- Home
- Technology
- Mobiles Offer : కేవలం రూ.14,999 కే 4GB RAM, 64GB స్టోరేజ్ మొబైల్.. పండక్కి కొత్త ఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్
Mobiles Offer : కేవలం రూ.14,999 కే 4GB RAM, 64GB స్టోరేజ్ మొబైల్.. పండక్కి కొత్త ఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్
భారత మార్కెట్లోకి ఐటెల్ సిటీ 300 5G (Itel City 300 5G) ఫోన్ వచ్చేసింది. కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇది మంచి ఆప్షన్. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
14

Image Credit : x.com
ఐటెల్ సిటీ 300 5G ఫోన్
ఐటెల్ కంపెనీ సిటీ 300 5G స్మార్ట్ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. స్మూత్ స్క్రోలింగ్ కోసం ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తోంది. అలాగే ఇందులో 5,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
24
Image Credit : x.com
ఐటెల్ సిటీ 300 5G ధర ఎంతంటే?
ఈ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ ₹14,999 గా నిర్ణయించింది. డార్క్ రూబీ, మిస్ట్ బీజ్, బోల్డ్ ఇండిగో అనే మూడు కలర్స్‌లో ఈ ఫోన్ దొరుకుతుంది. కస్టమర్లు ఈ మొబైల్‌ను ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
34
Image Credit : x.com
ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇవే..
- 6.67-అంగుళాల HD+ LCD స్క్రీన్
- 120Hz రిఫ్రెష్ రేట్
- పంచ్-హోల్ డిజైన్ డిస్‌ప్లే
- 2.5D కర్వడ్ గ్లాస్
- 6nm టెక్నాలజీతో తయారీ
- యూనిసాక్ T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్
- 4GB LPDDR4X RAM, 64GB స్టోరేజ్
- మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం
44
Image Credit : x.com
ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్‌పై పనిచేస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కంపెనీ ఇందులో ఇచ్చింది. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.0, వై-ఫై 5 సపోర్ట్ ఉన్నాయి.
- ఐటెల్ సిటీ 300 5G బ్యాటరీ, కెమెరా వివరాలు
- 5,000mAh బ్యాటరీ సామర్థ్యం
- 10W ఛార్జింగ్ సపోర్ట్
- బాక్స్‌లోనే ఛార్జర్ వస్తుంది
- 13MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా
Latest Videos

