ఫీచర్లను కంపెనీ అందించింది.

అద్భుతమైన డిజైన్
ఒప్పో రెనో 14 5జీని ఆకర్షణీయమైన డిజైన్‌తో తీసుకొచ్చింది. ఇందులో 6.59 ఇంచెస్‌తో కూడిన ఫ్లాట్ AMOLED స్క్రీన్‌తో 1.6mm బార్డర్స్ మాత్రమే ఉండటంతో ఫుల్ స్క్రీన్ ఫీల్ ఇస్తుంది. 120Hz స్మార్ట్ అడాప్టివ్ స్క్రీన్ 1.5K రెసల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్‌ను చాలా స్లిమ్‌గా డిజైన్ చేశారు. కేవలం 7.42mm మందం, 187 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో చాలా తేలికగా ఉంటుంది.
కలర్స్ వేరియంట్స్
పర్ల్ వైట్ – సిల్కీ టెక్స్చర్, ఫింగర్‌ప్రింట్స్ పడకుండా ఉంటుంది. ఫారెస్ట్ గ్రీన్ – ల్యూమినస్ లూప్ డిజైన్‌తో డైనమిక్ లైట్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక ఈ ఫోన్ బాడీకి ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ వాడారు. ఇది సాధారణ ప్లాస్టిక్ కంటే 200% బలంగా ఉంటుంది.
భద్రతకు పెద్ద పీట
ఇక ఈ ఫోన్ భద్రతకు పెద్ద పీట వేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i కవర్ వాడటం వల్ల స్క్రాచ్‌లకు రెసిస్టెంట్‌గా ఉంటుంది. అదనంగా స్పాంజ్ బయోనిక్ కౌచినింగ్ టెక్నాలజీ షాక్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌లో IP66, IP68, IP69 వాటర్ రెసిస్టెంట్ అందించారు. దీంతో ఈ ఫోన్ పూర్తిగా నీటిలో మునిగిపోయినా పాడవ్వదు.
కెమెరా విషయానికొస్తే
ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ కెమెరాను ఇచ్చారు. Reno14 5G లో 50MP హైపర్‌టోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇందులో ప్రైమరీ కెమెరాగా Sony IMX882 సెన్సార్‌ను ఇచ్చారు. 50MP, 3.5x ఆప్టికల్ జూమ్ టెలిఫోటో లెన్స్‌ను ఇచ్చారు. అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్‌ను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
కెమెరాలో ఇవే హైలెట్స్
ఒప్పో రెనో 14 5జీ కెమెరా 3.5x టెలిఫోటో జూమ్ పోర్ట్రెయిట్స్, ట్రావెల్ షాట్స్ అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది. 120x డిజిటల్ జూమ్ AI సహాయంతో డిస్టెంట్ డిటైల్స్ కూడా స్పష్టంగా చూపిస్తుంది. 4K HDR వీడియో రికార్డింగ్ (60fps) – మైన్, టెలిఫోటో, ఫ్రంట్ కెమెరాలో అందించారు. ట్రిపుల్ AI ఫ్లాష్ సిస్టమ్ వల్ల తక్కువ లైట్‌లోనూ నేచురల్ టోన్‌తో బ్రైట్ ఫోటోలు వస్తాయి. ప్రత్యేకంగా అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ మోడ్ కూడా ఉంది.
పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు నాన్ స్టాప్‌గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. 80W SUPERVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ 48 నిమిషాల్లో పూర్తవుతుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌తో 12.8 గంటల కాల్స్ లేదా 6.5 గంటల యూట్యూబ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. 5 ఏళ్ల వరకు బ్యాటరీ పనితీరు తగ్గదని కంపెనీ చెబుతోంది.
ధర ఎంతంటే
Reno14 5G లో 4nm MediaTek Dimensity 8350 చిప్‌ను అందించారు. Cortex-A715 కోర్ డిజైన్ వల్ల 30% తక్కువ పవర్ వాడుతూ మంచి పనితీరు ఇస్తుంది. Mali-G615 GPU గేమింగ్, వీడియోలకు స్మూత్ అనుభవం ఇస్తుంది. AI టాస్కులకు ప్రత్యేక NPU 780 AI ప్రాసెసర్ ఉండటంతో AI ఫీచర్లు వేగంగా పని చేస్తాయి.
ఇక ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 39,999, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్‌తో పాటు ఒప్పో ఈ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంది.