- Home
- Technology
- మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?
మీ వాట్సాప్ హ్యాక్ అయినట్లు తెలిపే సంకేతాలేమిటో తెలుసుకొండి... ఇవి మీ ఫోన్ లో ఇవి కనిపించాయో వెంటనే అలర్ట్ కండి. వాట్సాప్ ను సురక్షితంగా ఉంచుకోవడానికి సులభమైన మార్గాల గురించి తెలుసుకొండి... సైబర్ క్రైమ్ బారిన పడకుండా జాగ్రత్తపడండి.

మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందో లేదో ఇలా తెలుసుకొండి...
WhatsApp Hacked : భారతదేశంలో ఎక్కువగా వాడే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. వ్యక్తిగత మెసేజ్‌ల నుంచి బ్యాంకు లావాదేవీల (వాట్సాప్ పే) వరకు అన్నీ దీని ద్వారానే జరుగుతాయి. అందుకే ఇది హ్యాక్ అయితే పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది.
ఇటీవలకాలంలో వాట్సాప్ హ్యాక్ అవుతున్నట్లు ఎక్కువగా వినిపిస్తోంది. వాట్సాప్ కు లింకులు, ఫైల్స్ పంపించి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. మరి మీ వాట్సాప్ కూడా వింతగా ప్రవర్తిస్తున్నట్లు అనిపిస్తే, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎవరో మీ ఖాతాను రహస్యంగా గమనించే అవకాశం ఉంది.. సైబర్ నేరాలకు ఆస్కారం ఉంటుంది.
అయితే చాలామందికి ఓ డౌట్ ఉంటుంది... అసలు వాట్సాప్ హ్యాక్ అయినట్లు తెలుసుకోవడం ఎలా? ఇలాంటివారి కోసమే ఈ సమాచారం. మీ వాట్సాప్ హ్యాక్ అయితే కనిపించే సంకేతాలేమిటో ఇక్కడ అందిస్తున్నాం.
వాట్సాప్ హ్యాకింగ్ కు ఇదే సంకేతం...
వాట్సాప్ హ్యాక్ అయితే కనిపించే మొదటి, ముఖ్యమైన సంకేతమిది. మీరు వాట్సాప్ వాడుతున్నప్పుడు "Your phone number is no longer registered" అనే మెసేజ్ వచ్చినా లేదా ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అయినా హ్యాక్ అయినట్లే. మీ ఫోన్ నంబర్‌ను ఇతరులెవరో వేరే మొబైల్‌లో రిజిస్టర్ చేశారని అర్థం.
మాా ప్రమేయం లేకుండానే మెసేజ్ లు..
మీ స్నేహితులు లేదా బంధువులు, "నువ్వు ఈ మెసేజ్ ఎందుకు పంపావు?" అని అడిగారనుకొండి... కానీ మీరు అలాంటి మెసేజ్ ఏదీ పంపకపోతే వెంటనే అప్రమత్తం అవ్వండి. మీ వాట్సాప్ ఖాతా వేరొకరి నియంత్రణలో ఉందని చెప్పడానికి ఇది స్పష్టమైన సంకేతం.
లింక్డ్ డివైస్ చెక్ చేసుకొండి
మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'లింక్డ్ డివైజెస్' విభాగానికి వెళ్ళండి. అక్కడ మీకు తెలియని కంప్యూటర్ లేదా వేరే ప్రదేశం (లాగిన్ లొకేషన్) నుంచి మీ ఖాతా లాగిన్ అయి ఉంటే, ఎవరో మీ మెసేజ్‌లను చదువుతున్నారని అర్థం.
బ్యాగ్రౌండ్ లో వాట్సాప్ రన్ అయితే..
మీ వాట్సాప్‌లోకి మాల్‌వేర్ లేదా స్పైవేర్ ప్రవేశిస్తే అది బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీ మొబైల్ అసాధారణంగా వేడెక్కుతుంది, బ్యాటరీ ఛార్జ్ వేగంగా తగ్గిపోతుంది. మొబైల్ వేగం తగ్గడం (స్లో పర్ఫార్మెన్స్) కూడా వ్యాట్సాప్ హ్యాకింగ్ కు ఒక సంకేతమే.
మీ అనుమతి లేకుండా గ్రూప్ లో యాడ్ అయితే...
మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్‌లో మీకు తెలియని కొత్త నంబర్లు చేరినా లేదా మీ అనుమతి లేకుండా ఏదైనా గ్రూపుల్లో మీ నంబర్ యాడ్ అయినా జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్లు మీ ఖాతాను ఉపయోగించి ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు.
ఇలా చేశారో మీ వాాట్సాప్ సేఫ్
• 2-స్టెప్ వెరిఫికేషన్: సెట్టింగ్స్‌లో అకౌంట్ > 2-స్టెప్ వెరిఫికేషన్ విభాగానికి వెళ్లి 6-అంకెల పిన్ నంబర్‌ను సెట్ చేయండి. ఇది హ్యాకర్లు మీ ఖాతాను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది.
• వెంటనే లాగ్ అవుట్ చేయండి: లింక్డ్ డివైజెస్ విభాగానికి వెళ్లి, అనుమానాస్పద అన్ని పరికరాల నుంచి లాగ్ అవుట్ చేయండి.
• మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి: అనుమానం ఎక్కువగా ఉంటే వాట్సాప్‌ను అన్-ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. ఇది అనధికార కనెక్షన్‌లను తొలగిస్తుంది.
• OTP పంచుకోవద్దు: వాట్సాప్ లేదా ఏ ఇతర కాల్ ద్వారా వచ్చే OTP నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దు.
• అప్‌డేట్ చేయండి: మీ మొబైల్ సాఫ్ట్‌వేర్, వాట్సాప్ యాప్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేసి ఉంచుకోండి.
ఆందోళన చెందకుండా ఈ పద్ధతులు పాటిస్తే చాలు, మీ వాట్సాప్ ఖాతాను నిమిషాల్లో సురక్షితం చేసుకోవచ్చు.

