MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్

కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్

iPhone 17 available at 45900: క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింది. ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్‌తో ఫోన్‌ను కేవలం రూ.45,900కే పొందే అవకాశముంది. పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 28 2025, 11:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బ్లాక్ ఫ్రైడే సంచలనం: క్రోమాలో ఐఫోన్ 17పై భారీ తగ్గింపు
Image Credit : Getty

బ్లాక్ ఫ్రైడే సంచలనం: క్రోమాలో ఐఫోన్ 17పై భారీ తగ్గింపు

టెక్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూసే బ్లాక్ ఫ్రైడే సేల్ సీజన్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఆపిల్ ఫోన్ల పై ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ క్రోమా ఈ ఏడాది అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌ను ప్రకటించింది. 

సాధారణంగా రూ.82,900 ధర గల ఆపిల్ ఐఫోన్ 17 (Apple iPhone 17)... ప్రత్యేక ఆఫర్లను క్లబ్ చేసుకున్నవారికి కేవలం రూ.45,900కే లభిస్తోంది. ఇది ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన ఆఫర్.

ఈ డీల్ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా రిటైల్ స్టోర్లలో మాత్రమే ఉంది. నవంబర్ 30 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుందని తెలిపింది.

26
ఇంత తక్కువ ధరకు ఐఫోన్ 17 ఎలా వస్తోంది? ఆఫర్లు ఏమిటి?
Image Credit : Getty

ఇంత తక్కువ ధరకు ఐఫోన్ 17 ఎలా వస్తోంది? ఆఫర్లు ఏమిటి?

క్రోమా ఈ ధరను మూడు వేర్వేరు ప్రయోజనాలను కలిపి అందిస్తుంది.

1. బ్యాంక్ క్యాష్‌బ్యాక్ – రూ.1,000

ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో చెల్లింపు చేస్తే వెంటనే వర్తించే డిస్కౌంట్.

2. ఎక్స్ఛేంజ్ విలువ – రూ.29,000 వరకు

మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, వయస్సు, కండిషన్ ఆధారంగా ట్రేడ్-ఇన్ విలువ నిర్ణయిస్తారు.

3. ఎక్స్ఛేంజ్ బోనస్ – రూ.7,000

పాత ఫోన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి వర్తించే అదనపు ప్రోత్సాహకం ఇది.

ఈ మూడు కలిపి రూ.82,900 ఐఫోన్ 17 ధరను రూ.45,900 లకు తీసుకొచ్చింది.

Related Articles

Related image1
డిసెంబర్ లో సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు
Related image2
భారత్‌కు పొంచి ఉన్న భారీ ముప్పు : 61 శాతం దేశం డేంజర్ జోన్‌లోనే !
36
ఐఫోన్ 17 లో అద్భుతమైన ఫీచర్లు
Image Credit : Getty

ఐఫోన్ 17 లో అద్భుతమైన ఫీచర్లు

ఆపిల్ ఈ సంవత్సరం విడుదల చేసిన iPhone 17 బేస్ మోడల్, డిజైన్ నుంచి అంతర్గత పనితీరుకు వరకు అనేక ప్రధాన అప్ గ్రేడ్ లను కలిగి ఉంది.

ఐఫోన్ 17 డిస్‌ప్లే, డిజైన్

• 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED

• 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్

• 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

• సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్

• IP68 డస్ట్/వాటర్ రెసిస్టెన్స్

• రంగులు: లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, బ్లాక్, వైట్

ఈ డిస్‌ప్లే మరింత సున్నితమైన స్క్రోలింగ్, స్పష్టమైన దృశ్యాలు, HDR10 & డాల్బీ విజన్ సపోర్ట్‌తో విజువల్ అనుభూతిని పూర్తిగా మార్చేస్తుంది.

46
పనితీరులో ఐఫోన్ 17 దూకుడు.. A19 ప్రాసెసర్ శక్తి
Image Credit : Getty

పనితీరులో ఐఫోన్ 17 దూకుడు.. A19 ప్రాసెసర్ శక్తి

ఐఫోన్ 17 A19 చిప్ సెట్, 3nm టెక్నాలజీతో రూపొందించారు.

• 6-కోర్ CPU

• 5-కోర్ GPU

• 8GB RAM

• 256GB & 512GB స్టోరేజ్ ఆప్షన్లు

• iOS 26

గేమింగ్, హై-ఎండ్ మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు మరింత వేగంగా, మెరుగ్గా చేసుకోవచ్చు.

56
కెమెరా విభాగంలో ఆపిల్ మళ్లీ అదరగొట్టింది.
Image Credit : Getty

కెమెరా విభాగంలో ఆపిల్ మళ్లీ అదరగొట్టింది.

ఐఫోన్ 17 కెమెరా సెటప్

• 48MP + 48MP డ్యూయల్ ఫ్యూజన్ సిస్టమ్

• 120° అల్ట్రా-వైడ్

• 4K డాల్బీ విజన్

• 8x ఆప్టికల్-క్వాలిటీ జూమ్

ఫ్రంట్ కెమెరా

• 18MP సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా

వీడియో కాల్‌లలో మీ ముఖాన్ని ఆటోమేటిక్‌గా ఫ్రేమ్‌లో ఉంచే ఆపిల్ సెంటర్ స్టేజ్ టెక్నాలజీ ఇక్కడ కూడా అందుబాటులో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 17 బ్యాటరీ & ఛార్జింగ్

• 3692mAh బ్యాటరీ – 30 గంటల వీడియో ప్లేబ్యాక్

• 40W ఫాస్ట్ ఛార్జింగ్ – 30 నిమిషాల్లో 50%

• 25W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్

రోజువారీ వాడకంలో బ్యాటరీ పనితీరు చాలా వరకు మెరుగుపడింది.

66
Apple Intelligenceతో సరికొత్త AI అనుభూతి
Image Credit : Getty

Apple Intelligenceతో సరికొత్త AI అనుభూతి

ఐఫోన్ 17లో కొత్తగా వచ్చిన Apple Intelligence ఫీచర్లు

• లైవ్ ట్రాన్స్ లేట్

• ఫోటో ప్లే గ్రౌండ్

• రైటింగ్ టూల్స్

• ఏఐ అసిస్టెంట్

ప్రతి పనిని మరింత స్మార్ట్‌గా చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు.

ఎవరికి ఈ ఆఫర్ బెస్ట్?

• కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి

• మంచి కండిషన్‌లో పాత ఫోన్ ఉన్నవారికి

• డిసెంబర్ షాపింగ్‌లో భారీ సేవింగ్ కోరుకునే వినియోగదారులకు

• AI ఫీచర్లతో కూడిన కొత్త తరం డివైస్ అవసరం ఉన్నవారికి

ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్ 2025లో అత్యధిక డిమాండ్ ఉన్న డీల్స్‌లో ఒకటిగా మారే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఇ-కామర్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
బిగ్ షాక్.. రిస్క్‌లో 350 కోట్ల వాట్సాప్ యూజర్ల డేటా
Recommended image2
క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ ఎఫెక్ట్: ప్రపంచవ్యాప్తంగా X, ChatGPT సహా అనేక యాప్స్ బంద్
Recommended image3
సూపర్ ఫీచర్లతో Oppo Find X9 సిరీస్ లాంచ్ : స్పెక్స్, ధర, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవే
Related Stories
Recommended image1
డిసెంబర్ లో సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు
Recommended image2
భారత్‌కు పొంచి ఉన్న భారీ ముప్పు : 61 శాతం దేశం డేంజర్ జోన్‌లోనే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved