MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • Gadgets
  • CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!

CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో ఓపెన్ ఇయర్ బడ్స్ లాంచ్.. కేక పుట్టించే ఫీచర్లు!

Nothing CMF Clip Pro: నథింగ్ సీఎంఎఫ్ క్లిప్ ప్రో పేరుతో ఓపెన్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. సింగిల్ ఛార్జ్ తో 10 గంటల బ్యాటరీ లైఫ్, స్మార్ట్ డయల్ కేస్ లాంటి క్రేజీ ఫీచర్లు తెచ్చింది. కొత్త డిజైన్‌తో వచ్చిన ఓపెన్ ఇయర్‌బడ్స్ ఇతర ఫీచర్ల వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 05 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నథింగ్ మార్కెట్‌లోకి వదిలిన కొత్త గ్రావిటీ బడ్స్.. చెవికి తొడిగితే చాలు సౌండ్ అదిరిపోద్ది
Image Credit : X/techiboy96

నథింగ్ మార్కెట్‌లోకి వదిలిన కొత్త గ్రావిటీ బడ్స్.. చెవికి తొడిగితే చాలు సౌండ్ అదిరిపోద్ది

ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్ తన సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ కింద తొలిసారి ఓపెన్ ఇయర్ స్టైల్ కు చెందిన ఇయర్‌బడ్స్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది. దీనికి సీఎంఎఫ్ క్లిప్ ప్రో (CMF Clip Pro) అని పేరు పెట్టారు. మార్కెట్‌లో సాధారణంగా కనిపించే ఇన్-ఇయర్ బడ్స్‌కు భిన్నంగా, ఇవి చెవి బయటి భాగంలో క్లిప్‌లా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధరను $99 (సుమారు రూ. 8,300) గా నిర్ణయించారు. ముందస్తు ఆర్డర్ చేసేవారికి $79 ప్రత్యేక ఆఫర్ ధర అందుబాటులో ఉంది. ఇవి లైట్ గ్రే, డార్క్ గ్రే, కోరల్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
CMF Clip Pro: తేలికపాటి డిజైన్, ఫ్లెక్సిబుల్ సీ-బ్రిడ్జ్
Image Credit : X/NimishAndAkriti

CMF Clip Pro: తేలికపాటి డిజైన్, ఫ్లెక్సిబుల్ సీ-బ్రిడ్జ్

సీఎంఎఫ్ క్లిప్ ప్రో ప్రతి బడ్ బరువు కేవలం 5.9 గ్రాములు మాత్రమే ఉంటుంది. రోజంతా ధరించినా ఎలాంటి నొప్పి లేదా అసౌకర్యం కలగకుండా దీనిని డిజైన్ చేశారు. ఇందులో ఫ్లెక్సిబుల్ టైటానియం వైర్ కోర్‌తో కూడిన సీ-బ్రిడ్జ్ అమర్చారు. ఇది చెవి ఆకారానికి తగినట్లుగా ముడుచుకుంటుంది. మూడు పాయింట్ల ఆధారంతో ఒత్తిడిని సమంగా పంచుతుంది. పరిసరాల్లోని శబ్దాలు వింటూనే మ్యూజిక్ ఎంజాయ్ చేసేలా ఇవి పనిచేస్తాయి. వీటికి ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. కాబట్టి జిమ్, అవుట్‌డోర్ వాకింగ్ చేసేవారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

Related Articles

Related image1
How To Identify Fake Liquor: నకిలీ, కల్తీ మందును ఎలా గుర్తుపట్టాలో తెలుసా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసం
Related image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
35
కేక పుట్టించే ఆడియో క్వాలిటీ, ఆల్ట్రా బేస్
Image Credit : X/techiboy96

కేక పుట్టించే ఆడియో క్వాలిటీ, ఆల్ట్రా బేస్

ఈ ఇయర్‌బడ్స్‌లో 10.8mm డ్యూయల్-మ్యాగ్నెటిక్ డైనమిక్ ఆడియో డ్రైవర్‌ను ఇచ్చారు. ఓపెన్ ఇయర్ ఇయర్‌బడ్స్‌లో సాధారణంగా బేస్ సౌండ్ తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి నథింగ్ ఆల్ట్రా బేస్ టెక్నాలజీ ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫ్రీక్వెన్సీలను బ్యాలెన్స్ చేస్తూ నాణ్యమైన బేస్‌ను అందిస్తుంది. ఇవి హైరెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో పాటు ఎల్డీఏసీ, ఏఏసీ, ఎస్బీసీ కోడెక్స్‌కు సపోర్ట్ చేస్తాయి. ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు వీలుగా 4 మైక్రోఫోన్లు, వీపీయూ ప్రాసెసింగ్ ఇచ్చారు. నథింగ్ ఎక్స్ యాప్ ద్వారా ఆడియో లీకేజ్‌ను నివారించే సౌండ్ సీల్ సిస్టమ్ ఫీచర్ పనిచేస్తుంది.

45
కేస్‌పై స్మార్ట్ డయల్, అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్
Image Credit : X/techiboy96

కేస్‌పై స్మార్ట్ డయల్, అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్

సీఎంఎఫ్ క్లిప్ ప్రో కేస్‌పై ప్రత్యేకంగా స్మార్ట్ డయల్ ను అందించారు. దీని సహాయంతో ఫోన్ తెరవకుండానే వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, పాటలు మార్చడం, కాల్స్ మాట్లాడటం చేయవచ్చు. ఒక్కో బడ్ సింగిల్ ఛార్జ్‌పై 10 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే మొత్తం 32.5 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ లభిస్తుంది. లాంగ్ బ్యాటరీ మోడ్‌లో ఇది 36 గంటల వరకు వస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేటైమ్ లభిస్తుంది.

55
కనెక్టివిటీ వివరాలు ఏంటి?
Image Credit : X/techiboy96

కనెక్టివిటీ వివరాలు ఏంటి?

ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.4, మల్టీపాయింట్ డ్యూయల్ డివైజ్ కనెక్షన్‌కు సపోర్ట్ చేస్తాయి. గేమింగ్ ప్రేమికుల కోసం లో లాటెన్సీ మోడ్ ఇచ్చారు. గూగుల్ ఫాస్ట్ పేర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పేర్ సపోర్ట్ కూడా ఉంది. ఆగస్టు 15 నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ దేశాల్లో ఇవి విక్రయానికి రానున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి యూరప్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి వస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image2
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
How To Identify Fake Liquor: నకిలీ, కల్తీ మందును ఎలా గుర్తుపట్టాలో తెలుసా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసం
Recommended image2
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved