MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే

Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే

Artificial Intelligence: పెరుగుతున్న AI టెక్నాలజీతో ప్రజల్లో తెలియని ఆందోళన. సాఫ్ట్ వేర్ రంగంలో ఇప్పటికే భూకంపం మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే సాఫ్ట్ వేర్ సిస్టమ్ కూలిపోతే ఆర్థిక సునామీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

3 Min read
Author : Nandini Arava
Published : Feb 26 2026, 09:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రజల జీవితాల్లో భాగమైపోయిన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI)
Image Credit : Getty

ప్రజల జీవితాల్లో భాగమైపోయిన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI)

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్. ప్రపంచంలో ఇదొక టెక్నాలజీ రెవెల్యూషన్. తెలియకుండానే జనాల్లోకి వెళ్లిపోయి తిష్ట వేసుకుంది. పెద్ద పెద్ద టెక్ దిగ్గజాల నుంచి స్కూల్ కు వెళ్లే పిల్లల వరకూ దీన్ని ఉపయోగించని వారు ఎవరూ లేరు. అంతలా పాతుకుపోయింది. స్కూల్లో పాఠాల్లోకి A.I వచ్చేసింది. యూట్యూబ్ లోనూ AI క్లాసులు. వర్సిటీలో స్పెషల్ కోర్సులు. AI ఉద్యోగాలు. ప్రత్యేకంగా దీని కోసం నేర్చుకునే వారు ఎక్కువగా పెరిగారు. AI కూడా అన్నీ చేసేస్తుంది. మనకు కావాల్సింది కాకుండా ఇంకాస్త ఎక్కువగానే ఇస్తోంది. అందువల్ల మరొకరిపై ఆధారపడాల్సిన పనితప్పించింది. సో ఇదంతా బాగానే ఉంది. టెక్నాలజీ దిశగా ప్రపంచం డెవలప్ అవ్వడం మంచి విషయమే. కానీ ఇక్కడే అసలు సమస్య, పెరుగుతున్న AI టెక్నాలజీతో ప్రజల్లో తెలియని ఆందోళన, దీని కారణంగా తుమ్మితే ఊడిపోయేలా ఉద్యోగాల పరిస్థితి తయారైంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగంలో భూకంపం మొదలైంది. ఉద్యోగుల్లో క్షణక్షణం టెన్షన్. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అని భయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేదే సాఫ్ట్ వేర్ సిస్టమ్
Image Credit : Getty

దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేదే సాఫ్ట్ వేర్ సిస్టమ్

అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేదే సాఫ్ట్ వేర్ సిస్టమ్. దాదాపు 30 ఏళ్లుగా సాఫ్ట్ వేర్ రంగంపైనే ఆధారపడింది. అలాంటి సాఫ్ట్ వేర్ రంగంపై AI ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు ఏఐ చేసేస్తుంది. ఇక ఉద్యోగులతో పనేముంది. అలాంటప్పుడు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు వీదేశాల నుంచి కాంట్రాక్టులు ఎలా వస్తాయి? ఒకవేళ రాకపోతే...అదే జరిగితే రియల్ ఎస్టేట్ కూలిపోతుంది, బ్యాంకులు దివాళా తీస్తాయి, అన్నీ వ్యాపారాలు సర్వం భూస్థాపితం అయిపోతాయి. ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ కొనేవారు ఉండరు. పరిస్థితి ఉహిస్తేనే భయంగా ఉంది కదా. ఇది నిజం. ఇదే నిజం. 

Related Articles

Related image1
Kaynes Technology IPO : స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకునే చాన్స్...కీన్స్ టెక్నాలజీ IPO గురించి వివరాలు
Related image2
V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?
36
సాఫ్ట్ వేర్ పైనే ఆధారపడి పొట్ట పోసుకుంటున్న ఎన్నో రంగాలు
Image Credit : Getty

సాఫ్ట్ వేర్ పైనే ఆధారపడి పొట్ట పోసుకుంటున్న ఎన్నో రంగాలు

ఇండియా లో ప్రతి పది ఇళ్లల్లో కనీసం అయిదు మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అమెరికా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , కెనడా .. ఇంకా ఎన్నో చోట్ల లక్షలాది కుటుంబాలు సాఫ్ట్ వేర్ పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఆదాయం మీద ఎన్నో రంగాలు పొట్టపోసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ , బ్యాంక్ సేవలు, ట్రావెల్, టూరిజం, హోటల్స్, మాల్స్, ఫుడ్ కోర్ట్స్ , బ్యూటీ ప్రొడక్ట్స్ ..అబ్బో ఇంకా ఎన్నో. ఇప్పుడు కొత్తగా AI వచ్చేసింది.సాఫ్ట్వేర్ ఇంజినీర్లు .. ముఖ్యంగా కొత్తగా చేరిన వారు చేసే కోడింగ్ పనులను AI చేసేస్తోంది . 

46
ఇందుగలడు, అందులేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు
Image Credit : Getty

ఇందుగలడు, అందులేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు

సో అన్నీ ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ చేస్తున్నప్పుడు కంపెనీలు కూడా AI పైనే ఆధారపడతాయి. ఇక ఉద్యోగులతో పనేముంది. ఖర్చు తక్కువ, లాభాలెక్కువ. ఒక వేళ అదే జరిగితే ఇంకేమైనా ఉందా. టీసీఎస్ , విప్రో, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు విదేశాలనుండి కాంట్రాక్టులు ఎలా వస్తాయి ? కాంట్రాక్టులు రాకపోతే ఉద్యోగులను తొలగించడం పక్కా. ఉన్న పనిని AI తో చేయించుకుంటాయి. AI చేయలేని పనంటూ ఏం లేదు. అన్ని రంగాల్లోకి దూరేసింది. ఇందుగలడు, అందులేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు అన్నట్లు తయారైంది. అందుకే AI ప్రభావం ముందుగా పడేది సాఫ్ట్ వేర్ రంగం పైనే. అదే సాఫ్ట్ వేర్ పై దెబ్బపడితే మన ఆర్థిక వ్యవస్థ భూస్థాపితం పక్కా. మరో మాటేలేదు.

56
సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలు ఎలా ఉన్నాయంటే...
Image Credit : Getty

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలు ఎలా ఉన్నాయంటే...

లక్షల్లో జీతాలు, లగ్జరీలకు అలవాటు పడిపోయిన ప్రాణాలు, EMIలు, కారు, హౌసింగ్ లోన్లు. అలాంటి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు పోతే…లక్షలమంది సాఫ్ట్ వేర్ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. దాని ప్రభావం రియల్ ఎస్టేట్ నుంచి మిగతా వ్యాపారాలపై పడుతుంది. సో ప్రభుత్వాలు ఇప్పుడే మేల్కొని ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. లేదంటే ముందుండే ఆర్థిక సునామిని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. మరో పాకిస్థాన్ లా మారిపోయే ప్రమాదం ఉంది. 2028 కల్లా భారత దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి.

66
రానున్నది AI యుగం..ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి
Image Credit : Getty

రానున్నది AI యుగం..ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి

అయితే ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూస్తూ కూర్చొంటే పనవ్వదు. ప్రజల్లో కూడా అవగాహన రావాలి. కట్టుకోవడానికి ఇల్లు ఓకే. అంతేకానీ ఫ్లాట్స్,ప్లాట్స్ కొనడం మంచిదికాదు. ఉద్యోగాలు పొతే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయి. బ్యాంకు రుణాలు కట్టలేరు. దానివల్ల బ్యాంకులు దివాళా తీస్తాయి. అందుకే పొదుపు చెయ్యడం చాలా మంచి పద్ధతి. అవసరమైన వస్తువులు తప్ప విలాసాలకు దూరంగా ఉండండి. ఐదేళ్లు ఆర్ధిక వ్యవస్థ కూలిపోయినా బతికేలా ఉండాలి. మరి కొన్ని రోజుల్లో డబ్బు, బంగారం , వెండికే విలువ.

ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే రానున్నది AI యుగం. సో AIని నడిపేవారు, అది చేయలేని పనులు చేసేవారికే ఉద్యోగాలు. అందువల్ల ఇప్పటినుంచే పిల్లల్లో స్కిల్స్ నేర్పించాలి. దీనివల్ల ఫ్యూచర్ ఎలాంటి బెంగా, బెదురు ఉండదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
Kaynes Technology IPO : స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకునే చాన్స్...కీన్స్ టెక్నాలజీ IPO గురించి వివరాలు
Recommended image2
V2V Technology : ఇక యాక్సిడెంట్లు ఉండవ్.. కార్లే డ్రైవర్లను అలర్ట్ చేస్తాయి ! ఏమిటీ V2V టెక్నాలజీ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved