MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • PBKS vs GT: ఐపీఎల్ 2026లో అదిరిపోయే థ్రిల్లర్.. డెబ్యూ మ్యాచ్‌లోనే దుమ్మురేపిన కానోలీ

PBKS vs GT: ఐపీఎల్ 2026లో అదిరిపోయే థ్రిల్లర్.. డెబ్యూ మ్యాచ్‌లోనే దుమ్మురేపిన కానోలీ

PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన 4వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే కూపర్ కానోలీ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 01 2026, 12:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పంజాబ్‌కు అద్భుత విజయాన్ని అందించిన యంగ్ హీరో
Image Credit : ANI

పంజాబ్‌కు అద్భుత విజయాన్ని అందించిన యంగ్ హీరో

ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్‌లో ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కానోలీ అరంగేట్రంలోనే విధ్వంసం
Image Credit : X/PunjabKingsIPL

కానోలీ అరంగేట్రంలోనే విధ్వంసం

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు కూపర్ కానోలీ దుమ్మురేపాడు. తన ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ 22 ఏళ్ల ఆస్ట్రేలియన్ ప్లేయర్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కేవలం 43 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో వచ్చిన సిక్సర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. ఐపీఎల్ అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సాధించిన 25వ బ్యాటర్‌గా కానోలీ రికార్డు సృష్టించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికే ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.

A memorable start for the young Australian in the @PunjabKingsIPL colors 😍

Cooper Connolly is adjudged the Player of the Match on his #TATAIPL debut 🌟

Scorecard ▶️ https://t.co/75rCxTCOL1#KhelBindaas | #PBKSvGT pic.twitter.com/5JmVoTz6DW

— IndianPremierLeague (@IPL) March 31, 2026

35
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కీలక భాగస్వామ్యం
Image Credit : X/PunjabKingsIPL

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కీలక భాగస్వామ్యం

లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7) త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కానోలీ కలిసి రెండో వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రభ్‌సిమ్రాన్ 24 బంతుల్లో 37 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో రబడా వేసిన ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది పంజాబ్ స్కోరును పరుగులు పెట్టించారు.

45
మధ్యలో తడబడిన పంజాబ్
Image Credit : X@IPL

మధ్యలో తడబడిన పంజాబ్

ఒక దశలో పంజాబ్ విజయం నల్లేరుపై నడకలా కనిపించింది. స్కోరు 110/2 వద్ద ఉన్నప్పుడు గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ విజృంభించాడు. అతను వేసిన 13వ ఓవర్ మొదటి బంతికే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ తక్కువ పరుగులకే వెనుదిరగడంతో పంజాబ్ 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ తన కోటా 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు.

55
ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం
Image Credit : X/PunjabKingsIPL

ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం

చివరి ఓవర్లలో కూపర్ కానోలీ, జేవియర్ బార్ట్లెట్ సంయమనంతో ఆడారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్‌లో బార్ట్లెట్ ఒక సిక్సర్ బాదగా, కానోలీ ఒక ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు రావడంతో పంజాబ్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్‌లో పంజాబ్ గెలుపునకు కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. వాషింగ్టన్ సుందర్ వేసిన తొలి బంతికే ఫోర్ బాదిన కానోలీ పంజాబ్ కింగ్స్‌కు 3 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాయం చేశాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తమ ఖాతాను తెరిచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image2
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image3
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Related Stories
Recommended image1
RR vs CSK : ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ఓటమి.. అసలు కారణం ఇదే
Recommended image2
RCB : ఇదేందయ్యా ఇది.. గాలిలో తేలుతూ అద్భుత క్యాచ్ పట్టిన సాల్ట్ ! వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved