MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తీ అహ్లావత్ ఏం చేస్తారో తెలుసా..?

వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తీ అహ్లావత్ ఏం చేస్తారో తెలుసా..?

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తీ అహ్లావత్ ఢిల్లీకి చెందిన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. క్రికెట్ లో సెహ్వాగ్ ఎలాగో కార్పొరేట్ ప్రపంచంలో ఆమె అలా చురుగ్గా ఉంటారు. ఇంతకూ ఆమె ఏ బిజినెస్ లో ఉన్నారో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 18 2026, 02:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వీరేంద్ర సెహ్వాగ్ పర్సనల్ లైఫ్
Image Credit : Getty

వీరేంద్ర సెహ్వాగ్ పర్సనల్ లైఫ్

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. తన దూకుడైన బ్యాటింగ్‌తో 2000వ దశకంలో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. టీ20 ఫార్మాట్ లేని ఆ సమయంలో కూడా వేగంగా పరుగులు చేసేవాడు సెహ్వాగ్... వన్డేల్లో కాదు చివరకు టెస్టుల్లోనూ హిట్టింగ్ చేసేవాడు. డాషింగ్ క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే అతడి బ్యాట్ నుండి పరుగుల వరద పారింది. ఇలా సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా ఇండియన్ క్రికెట్ చరిత్రలో స్థానం సంపాదించాడు.

సెహ్వాగ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాదు పర్సనల్ లైఫ్ కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. సెహ్వాగ్ దంపతులు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారని... విడాకులు కూడా తీసుకోనున్నారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ఈ క్రమంలో అసలు సెహ్వాగ్ భార్య ఎవరు..? ఏం చేస్తారు? అనేది తెలుసుకుందాం.

25
చిన్ననాటి స్నేహితురాలితో సెహ్వాగ్ పెళ్లి
Image Credit : X/Virendra Sehwag

చిన్ననాటి స్నేహితురాలితో సెహ్వాగ్ పెళ్లి

వీరేంద్ర సెహ్వాగ్ చిన్ననాటి స్నేహితురాలు ఆర్తి అహ్లావత్ ను పెళ్లిచేసుకున్నాడు. దివంగత బిజెపి నేత, అప్పటి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో ఏప్రిల్ 22, 2004న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు... ఆర్యవీర్ 2007 లో, వేదాంత్ 2010 లో జన్మించారు.

Related Articles

Related image1
Virendra Sehwag : డేరింగ్ ఓపెనర్ వీరూ కు అరుదైన గౌరవం.. 
Related image2
Virender Sehwag: 39 ఫోర్లు, 6 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో పాకిస్తాన్ ను చితక్కొట్టిన భారత ప్లేయర్
35
ఆర్తీ అహ్లావత్ ఏం చేస్తారు..?
Image Credit : X/Virendra Sehwag

ఆర్తీ అహ్లావత్ ఏం చేస్తారు..?

సెహ్వాగ్, ఆర్తీల బంధం పెళ్లికి చాలా ఏళ్ల ముందే మొదలైంది. చిన్నప్పుడు ఒక కుటుంబ వివాహ వేడుకలో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. సంవత్సరాలు గడిచేకొద్దీ వారి స్నేహం ప్రేమగా మారింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత సెహ్వాగ్ ఆర్తీని పెళ్లాడాడు.

ఆర్తీ అహ్లావత్ దేశ రాజధాని డిల్లీలోని భారతీయ విద్యాభవన్, లేడీ ఇర్విన్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని మైత్రేయి కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా పొందారు. ఆర్తీ తండ్రి సూరజ్ సింగ్ అహ్లావత్ ఒక లాయర్. 

వృత్తిపరంగా ఆర్తీ కార్పొరేట్ రంగంలో ఉన్నారు. ఏవీఎస్ హెల్త్‌కేర్, ఈవెంచురా క్రియేషన్స్ వంటి పలు సంస్థలకు ఆమె డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఎక్కువగా బయట కనిపించకపోయినా, కార్పొరేట్ మేనేజ్‌మెంట్‌లో చురుగ్గా ఉంటారు.

45
సెహ్వాగ్, ఆర్తి విడిపోయారా..?
Image Credit : Social Media

సెహ్వాగ్, ఆర్తి విడిపోయారా..?

వీరేంద్ర సెహ్వాగ్ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను తరచుగా పంచుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో తన భార్య ఆర్తీతో కలిసి ఉన్న ఫోటోలను పెట్టడం లేదని అభిమానులు గమనించారు. దీంతో వారి విడాకులపై అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాదు వీరేంద్ర, ఆర్తీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.

55
సెహ్వాగ్ విడాకులపై అనుమానాలకు కారణాలివే..
Image Credit : Getty

సెహ్వాగ్ విడాకులపై అనుమానాలకు కారణాలివే..

ఇటీవల ఆర్తీ పుట్టినరోజున కూడా సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. అంతేకాకుండా వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తీ ఏడాదికి పైగా విడివిడిగా ఉంటున్నారని... ఒక కొడుకు తండ్రితో, మరొకరు తల్లితో ఉంటున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటన్నింటి వెనుక ఉన్న కారణాలు పూర్తిగా వ్యక్తిగతమైనవే అయినా సెహ్వాగ్ అభిమానులను ఇవి బాధపెడుతున్నాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
క్రికెట్
వ్యాపారం
ప్రసిద్ధ వ్యక్తులు
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : అతిచిన్న వయసులో అద్భుత సెంచరీ.. ఎవరీ యువరాజ్ సమ్రా.. ఇండియాతో లింక్ ఏంటి?
Recommended image2
Yuvraj : బంతి బాదుడు అంటే ఇలా ఉండాలి.. 19 ఏళ్లకే సునామీ.. ప్రపంచ క్రికెట్ షాక్
Recommended image3
IND vs NED: బుమ్రాకు రెస్ట్ లేదు.. అభిషేక్ శర్మకు మరో ఛాన్స్.. టీమిండియా ప్లాన్ ఇదే
Related Stories
Recommended image1
Virendra Sehwag : డేరింగ్ ఓపెనర్ వీరూ కు అరుదైన గౌరవం.. 
Recommended image2
Virender Sehwag: 39 ఫోర్లు, 6 సిక్సర్లు.. ట్రిపుల్ సెంచరీతో పాకిస్తాన్ ను చితక్కొట్టిన భారత ప్లేయర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved