MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes Offer : రూ.2,80,000 సూపర్ బైక్ కేవలం రూ.4,999 కే మీసొంతం.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్

Bikes Offer : రూ.2,80,000 సూపర్ బైక్ కేవలం రూ.4,999 కే మీసొంతం.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్

క్లాసిక్ లుక్, మోడ్రన్ ఫీచర్లతో బైక్ కొనాలనుకునే వారికి ట్రయంఫ్ అదిరిపోయే ఆప్షన్ తీసుకొచ్చింది. కొత్తగా బోన్‌విల్లే టీ40 (Bonneville T40) బైక్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.4,999 చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. దీని ధర, ఫీచర్ల వివరాలు చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 10 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రయంఫ్ బోన్‌విల్లే T40 వచ్చేసింది
Image Credit : Triumph

ట్రయంఫ్ బోన్‌విల్లే T40 వచ్చేసింది

క్లాసిక్ లుక్ ఉండే ప్రీమియం బైక్స్‌ను ఇష్టపడే వారి కోసం ట్రయంఫ్ సంస్థ ఇండియాలో కొత్త బోన్‌విల్లే టీ40 (Bonneville T40) బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఆసక్తి ఉన్నవారు కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రూ.4,999 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రకారం ఈ బైక్ ధరను రూ.2,79,999గా కంపెనీ ప్రకటించింది.

దీనితో పాటే బ్లాక్ కలర్ డిజైన్‌తో బోన్‌విల్లే టీ40 బ్లాక్ మోడల్‌ను కూడా తీసుకొచ్చింది. ఇక తక్కువ ధరలో బోన్‌విల్లే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే T4 మోడల్ ప్రారంభ ధర రూ.2,54,999గా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే కాబట్టి.. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కలిపితే ఆన్-రోడ్ ధర పెరుగుతుంది. అందుకే బుక్ చేసుకునే ముందు మీ సిటీలోని డీలర్‌షిప్ దగ్గర ఫైనల్ ధర కనుక్కోవడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ట్రయంఫ్ కొత్త బైక్ ఫీచర్లు
Image Credit : Triumph

ట్రయంఫ్ కొత్త బైక్ ఫీచర్లు

ఈ బైక్ ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. పాతకాలం నాటి డిజైన్‌కు మోడ్రన్ టెక్నాలజీని జోడించడమే. రెట్రో లుక్‌తో పాటు ఇందులో 4-అంగుళాల రౌండ్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, కాల్స్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అలాగే ఐదు రైడింగ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కంపెనీ అందించింది. రైడర్ అవసరాలకు తగ్గట్టుగా జర్నీని మరింత కంఫర్ట్‌గా మార్చేందుకు ఈ ఫీచర్లు భలే ఉపయోగపడతాయి.

35
ట్రయంఫ్ బోన్‌విల్లే T40 ఇంజిన్
Image Credit : Triumph

ట్రయంఫ్ బోన్‌విల్లే T40 ఇంజిన్

ఇంజిన్ విషయానికొస్తే.. బోన్‌విల్లే టీ40 మోడల్‌లో ట్రయంఫ్ TR సిరీస్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇండియా లాంచ్ వివరాల ప్రకారం… ఇది 350cc కేటగిరీకి చెందింది. అయితే కంపెనీ మాత్రం 400cc TR సిరీస్ టెక్నాలజీ గురించి కూడా ప్రస్తావించింది. అఫీషియల్ ఇండియన్ స్పెక్స్ చూస్తే.. ఇందులో 349cc ఇంజిన్ ఉంది. ఇది 29 PS గరిష్ట పవర్‌ను, 31.2 Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు.

దీనివల్ల సిటీ ట్రాఫిక్‌లో, లాంగ్ డ్రైవ్‌లలో గేర్లు మార్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. రైడ్-బై-వైర్ థ్రోటల్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. క్లచ్ వాడకాన్ని సులభతరం చేయడానికి, గేర్లు మార్చేటప్పుడు కంట్రోల్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇవి హెల్ప్ అవుతాయి.

45
బోన్‌విల్లే T40 సేఫ్టీ ఫీచర్లు
Image Credit : Triumph

బోన్‌విల్లే T40 సేఫ్టీ ఫీచర్లు

సస్పెన్షన్, సేఫ్టీ ఫీచర్ల మీద కూడా ఈ బైక్ బాగా ఫోకస్ చేసింది. ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులు ఇచ్చారు. సడెన్ బ్రేక్ వేసినప్పుడు టైర్లు స్కిడ్ అవ్వకుండా ఏబీఎస్ (ABS) సేఫ్టీ ఫీచర్ కాపాడుతుంది. ముందువైపు 18 అంగుళాల చక్రం, వెనుకవైపు 17 అంగుళాల చక్రం అందించారు.

ఆటోమొబైల్ వెబ్‌సైట్ల సమాచారం ప్రకారం.. ఈ బైక్ సీటు ఎత్తు సుమారు 790 మి.మీ, బరువు 195 కిలోలు ఉంటుంది. కాబట్టి బైక్ కొనేముందు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి.. సీటు ఎత్తు, బరువు, సిటీ ట్రాఫిక్‌లో హ్యాండ్లింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోవడం మంచిది.

55
బైక్ డెలివరీ వివరాలు
Image Credit : Triumph

బైక్ డెలివరీ వివరాలు

డెలివరీ విషయానికొస్తే.. బోన్‌విల్లే టీ40, టీ40 బ్లాక్ మోడల్స్ డెలివరీలు 2026 నవంబర్ నెలలో మొదలవుతాయని కంపెనీ తెలిపింది. ఇక తక్కువ ధరలో వచ్చే బోన్‌విల్లే T4 మోడల్ డెలివరీలను 2027 జనవరిలో ప్రారంభించనున్నారు. అయితే మీరు ఉండే సిటీ, డీలర్ దగ్గర ఉన్న స్టాక్, బుకింగ్ క్యూ ఆధారంగా డెలివరీ తేదీలు మారే అవకాశం ఉంది.

అందుకే రూ.4,999 కట్టి బుక్ చేసుకునే ముందే.. ఆ డబ్బులు రిఫండ్ అవుతాయా? క్యాన్సిలేషన్ రూల్స్ ఏంటి? బైక్ ఎప్పుడు చేతికి వస్తుంది? లాంటి వివరాలను డీలర్ దగ్గర క్లియర్‌గా కనుక్కోండి.

క్లాసిక్ లుక్, మోడ్రన్ ఫీచర్లు కోరుకునే వారికి బోనోవిల్లె బైక్స్ బెస్ట్ ఆప్షన్. కానీ ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు ఆన్-రోడ్ ధర, మెయింటెనెన్స్ ఖర్చు, బరువు, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ బేరీజు వేసుకోవడం ముఖ్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతీయ ఆటోమొబైల్
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?
Recommended image2
New Car Vs Used Car : కొత్త కారా లేక సెకండ్ హ్యాండ్ కారా? 2026లో ఏది కొంటే బెస్ట్!
Recommended image3
Top 5 Cheapest Bikes : పండగ సీజన్లో కేవలం రూ.60,000 కే.. మైండ్ బ్లోయింగ్ మైలేజ్ బైక్ మీ సొంతం
Related Stories
Recommended image1
Top 5 Bikes : ఇండియన్ యూత్ ను షేక్ చేసేలా.. ఈ నెలలో లాంచ్ అయ్యే టాప్ 5 సూపర్ బైక్స్ ఇవే
Recommended image2
Top 5 Cheapest Bikes : పండగ సీజన్లో కేవలం రూ.60,000 కే.. మైండ్ బ్లోయింగ్ మైలేజ్ బైక్ మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved