MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cooper Connolly : జీటీని దంచికొట్టిన పంజాబ్ కింగ్స్ సెన్సేషన్.. ఎవరీ కూపర్ కానోలీ?

Cooper Connolly : జీటీని దంచికొట్టిన పంజాబ్ కింగ్స్ సెన్సేషన్.. ఎవరీ కూపర్ కానోలీ?

Who is Cooper Connolly : ఐపీఎల్ అరంగేట్రంలోనే కూపర్ కానోలీ సంచలనం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 72 పరుగులతో అజేయంగా నిలిచి పంజాబ్ కింగ్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 01 2026, 06:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ అరంగేట్రంలోనే కూపర్ కానోలీ విధ్వంసం
Image Credit : X/PunjabKingsIPL

ఐపీఎల్ అరంగేట్రంలోనే కూపర్ కానోలీ విధ్వంసం

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజ యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌ను పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓడించింది.

ఈ విజయంలో ఐపీఎల్ అరంగేట్రం ప్లేయర్, ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ కూపర్ కానోలీ కీలక పాత్ర పోషించాడు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్, ఒకానొక సమయంలో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా, కానోలీ (44 బంతుల్లో 72 నాటౌట్) అజేయ పోరాటంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కష్టాల్లో పంజాబ్.. ఆదుకున్న కానోలీ
Image Credit : X/PunjabKingsIPL

కష్టాల్లో పంజాబ్.. ఆదుకున్న కానోలీ

లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయింది. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కూపర్ కానోలీ, ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి రెండో వికెట్‌కు 76 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రభ్‌సిమ్రన్ (24 బంతుల్లో 37) ధాటిగా ఆడి అవుటైన తర్వాత పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుప్పకూలింది.

83/1తో పటిష్టంగా ఉన్న జట్టు, ప్రసిద్ధ్ కృష్ణ ధాటికి 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైనా, కానోలీ పట్టుదలతో క్రీజులో నిలబడ్డాడు. చివరలో జేవియర్ బార్ట్లెట్ సహకారంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ను గెలిపించాడు.

36
ఎవరీ కూపర్ కానోలీ?
Image Credit : X@IPL

ఎవరీ కూపర్ కానోలీ?

ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జన్మించిన 22 ఏళ్ల కూపర్ కానోలీ ఎడమచేతి వాటం బ్యాటర్, స్పిన్ బౌలర్. 2022 అండర్-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కానోలీకి బిగ్ మ్యాచ్‌లలో రాణించే అలవాటు ఉంది. బిగ్ బాష్ లీగ్ 2022-23 ఫైనల్‌లో కేవలం 11 బంతుల్లో 25 పరుగులు చేసి పెర్త్ స్కార్చర్స్‌ను విజేతగా నిలిపాడు. అలాగే తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రంలోనే షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌లో 90 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా తరపున టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడిన ఇతడిని ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది.

46
చాహల్ స్పిన్ మ్యాజిక్.. గుజరాత్ షాక్
Image Credit : X/PunjabKingsIPL

చాహల్ స్పిన్ మ్యాజిక్.. గుజరాత్ షాక్

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 39), జోస్ బట్లర్ (33 బంతుల్లో 38) శుభారంభం ఇచ్చినా, మిడిల్ ఓవర్లలో యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్‌ను కట్టడి చేశాడు. చాహల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీయగా, వైశాఖ్ విజయ్ కుమార్ 3 వికెట్లతో రాణించాడు. గుజరాత్ బ్యాటర్లు ఎవరూ భారీ స్కోరు చేయలేకపోవడంతో ఆ జట్టు మోస్తరు స్కోరుకే పరిమితమైంది.

56
రషీద్ ఖాన్‌కు షాకిచ్చిన కానోలీ 103 మీటర్ల సిక్సర్
Image Credit : ANI

రషీద్ ఖాన్‌కు షాకిచ్చిన కానోలీ 103 మీటర్ల సిక్సర్

ఈ మ్యాచ్‌లో కూపర్ కానోలీ కొట్టిన ఒక సిక్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ప్రపంచ స్థాయి స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కానోలీ ఏకంగా 103 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు. ఆ షాట్‌కు రషీద్ ఖాన్ సైతం అవాక్కయి చూస్తూ ఉండిపోయాడు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన కానలీ, 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మెక్స్‌వెల్‌కు సరైన వారసుడిగా భావిస్తున్న కానోలీ, తన అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

𝟏𝟎𝟑 𝐌𝐄𝐓𝐑𝐄𝐒 𝐨𝐟 𝐦𝐚𝐲𝐡𝐞𝐦 🤯

Cooper Connolly rocks back, frees the arms and sends it soaring into the second tier 🚀#TATAIPL 2026 | #PBKSvGT | LIVE NOW 👉 https://t.co/8O2J6XJtcm pic.twitter.com/jXyDDu3Ohs

— Star Sports (@StarSportsIndia) March 31, 2026

66
బౌలర్ల వైఫల్యం.. అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు
Image Credit : ANI

బౌలర్ల వైఫల్యం.. అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు

మరోవైపు పంజాబ్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన అర్ష్‌దీప్, ఏకంగా 4 వైడ్‌లు, ఒక నో-బాల్ వేసి ఆ ఓవర్‌ను పూర్తి చేయడానికి 11 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో 11 బంతులు వేసిన ఆరో బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసి గట్టి పోటీ ఇచ్చినా, కానోలీ వీరోచిత ఇన్నింగ్స్ ముందు గుజరాత్ తలవంచక తప్పలేదు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ సీజన్‌లో శుభారంభం చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Mumbai Indians Captains: సచిన్ నుంచి రోహిత్ వరకు.. ముంబై ఇండియన్స్‌ను ఏలిన కెప్టెన్ల పూర్తి లిస్ట్ ఇదే
Recommended image2
India vs New Zealand: టీమిండియాకు హెన్రీ, జేమిసన్ షాక్.. క్రైస్ట్‌చర్చ్ టెస్టులో కష్టాల్లో టీమిండియా
Recommended image3
Rohit Sharma: ముంబై ఇండియన్స్ అభిమానులకు పూనకాలే.. మళ్లీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ
Related Stories
Recommended image1
PBKS vs GT: ఐపీఎల్ 2026లో అదిరిపోయే థ్రిల్లర్.. డెబ్యూ మ్యాచ్‌లోనే దుమ్మురేపిన కానోలీ
Recommended image2
Shami : షమీ రిటైర్మెంట్? షాకింగ్ న్యూస్ చెప్పిన స్టార్ పేసర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved