MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • OnePlus: బ‌డ్జెట్ ధ‌ర‌లో బ్రాండెండ్ ఫోన్‌.. వ‌న్‌ప్ల‌స్ నుంచి కొత్త ఫోన్, అదిరిపోయే ఫీచ‌ర్లు

OnePlus: బ‌డ్జెట్ ధ‌ర‌లో బ్రాండెండ్ ఫోన్‌.. వ‌న్‌ప్ల‌స్ నుంచి కొత్త ఫోన్, అదిరిపోయే ఫీచ‌ర్లు

OnePlus Nord CE6 Lite: ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్ మార్కెట్లోకి వ‌న్‌ప్ల‌స్ నార్డ్ సీఈ6 లైట్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో కూడిన ఈ ఫోన్‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 14 2026, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో సూపర్ ఫాస్ట్ పనితీరు
Image Credit : Amazon.in

పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో సూపర్ ఫాస్ట్ పనితీరు

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్‌ ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 2.6GHz స్పీడ్‌తో పనిచేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ సెగ్మెంట్‌లోనే వేగవంతమైన ప్రాసెసర్లలో ఇది ఒకటి. యాప్స్ త్వరగా ఓపెన్ అవడం, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉండడం, ల్యాగ్ లేకుండా ఫోన్ పనిచేయడం ఈ ప్రాసెసర్ ప్రత్యేకత. ఇందులో 6GB RAM, 128GB స్టోరేజ్ అందించారు. ధ‌ర విష‌యానికొస్తే ఈ స్మార్ట్ 6GB+128GB వేరియంట్ ధ‌ర 20,999గా ఉంది. అయితే ప‌లు బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అద‌నంగా రూ. వెయ్యి వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
రెండు రోజులు పనిచేసే భారీ బ్యాటరీ
Image Credit : Amazon.in

రెండు రోజులు పనిచేసే భారీ బ్యాటరీ

ఈ ఫోన్‌లో 7000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో గంటల పాటు కాల్స్‌, యూట్యూబ్‌, గేమింగ్ చేసుకోవచ్చు. ఒక్క‌సారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ 81 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్ స‌పోర్ట్ చేస్తుంది. 26 గంటలకు పైగా యూట్యూబ్ వీడియోలు, 11 గంటలకు పైగా వీడియో కాల్స్ మాట్లాడుకోవ‌చ్చు.

Related Articles

Related image1
Hyderabad: ఒక్క ఫ్లాట్ ధ‌ర రూ. 23 కోట్లు.. హైదరాబాద్‌లో అత్యంత ఖ‌రీదైన అపార్ట్‌మెంట్స్ ఇవే
Related image2
Chiranjeevi: పాట‌లో దాగిన జీవిత స‌త్యం.. రీల్స్‌లో వైర‌ల్ అవుతోన్న ఈ పాట వెన‌క ఇంత అర్థం ఉందా.?
35
గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లు
Image Credit : Amazon.in

గేమింగ్ కోసం ప్రత్యేక ఫీచర్లు

గేమింగ్ ఇష్టపడేవారికి ఈ ఫోన్ మంచి అనుభవం ఇస్తుంది. ఇందులో 144 FPS వరకు గేమింగ్ సపోర్ట్ ఉంది. కొన్ని షూటింగ్ గేమ్స్‌లో 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 5300mm² VC Cooling System ఇచ్చారు. దీని వల్ల ఎక్కువసేపు గేమింగ్ చేసినా ఫోన్ ఎక్కువగా వేడెక్కకుండా ఉంటుంది. 5G++ నెట్‌వర్క్ సపోర్ట్‌తో ఆన్‌లైన్ గేమింగ్ కూడా స్మూత్‌గా ఉంటుంది.

45
అదిరిపోయే డిస్‌ప్లే
Image Credit : Amazon.in

అదిరిపోయే డిస్‌ప్లే

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంది. స్క్రోల్ చేయడం, వీడియోలు చూడడం, గేమింగ్ చేయడం చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆక్వా ట‌చ్ ఫీచర్ వల్ల చేతులు తడిగా ఉన్నా కూడా టచ్ సరిగ్గా పనిచేస్తుంది.

55
4K వీడియో రికార్డింగ్‌తో కెమెరా సెటప్
Image Credit : Amazon.in

4K వీడియో రికార్డింగ్‌తో కెమెరా సెటప్

ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా ఇచ్చారు. అలాగే 2MP డెప్త్ కెమెరా ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా అందించారు. ఈ ఫోన్‌తో 4K వీడియోలను 30FPSలో రికార్డ్ చేయవచ్చు. వీడియోలు క్లియర్‌గా కనిపిస్తాయి. అలాగే మోష‌న్ ఫోటోస్‌ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఇచ్చారు. కనీసం 5 సంవత్సరాలు స్మూత్‌గా పనిచేసేలా డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Robot Vacuum: ఉన్నోల్లే కాదండోయ్‌.. మ‌నం కూడా రోబో వ్యాక్యూమ్ కొనుక్కోవ‌చ్చు. త‌క్కువ ధ‌ర‌లోనే
Recommended image2
Best Camera Phones : కేవలం రూ.30000 లోపే 200MP కెమెరా ఫోన్.. ఫోటోలు, వీడియోలకు లైకుల వర్షం కురవాల్సిందే..!
Recommended image3
Amazon Great Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. ఐక్యూ, వివో ఫోన్లపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్!
Related Stories
Recommended image1
Hyderabad: ఒక్క ఫ్లాట్ ధ‌ర రూ. 23 కోట్లు.. హైదరాబాద్‌లో అత్యంత ఖ‌రీదైన అపార్ట్‌మెంట్స్ ఇవే
Recommended image2
Chiranjeevi: పాట‌లో దాగిన జీవిత స‌త్యం.. రీల్స్‌లో వైర‌ల్ అవుతోన్న ఈ పాట వెన‌క ఇంత అర్థం ఉందా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved