MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Graveyard Dating: స్మశానంలో డేటింగ్ ఏంటి బాబోయ్? యువత కొత్త పిచ్చి.. అసలు విషయం ఇదే !

Graveyard Dating: స్మశానంలో డేటింగ్ ఏంటి బాబోయ్? యువత కొత్త పిచ్చి.. అసలు విషయం ఇదే !

Graveyard Dating: కాఫీ షాపులు, పార్కులు పాతబడ్డాయి.. ఇప్పుడు ట్రెండ్ గ్రేవ్ యార్డ్ డేటింగ్. యువత స్మశానాల్లో ప్రేమాయణం సాగించడానికి అసలు కారణాలు ఏమిటి? గ్రేవ్ యార్డ్ డేటింగ్ కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 23 2026, 08:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రేమ కోసం వల్లకాటికైనా.. ఇప్పుడు గ్రేవ్ యార్డ్ డేటింగ్ ట్రెండ్ నడుస్తోంది.. అసలేంటిది?
Image Credit : Gemini

ప్రేమ కోసం వల్లకాటికైనా.. ఇప్పుడు గ్రేవ్ యార్డ్ డేటింగ్ ట్రెండ్ నడుస్తోంది.. అసలేంటిది?

డేటింగ్ అంటే ఒకప్పుడు కేవలం కాఫీ షాపులు, రెస్టారెంట్లు లేదా సినిమా థియేటర్లకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారింది. యువత ఆలోచనలు అంతకంటే వేగంగా మారుతున్నాయి. కొత్తగా ఉండాలని చేసే ప్రయత్నాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని, మరికొన్ని సార్లు భయాన్ని కలిగిస్తుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్రేవ్ యార్డ్ డేటింగ్ (Graveyard Dating) అనే కొత్త ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా, ఈ కాలం ప్రేమికులు మాత్రం దీనికి జై కొడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏమిటీ గ్రేవ్ యార్డ్ డేటింగ్?
Image Credit : Pixabay

ఏమిటీ గ్రేవ్ యార్డ్ డేటింగ్?

సాధారణంగా డేటింగ్ అనగానే అందమైన లొకేషన్లు, లైటింగ్ ఉన్న హోటళ్లు గుర్తుకు వస్తాయి. కానీ ఈ ట్రెండ్ ప్రకారం.. ప్రేమికులు స్మశాన వాటికల్లో కలుసుకుంటున్నారు. అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు విపరీతంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఫ్లడ్‌లైటింగ్, మంకీ బారింగ్, బ్రెడ్‌క్రంబింగ్ వంటి వింత వింత డేటింగ్ పద్ధతులను చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ మించి ఈ గ్రేవ్ యార్డ్ డేటింగ్ ట్రెండ్ చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Related image1
Best Honeymoon Destinations: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి !
Related image2
True 5G: ఫోన్‌లో ఫుల్ 5G సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ రావడం లేదా? అయితే ఇలా చేయండి !
34
అక్కడికే ఎందుకు వెళ్తున్నారు?
Image Credit : Chatgpt

అక్కడికే ఎందుకు వెళ్తున్నారు?

వందల మంది ఉండే రద్దీ ప్రదేశాల కంటే, ఏకాంతంగా ఉండే ప్రాంతాల వైపు యువత మొగ్గు చూపుతోంది. దీనికి ప్రధాన కారణాలు శాంతి, ప్రైవసీ, లోతైన సంభాషణలు. నగరాల్లో ఉండే ట్రాఫిక్ గోల, రెస్టారెంట్లలో ఉండే అరుపులు, కేకలు లేకుండా స్మశానాలు నిశ్శబ్దంగా ఉంటాయి.

ప్రైవసీ అంటే అక్కడ మనల్ని చూసేవారు ఉండరు, డిస్టర్బ్ చేసేవారు ఉండరు. అందుకే తమ మనసులోని మాటలను ఒకరికొకరు ధైర్యంగా చెప్పుకోవడానికి ఇది సరైన ప్రదేశమని కొందరు భావిస్తున్నారు. పాత సమాధులు, చెట్లు, పచ్చదనం మధ్య కూర్చున్నప్పుడు చిన్న చిన్న మాటలు కాకుండా.. జీవితం, భయం, కలల గురించి లోతైన చర్చలు వస్తాయని వోగ్ ఇండియా లాంటి పత్రికలు కూడా పేర్కొన్నాయి. ఇది ఒక రకంగా కంపాటబిలిటీ టెస్ట్ లాంటిదని డేటర్లు చెబుతున్నారు.

44
భయం కలగడం లేదా?
Image Credit : Chatgpt

భయం కలగడం లేదా?

సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత స్మశానాల వైపు వెళ్లడానికి ఎవరైనా భయపడతారు. ఆత్మలు తిరుగుతాయని, దెయ్యాలు ఉంటాయని రకరకాల నమ్మకాలు ఉన్నాయి. కానీ ఈ గ్రేవ్ యార్డ్ డేటింగ్ చేసేవారికి ప్రేమ ముందు ఆ భయాలేవీ కనిపించడం లేదట. అయితే, అందరికీ ఇది నచ్చాలని లేదు. కొందరు దీన్ని చాలా వింతగా, మరికొందరు అసహ్యంగా కూడా భావిస్తున్నారు. చనిపోయిన వారు నిద్రించే చోట రొమాన్స్ ఏంటని విమర్శించే వారు కూడా ఉన్నారు. ఇది కేవలం ఒక క్రేజీ ఆలోచన మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు.

ఈ రోజుల్లో ఎవరి ఇష్టాలు వారివి. కొందరికి కాఫీ షాపులు బోర్ కొట్టి ఉండవచ్చు, అందుకే ఇలాంటి వెరైటీ ఆలోచనలు చేస్తున్నారు. జెన్ జీ, మిలీనియల్స్ తమ ఒత్తిడితో కూడిన జీవితాల నుండి కాస్త బ్రేక్ తీసుకోవడానికి ఇలాంటి నిశ్శబ్ద ప్రదేశాలను వెతుక్కుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Investment : ఈరోజు తులం బంగారం కొంటే 2050 నాటికి ఎంత డబ్బు వస్తుంది? లాభం ఎంత?
Recommended image2
Dimple Cheeks : కొందరి బుగ్గలపై సొట్టలు పడతాయి? ఈ సొట్టబుగ్గలకు కారణమేంటి?
Recommended image3
Ambani Ice cream: అంబానీ వారి ఐస్‌క్రీమ్.. అది కూడా కేవలం రూ.10లకే
Related Stories
Recommended image1
Best Honeymoon Destinations: హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 రొమాంటిక్ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి !
Recommended image2
True 5G: ఫోన్‌లో ఫుల్ 5G సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ రావడం లేదా? అయితే ఇలా చేయండి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved