MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా డెడ్లీ స్లోయర్ బాల్ వెనుక ఉన్న హీరో ఇతనే !

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా డెడ్లీ స్లోయర్ బాల్ వెనుక ఉన్న హీరో ఇతనే !

Jasprit Bumrah: భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన స్లోయర్ బాల్ వెనుక ఉన్న రహస్యాన్ని యూఏఈ పేసర్ జహూర్ ఖాన్ వెల్లడించారు. 2020 ఐపీఎల్ సమయంలో తాను నేర్పించిన విద్యగా ఆయన పేర్కొన్నారు. అసలు కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 14 2026, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బుమ్రా డెడ్లీ బౌలింగ్ వెనుక రహస్యం లీక్
Image Credit : Getty

బుమ్రా డెడ్లీ బౌలింగ్ వెనుక రహస్యం లీక్

భారత పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని బౌలర్‌గా కొనసాగుతున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేస్తూ, బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా స్వదేశంలో జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్‌లో బుమ్రా ప్రదర్శన అద్భుతం. ఫైనల్ మ్యాచ్‌లో 15 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకోవడమే కాకుండా, భారత్ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించారు. బుమ్రా బౌలింగ్‌లో యార్కర్లు ఎంత ప్రమాదకరమో, ఆయన వేసే స్లోయర్ బాల్స్ అంతే మాయాజాలం చేస్తాయి. అయితే ఈ స్లోయర్ బాల్ వెనుక ఉన్న అసలు గురువు ఎవరో మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బుమ్రా అమ్ములపొదిలో కొత్త అస్త్రం
Image Credit : Getty

బుమ్రా అమ్ములపొదిలో కొత్త అస్త్రం

జస్ప్రీత్ బుమ్రా అంటేనే మరణ శాసనం లాంటి యార్కర్లకు పెట్టింది పేరు. కానీ, గత కొంతకాలంగా ఆయన తన స్లోయర్ బాల్‌తో ప్రపంచంలోని మేటి బ్యాటర్లను సైతం బోల్తా కొట్టిస్తున్నారు. ఈ బంతి ప్రత్యేకత ఏమిటంటే, బుమ్రా తన బౌలింగ్ యాక్షన్‌లో ఏమాత్రం మార్పు చేయకుండానే అత్యంత నెమ్మదిగా బంతిని విసురుతారు. దీనివల్ల బ్యాటర్లు బంతి వేగాన్ని అంచనా వేయలేక వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఈ అద్భుత విద్యను బుమ్రా ఎక్కడ నేర్చుకున్నారనే విషయంపై యూఏఈ వెటరన్ పేసర్ జహూర్ ఖాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Related Articles

Related image1
Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?
Related image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్
36
2020 ఐపీఎల్ సమయంలో బుమ్రా మాయజాలం స్టార్ట్..
Image Credit : ANI

2020 ఐపీఎల్ సమయంలో బుమ్రా మాయజాలం స్టార్ట్..

యూఏఈ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన జహూర్ ఖాన్, 2020 ఐపీఎల్ సీజన్ సందర్భంగా ముంబై ఇండియన్స్ జట్టులో భాగంగా ఉన్నారు. ఆ సమయంలోనే బుమ్రాకు ఈ స్లోయర్ బాల్ టెక్నిక్‌ను తాను నేర్పించానని జహూర్ వెల్లడించారు. 2019 చివరలో జరిగిన ఒక టీ10 మ్యాచ్‌లో జహూర్ ఖాన్ వరుసగా ఐదు డాట్ బాల్స్ వేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ వీడియోలను చూసిన బుమ్రా, జహూర్ బౌలింగ్ శైలి పట్ల ఆకర్షితులయ్యారు. కోవిడ్-19 కారణంగా 2020 ఐపీఎల్ యూఏఈలో జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఈ చర్చ జరిగింది.

46
యూట్యూబ్ వీడియోతో మొదలైన ఆసక్తి
Image Credit : AFP

యూట్యూబ్ వీడియోతో మొదలైన ఆసక్తి

ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో జరిగిన సంఘటనను జహూర్ గుర్తు చేసుకుంటూ ఇలా వివరించారు. "మేమంతా కలిసి కూర్చున్న సమయంలో, లెండిల్ సిమన్స్‌కు నేను వేసిన మెయిడెన్ ఓవర్ వీడియో యూట్యూబ్‌లో వస్తోంది. అది చూసిన బుమ్రా ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ ఓవర్‌లో నేను వేసినవన్నీ స్లోయర్ బాల్స్ అని, పైగా బౌలింగ్ యాక్షన్‌లో గానీ, గ్రిప్‌లో గానీ ఎలాంటి మార్పు లేదని చెప్పడంతో బుమ్రా మరింత కుతూహల పడ్డాడు. అది ఎలా సాధ్యమని నన్ను అడిగాడు. వచ్చే ప్రాక్టీస్ సెషన్‌లో నీకు చూపిస్తానని నేను అతనికి ప్రామిస్ చేశాను" అని జహూర్ తెలిపారు.

56
చరిత్ర సృష్టించిన బుమ్రా
Image Credit : X/MIEmirates

చరిత్ర సృష్టించిన బుమ్రా

తర్వాతి ప్రాక్టీస్ సెషన్‌లో జహూర్ ఖాన్ ఆ స్లోయర్ బాల్ వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలను బుమ్రాకు వివరించారు. బుమ్రా ఆ విద్యను అత్యంత త్వరగా వంటబట్టించుకున్నారు. 2019 చివరి నాటికే ఆ టెక్నిక్‌ను సంపూర్ణంగా నేర్చుకున్న బుమ్రా, అప్పటి నుండి దానిని తన ప్రధాన ఆయుధంగా మార్చుకున్నారు. నేడు ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లు సైతం బుమ్రా యార్కర్లు, స్లోయర్ బంతుల కలయికను ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నారు. జహూర్ నేర్పిన ఆ చిన్న టెక్నిక్, బుమ్రాను మరింత ప్రమాదకర బౌలర్‌గా మార్చింది.

66
జహూర్ ఖాన్ రికార్డులు ఇవే
Image Credit : Getty

జహూర్ ఖాన్ రికార్డులు ఇవే

యూఏఈ జట్టు తరపున జహూర్ ఖాన్ అద్భుతమైన గణాంకాలను కలిగి ఉన్నారు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆయన ఎకానమీ రేటు 7 కంటే తక్కువగా ఉండటం విశేషం. సగటున 20 పరుగుల లోపే ఒక వికెట్ తీస్తారు. ఓవరాల్ టీ20 కెరీర్‌లో 7.48 ఎకానమీతో, 23 లోపు సగటుతో రాణిస్తున్నారు. డెత్ ఓవర్లలో స్లోయర్ యార్కర్లు, స్లోయర్ బౌన్సర్లు, ఫాస్ట్ యార్కర్లను సంధించడంలో జహూర్ దిట్ట. వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్‌లలో జహూర్ ఖాన్ కీలక బౌలర్‌గా కొనసాగుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Related Stories
Recommended image1
Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?
Recommended image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved