MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Internet speed: సెకనులో 10 సినిమాలు డౌన్‌లోడ్‌.. స్టార్‌లింక్‌ని మించి, 100 జీబీపీఎస్‌తో ఇంటర్నెట్‌ సేవలు

Internet speed: సెకనులో 10 సినిమాలు డౌన్‌లోడ్‌.. స్టార్‌లింక్‌ని మించి, 100 జీబీపీఎస్‌తో ఇంటర్నెట్‌ సేవలు

ఒకప్పుడు ఇంటర్నెట్‌ వేగం చాలా స్లోగా ఉండేది. ఒక పాటను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే కనీసం 30 నిమిషాలు పట్టేది. 5జీ, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే తాజాగా చైనాకు చెందిన ఓ సంస్థ ఇంటర్నెట్‌ సేవల్లో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తోంది..   

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 24 2025, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రపంచ కుబేరుళ్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి వైర్‌ కనెక్షన్‌ లేకుండా నేరుగా శాటిలైట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందించడం స్టార్‌ లింక్‌ ముఖ్య ఉద్దేశం. దీంతో మారుమూల గ్రామాల్లో ఉన్న వారికి కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ లభిస్తుంది. ఇప్పటికే స్టార్‌ లింక్‌ సేవలను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఎయిర్‌టెల్‌, జియోతో ఒప్పందం చేసుకున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇదిలా ఉంటే ఈ జాబితాలో మరో సంస్థ దూసుకుపోతోంది. స్పేస్ కమ్యూనికేషన్‌ రంగంలో స్టార్‌లింక్‌ కంటే వేగమైన సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ అనే సంస్థ రూపొందించిన తాజా లేజర్ కమ్యూనికేషన్‌ సిస్టమ్ 100 Gbps స్పీడ్‌తో ఉపగ్రహం నుంచి భూమికి డేటా పంపగలదు. ఇది ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ టెక్నాలజీ కన్నా చాలా వేగంగా పనిచేస్తోంది. చైనా సంస్థ ఇప్పటికే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 

34

ఈ టెక్నాలజీని జిలిన్–1 శాటిలైట్ కాస్టెలేషన్ ద్వారా అభివృద్ధి చేశారు. 2027 నాటికి 300 శాటిలైట్లతో పెద్ద నెట్‌వర్క్ ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకుందీ సంస్థ. ఈ వ్యవస్థ ప్రత్యేకత ఏంటంటే.. ఇది చిన్న బ్యాక్‌ప్యాక్ పరిమాణంలో ఉండే లేజర్ కమ్యూనికేషన్ టెర్మినల్‌ను ఉపయోగిస్తుంది. ఇవి మొబైల్ గ్రౌండ్ స్టేషన్లపై అమర్చిన ఉపగ్రహాల నుంచి భూమికి, శాటిలైట్‌లు పరస్పరం డేటా పంపించేందుకు పనిచేస్తాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితితులైనా తట్టుకొని పని చేయగలవు. 
 

44

ఒక సెకనులో పది సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకునే సామర్థ్యం ఈ టెక్నాలజీ సొంతం. నావిగేషన్, 6G ఇంటర్నెట్, రిమోట్ సెన్సింగ్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ టెక్నాలజీ నాది పలకనుంది. లేజర్ ఆధారిత స్పేస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రపంచంలోనే ముందు వరుసలో నిలవనుంది. ఇక చాంగ్‌ గువాంగ్‌ శాటిలైట టెక్నాలజీ విషయానికొస్తే ఇది చైనాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ప్రపంచం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Aadhaar Card: కేవలం 1 నిమిషంలో సులభంగా ఆధార్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసా?
Recommended image2
Instagram: బోరింగ్ ఇన్‌స్టా ప్రొఫైల్‌కి గుడ్ బై చెప్పేయండి.. ఈ సీక్రెట్ టిప్స్‌తో ట్రెండీగా మారండి
Recommended image3
Vivo V80 Review: అదిరిపోయే కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీ.. కానీ రూ. 63 వేల ధరతో వీవో V80 కొనొచ్చా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved