MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?

Gill : సంజూ శాంసన్ పై శుభ్‌మన్ గిల్ చిల్లర వేషాలు.. నిజంగానే ఇలా చేశాడా?

Shubman Gill : టీ20 ప్రపంచకప్ విజయోత్సవ ఫోటోలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సంజూ శాంసన్ కనిపించకపోవడంపై శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ఫోటో ఎడిట్ చేశారంటూ వస్తున్న ఆరోపణల వెనుక అసలు నిజం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 14 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గిల్ పోస్ట్‌లో సంజూ మాయం
Image Credit : Getty

గిల్ పోస్ట్‌లో సంజూ మాయం

మార్చి 8, 2026న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ అద్భుత విజయం తర్వాత ఆటగాళ్ల సంబరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. అయితే, ఇదే సమయంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

25
శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై నెటిజన్ల ఆగ్రహం
Image Credit : Instagram

శుభ్‌మన్ గిల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై నెటిజన్ల ఆగ్రహం

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ20 ప్రపంచకప్ జట్టులో భాగం కానప్పటికీ, భారత జట్టు విజయాన్ని అభినందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేశారు. ఛాంపియన్స్ అనే క్యాప్షన్‌తో గిల్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో కొంతమంది ఆటగాళ్లు ట్రోఫీతో కనిపిస్తున్నారు. అయితే, ఆ ఫోటోలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కనిపించకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. సంజూను గిల్ కావాలనే ఎడిట్ చేసి ఫోటో నుండి తొలగించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

Related Articles

Related image1
KKRకు బిగ్ షాక్ : ఐపీఎల్ 2026 నుండి స్టార్ పేసర్ హర్షిత్ రాణా అవుట్.. ఏమైంది?
Related image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్
35
గిల్ ఫస్ట్ క్లాస్ ఎడిటర్ అంటూ ట్రోల్స్
Image Credit : ANI + AFP

గిల్ ఫస్ట్ క్లాస్ ఎడిటర్ అంటూ ట్రోల్స్

సంజూ శామ్సన్ ఈ టోర్నమెంట్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచారు. అటువంటి కీలక ఆటగాడు ఫోటోలో లేకపోవడంతో అభిమానులు గిల్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ "సంజూ శామ్సన్‌ను తొలగించడానికి మీరు ఏ యాప్ ఉపయోగించారు? చాలా నీట్‌గా చేశారు" అని ప్రశ్నించగా, మరొకరు "ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ❌ ఫస్ట్ క్లాస్ ఎడిటర్ ✅" అంటూ ఎద్దేవా చేశారు. టోర్నమెంట్ అంతటా అద్భుతంగా ఆడిన ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

45
గిల్ వర్సెస్ సంజూ.. తెరపైకి మరో ఫైట్
Image Credit : Getty

గిల్ వర్సెస్ సంజూ.. తెరపైకి మరో ఫైట్

ఈ వివాదం ఐపీఎల్ అభిమానుల వార్‌కు కూడా దారితీసింది. గుజరాత్ టైటాన్స్ అభిమానులు గిల్‌కు సపోర్టుగా నిలుస్తుండగా, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే అభిమానులు సంజూకు అండగా నిలుస్తున్నారు. యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే ఫోటోను షేర్ చేసిన విషయాన్ని గిల్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. అశ్విన్ తన పోస్ట్‌లో సంజూ ప్రతిభను కొనియాడగా, జైస్వాల్ మాత్రం కేవలం సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్‌లను మాత్రమే ట్యాగ్ చేశారు. సంజూను కావాలనే పక్కన పెట్టారనే వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

55
నిజంగానే ఫోటో ఎడిట్ చేశారా? అసలు నిజం ఇదీ!
Image Credit : AFP

నిజంగానే ఫోటో ఎడిట్ చేశారా? అసలు నిజం ఇదీ!

ఈ వివాదంపై ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్టుగా గిల్ ఫోటోను ఎడిట్ చేయలేదు. వైరల్ అవుతున్న రెండు ఫోటోలను నిశితంగా గమనిస్తే అవి వేర్వేరు సమయాల్లో తీసినవని స్పష్టమవుతుంది. ఒక ఫోటోలో ట్రోఫీ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉండగా, గిల్ షేర్ చేసిన ఫోటోలో ట్రోఫీ తిలక్ వర్మ చేతిలో ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మల పొజిషన్లు కూడా రెండు ఫోటోల్లో వేరుగా ఉన్నాయి. అంటే అవి ఒకే సమయంలో తీసిన ఫోటోలు కావు. కాబట్టి, సంజూ శాంసన్ ను ఎవరో ఎడిట్ చేసి తొలగించారనే వార్తల్లో వాస్తవం లేదు. గ్రూప్ ఫోటోలు తీసుకునేటప్పుడు ఆటగాళ్లు కదులుతూ ఉండటం వల్ల ఒక ఫోటోలో ఉన్నవారు మరొక ఫోటోలో కనిపించకపోవడం సహజం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
శుభ్‌మన్ గిల్
Latest Videos
Recommended Stories
Recommended image1
Axar Patel : అక్షర్ ను 'బాపు' అని ఎందుకంటారు..? ఈ నిక్ నేమ్ వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీస్
Recommended image2
Kuldeep Yadav Wedding : ఐఏఎస్, ఐపిఎస్ ల కంటే ఎక్కువ శాలరీ.. కుల్దీప్ కు కాబోయే భార్య ఎవరు.. ఏం చేస్తారు?
Recommended image3
Kavya Maran Net Worth : కావ్య మారన్ ఆస్తి ఎంత..? ఆమె కార్ల విలువే ఇన్ని కోట్లా..!
Related Stories
Recommended image1
KKRకు బిగ్ షాక్ : ఐపీఎల్ 2026 నుండి స్టార్ పేసర్ హర్షిత్ రాణా అవుట్.. ఏమైంది?
Recommended image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved