MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Chiranjeevi: పాట‌లో దాగిన జీవిత స‌త్యం.. రీల్స్‌లో వైర‌ల్ అవుతోన్న ఈ పాట వెన‌క ఇంత అర్థం ఉందా.?

Chiranjeevi: పాట‌లో దాగిన జీవిత స‌త్యం.. రీల్స్‌లో వైర‌ల్ అవుతోన్న ఈ పాట వెన‌క ఇంత అర్థం ఉందా.?

Song: పాత పాట‌ల‌కు రీల్స్ చేయ‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్. యువ‌త పెద్ద ఎత్తున ఈ పాటల‌కు డ్యాన్స్ చేస్తూ వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఈ జాబితాలోకి వ‌స్తుంది. త‌ర‌లిరాద త‌నే వ‌సంతం అనే పాట‌. ఇంత‌కీ పాట‌లో దాగిన అర్థం ఏంటంటే.. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 13 2026, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాట‌లో దాగిన జీవ‌న త‌త్వం
Image Credit : Gemini Music/Youtube

పాట‌లో దాగిన జీవ‌న త‌త్వం

తెలుగు సినీ సంగీత చరిత్రలో కొన్ని పాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు.. జీవితాన్ని ఆలోచింపజేయడానికి కూడా పుడతాయి. అలాంటి అపూర్వ గీతాల్లో ఒకటి రుద్ర‌వీణ సినిమాలోని “తరలిరాద తనే వసంతం”. ఈ పాటను సిరివెన్నెల సీత‌రామ‌శాస్త్రీ రాశారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో యువత ఈ పాటతో వేలాది రీల్స్ చేస్తున్నారు. కానీ ఈ గీతం అసలు చెప్పే భావం ఏమిటి? ఎందుకు ఇది తరాల్ని దాటుకుని ఇప్పటికీ హృదయాలను తాకుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వసంతం అంటే కాలం కాదు.. మనిషి మనసు
Image Credit : Gemini Music/Youtube

వసంతం అంటే కాలం కాదు.. మనిషి మనసు

“తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం” అనే లైన్‌లోనే మొత్తం పాట సారాంశం దాగి ఉంది. సాధారణంగా వసంతం అంటే ప్రకృతి. కానీ ఇక్కడ సిరివెన్నెల చెప్పింది వేరే భావం. మన దగ్గరకు ఆనందం, మార్పు, ప్రేమ రావాలని ఎదురు చూడకుండా… మనమే ఇంకొకరి జీవితంలో వసంతంలా మారాలని ఈ పాట చెబుతోంది. ఆకాశం త‌న ద‌గ్గ‌రికి రాని చెట్ల కోసం, వ‌ర్షం రూపంలో తానే వ‌స్తుంద‌నే గొప్ప సందేశాన్ని ఈ లైన్ అందిస్తుంది. అలాగే బాధలో ఉన్న వాళ్లకు ధైర్యం ఇవ్వడం, వెనుకబడినవాళ్లను ముందుకు తీసుకురావడం, సమాజంలో మార్పు తీసుకురావడం. ఇవే నిజమైన జీవితం అని పాట అర్థం.

Related Articles

Related image1
Facts: సూర్యుడి అస‌లు రంగు ఏంటి.? మ‌న‌కు ఆరెంజ్ క‌ల‌ర్‌లో ఎందుకు క‌నిపిస్తుంది.?
Related image2
Hyderabad: ఒక్క ఫ్లాట్ ధ‌ర రూ. 23 కోట్లు.. హైదరాబాద్‌లో అత్యంత ఖ‌రీదైన అపార్ట్‌మెంట్స్ ఇవే
35
ప్రకృతి ఉదాహరణలతో చెప్పిన గొప్ప తత్వం
Image Credit : Gemini Music/Youtube

ప్రకృతి ఉదాహరణలతో చెప్పిన గొప్ప తత్వం

“వెన్నెల దీపం కొందరిదా.. అడవికి సైతం వెలుగు కదా” అనే లైన్స్ చాలా గొప్పవి. చంద్రుడు ఒక ఇంటికే కాంతి ఇవ్వడు. గాలి కూడా ఒక్కరికోసం వీచదు. ప్రకృతి ఎవరిని తక్కువగా చూడదు. అదే విధంగా మన ప్రతిభ, జ్ఞానం, సంపద కూడా మనకే పరిమితం కాకూడదని ఈ పాట చెబుతోంది. మన వల్ల ఇంకొకరికి వెలుగు వెళ్లాలి. ఇదే అసలు మానవత్వం. ఈ భావననే చిరంజీవి పోషించిన‌ సూర్యం పాత్ర సినిమాలో ఆచరిస్తుంది. సంగీతాన్ని కేవలం కచేరీలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే మార్గంగా అతను చూస్తాడు. అందుకోసం క‌న్న తండ్రితోనే వాగ్వాదానికి దిగుతాడు.

45
‘రుద్రవీణ’ కథతో పాటకు ఉన్న సంబంధం
Image Credit : Gemini Music/Youtube

‘రుద్రవీణ’ కథతో పాటకు ఉన్న సంబంధం

కే. బాల‌చంద‌ర్ తెరకెక్కించిన ‘రుద్రవీణ’ సినిమా మొత్తం సామాజిక సందేశంతో నిండిపోయి ఉంటుంది. సూర్యం అనే యువకుడు కులం, సంప్రదాయాలు, అహంకారం కంటే మానవత్వం గొప్పదని నమ్ముతాడు. తండ్రి గణపతి శాస్త్రీ సంగీతాన్ని పరంపరగా చూస్తే… సూర్యం సంగీతాన్ని సమాజ మార్పు సాధనంగా చూస్తాడు. అందుకే “మానవ సేవే మాధవ సేవ” అనే భావంతో జీవిస్తాడు.

55
స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డని క‌ళ ఎందుకు.?
Image Credit : Gemini Music/Youtube

స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డని క‌ళ ఎందుకు.?

“ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం” అనే లైన్‌లో కళ సమాజానికి ఉపయోగపడకపోతే దాని విలువ ఏమిటని ప్రశ్నిస్తుంది. ఇది ఇప్పటి కాలానికీ వర్తిస్తుంది. టాలెంట్ ఉన్న యువత తమ ప్రతిభను కేవలం ఫేమ్ కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా మలచాలని ఈ పాట సూచిస్తోంది.

ఈ పాట నుంచి యువ‌త ఏం నేర్చుకోవాలి.?

ఇప్పటి జనరేషన్ ఈ పాట నుంచి చాలా నేర్చుకోవాలి. డబ్బు, ఫేమ్, సోషల్ మీడియా మధ్య నిజమైన సంతోషం ఎక్కడుందో తెలుసుకోవాలనే సందేశాన్ని చాటుతుందీ పాట‌. ఈ గీతంలో బాధ ఉంది… ఆశ ఉంది… మార్పు ఉంది… ముఖ్యంగా మనిషి ఇంకొకరి కోసం జీవించాలి అనే గొప్ప ఆలోచన ఉంది. అందుకే ఈ పాట రీల్స్‌లో వైరల్ అవుతోంది.ఈ పాటలో ప్రతి లైన్ కవితలా ఉంటుంది. వినేటప్పుడు మెలోడి అనిపించినా… అర్థం తెలుసుకుంటే ఇది ఒక జీవన పాఠంలా కనిపిస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Facts: సూర్యుడి అస‌లు రంగు ఏంటి.? మ‌న‌కు ఆరెంజ్ క‌ల‌ర్‌లో ఎందుకు క‌నిపిస్తుంది.?
Recommended image2
Hyderabad: ఒక్క ఫ్లాట్ ధ‌ర రూ. 23 కోట్లు.. హైదరాబాద్‌లో అత్యంత ఖ‌రీదైన అపార్ట్‌మెంట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved