MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Gadgets
  • Best smartphones: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. 50MP కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో అదరగొడుతున్న బడ్జెట్ ఫోన్లు ఇవే !

Best smartphones: రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. 50MP కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో అదరగొడుతున్న బడ్జెట్ ఫోన్లు ఇవే !

Best smartphones under 10000: చిప్ ధరలు పెరగడంతో చాలా వరకు అన్ని కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచాయి. అయితే, రూ.10వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, 50MP కెమెరా, బిగ్ బ్యాటరీతో లభిస్తున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 04 2026, 07:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పైసా వసూల్ ఆఫర్.. అతి తక్కువ ధరలో బిగ్ బ్యాటరీ, బెస్ట్ డిస్‌ప్లే ఉన్న టాప్ ఫోన్లు ఇవే
Image Credit : Gemini

పైసా వసూల్ ఆఫర్.. అతి తక్కువ ధరలో బిగ్ బ్యాటరీ, బెస్ట్ డిస్‌ప్లే ఉన్న టాప్ ఫోన్లు ఇవే

మార్కెట్‌లో మొబైల్ ఫోన్ల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో తక్కువ బడ్జెట్‌లో, ఎక్కువ ఫీచర్లు ఉన్న బెస్ట్ ఫోన్ వెతకడం ఒక పెద్ద టాస్క్‌గా మారిపోయింది. అయితే, బడ్జెట్ కాస్త టైట్‌గా ఉన్నా సరే.. డైలీ యూజ్‌కు అవసరమైన అద్భుతమైన ఫీచర్లను అందించే బ్రాండ్లు మార్కెట్‌లో ఇంకా ఉన్నాయి.

మీరు ఆన్‌లైన్ క్లాసులు వినడానికైనా, సోషల్ మీడియాలో ఎండ్‌లెస్ స్క్రోలింగ్ చేయడానికైనా, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌ వాచింగ్ చేయడానికైనా ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్ అనే ఫోన్లు ఉన్నాయి. మీరు పెట్టే ప్రతి రూపాయికి ఈ ఫోన్లు వాల్యూ ఇస్తాయి. రూ. 10,000 లోపే పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే బ్యాటరీ లైఫ్, సూపర్ కెమెరాలు, మోడ్రన్ ఫీచర్లతో లభిస్తున్న కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్ల వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. మోటోరోలా మోటో G05
Image Credit : Filkart

1. మోటోరోలా మోటో G05

బడ్జెట్ రేంజ్‌లో మోటోరోలా మోటో G05 ఒక సూపర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల ఐపీఎస్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 

ఇక కెమెరా విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మీ డైలీ టాస్క్‌లను ఎలాంటి లాగ్ లేకుండా ఈజీగా మేనేజ్ చేస్తుంది.

Motorola Moto G05 ధర: రూ. 7,299

Related Articles

Related image1
WhatsApp e Challan: వాహనదారులకు అలర్ట్.. వాట్సాప్‌లోనే ట్రాఫిక్ చలాన్లు.. 30 రోజుల్లో ఆ పని చేయకపోతే లైసెన్స్ కట్ !
Related image2
IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
37
2. శామ్‌సంగ్ గెలాక్సీ F05
Image Credit : x- @AakashGourX

2. శామ్‌సంగ్ గెలాక్సీ F05

మీరు బ్రాండ్ వాల్యూ చూసుకునే వారైతే, శామ్‌సంగ్ నుంచి వస్తున్న గెలాక్సీ F05 ఒక బెస్ట్ పిక్ అవుతుంది. ఇందులో 6.74 ఇంచుల ఎల్‌సీడీ స్క్రీన్ లభిస్తుంది. ఫోటోలు, వీడియో కాల్స్ కోసం 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ డివైజ్ మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అంతేకాదు, ఇందులో 5,000mAh పెద్ద బ్యాటరీని ఇచ్చారు. కాబట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు.

Samsung Galaxy F05 ధర: రూ. 6,499

47
3. రెడ్‌మి A5 4G
Image Credit : Flipkart Website

3. రెడ్‌మి A5 4G

రోజూవారీ పనులను సింపుల్‌గా హ్యాండిల్ చేసే నమ్మకమైన ఫోన్ కావాలనుకుంటే రెడ్‌మి A5 4G వైపు లుక్ వేయొచ్చు. ఈ ఫోన్ 6.8 ఇంచుల బిగ్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ పెద్దగా కావాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. 

ఇందులో 32MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉన్నాయి. ఇందులో ఉన్న యునిసోక్ T7250 ప్రాసెసర్ భారీ గేమింగ్‌కు కాకపోయినా.. బేసిక్ యాప్స్, చాటింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి వాటికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది.

Redmi A5 4G ధర: రూ. 7,999

57
4. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ
Image Credit : Infinix Website

4. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ

బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ అనగానే ఇన్ఫినిక్స్ ఎప్పుడూ రేసులో ముందుంటుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ ఫోన్ 6.6 ఇంచుల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఎవరూ ఊహించని విధంగా 90Hz స్లిక్ రీఫ్రెష్ రేట్ ఇవ్వడం విశేషం. దీనివల్ల ఫోన్ స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. 

ఇందులో 13MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. యునిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీతో వస్తోంది. కాబట్టి పదే పదే ఛార్జర్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.

Infinix Smart 8 HD ధర: రూ. 6,699

67
5. ఐటెల్ జెనో 20 మాక్స్
Image Credit : our own

5. ఐటెల్ జెనో 20 మాక్స్

ఎక్కువ హంగామా లేకుండా, కేవలం బేసిక్ ఫీచర్లు తక్కువ ధరలో కావాలనుకుంటే ఐటెల్ జెనో 20 మాక్స్ ఫోన్ చూడొచ్చు. ఈ డివైజ్ 6.6 ఇంచుల డిస్‌ప్లేతో వస్తుంది. దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ తో 13MP మెయిన్ కెమెరా ఉంది. 

అలాగే ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఇందులో యునిసోక్ T7100 చిప్‌ను ఉపయోగించారు. ఇది మీ సోషల్ మీడియా అకౌంట్స్ బ్రౌజ్ చేయడానికి, వీడియోలు చూసుకోవడానికి చక్కగా సరిపోతుంది.

itel Zeno 20 Max ధర: రూ. 6,999

77
మీకు ఏ ఫోన్ సూట్ అవుతుంది?
Image Credit : Getty

మీకు ఏ ఫోన్ సూట్ అవుతుంది?

ఒకవేళ మీకు కెమెరానే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే.. మోటోరోలా మోటో G05 లేదా శామ్‌సంగ్ గెలాక్సీ F05 బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే ఈ బడ్జెట్‌లో ఇవి 50MP కెమెరాతో వస్తున్నాయి. 

బిగ్ స్క్రీన్ కావాలనుకుంటే రెడ్‌మి A5 4Gని ఎంచుకోవచ్చు. స్మూత్ స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే తక్కువ ధరలో 90Hz డిస్‌ప్లే ఇస్తున్న ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Recommended image2
Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలా ప‌నిచేస్తుంది.? దీనివ‌ల్ల ఫోన్ బ్యాట‌రీపై ప్ర‌భావం ప‌డుతుందా.?
Recommended image3
Portronics Vayu: పాకెట్‌లో ప‌ట్టే ఈ ప్రొడ‌క్ట్‌ ఉంటే చాలు.. ఎక్క‌డికైనా బిందాస్‌గా వెళ్లొచ్చు
Related Stories
Recommended image1
WhatsApp e Challan: వాహనదారులకు అలర్ట్.. వాట్సాప్‌లోనే ట్రాఫిక్ చలాన్లు.. 30 రోజుల్లో ఆ పని చేయకపోతే లైసెన్స్ కట్ !
Recommended image2
IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved