Virendra Sehwag : డేరింగ్ ఓపెనర్ వీరూ కు అరుదైన గౌరవం..
Virendra Sehwag :భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అరుదైన గౌరవం దక్కింది. ఆయనతో పాటు భారత మహిళ మాజీ క్రికెటర్ డయానా ఎడుజీ(Diana Edulji), శ్రీలంక లెజెండ్ క్రికెటర్ అరవింద డిసిల్వా(Aravinda de Silva)లు కూడా ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇంతకీ ఆ గౌరవమేంటీ?
Virendra Sehwag : భారత జట్టు మాజీ క్రికెటర్, డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag)కు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్‌కు విశేష సేవలు అందించినందుకుగానూ సెహ్వాగ్ కు ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్( ICC Hall of Fame)లో చోటు దక్కింది. వీరూతో పాటు భారత మహిళ మాజీ క్రికెటర్ డయానా ఎడుజీ(Diana Edulji), శ్రీలంక లెజెండ్ క్రికెటర్ అరవింద డిసిల్వా(Aravinda de Silva)లు కూడా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వాంఖడే స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌కు ముందు ఈ ముగ్గురిని సత్కరిస్తారు. ‘ఈ గౌరవం లభించినందుకు గర్వంగా ఉంది. ఐసీసీకి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్
ప్రపంచంలోని విధ్వంసక ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన సెహ్వాగ్ రెండు వరల్డ్ కప్‌లు గెలిచిన భారత జట్టులో సభ్యుడు కావడం విశేషం. 1999 – 2013 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన వీరూ .. టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్ స్టైల్ మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. అంతకుముందు టెస్ట్ క్రికెట్ లో బ్యాట్స్‌మెన్‌లు చాలా స్లోగా ఆడేవారు. సెహ్వాగ్ ఏంట్రీ తరువాత.. ఆ ఫార్ములా దశ దిశను పూర్తిగా మార్చేశాడు. ఈ క్రికెట్ ఫార్మాట్ లో కూడా దంచికొట్టవచ్చని నిరూపించాడు.
వీరేంద్ర సెహ్వాగ్ భారతదేశం తరపున 104 టెస్టులు ఆడి.. 49.34 సగటుతో 8,586 రన్స్ చేశాడు. అలాగే.. 251 వన్డేలు ఆడి 8,232 పరుగులు.. 19 టీ ఫార్మాట్ లో 20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. టెస్టుల్లో రెండు సార్లు ట్రిపుల్ సెంచరీలు చేసిన నలుగురు బ్యాట్స్‌మెన్‌లలో ఇతను కూడా ఉన్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా చేశాడు. అటు బౌలింగ్ లోనూ వీరు రాణించారు. అంతర్జాతీయ క్రికెట్ లో 40 వికెట్లు తీశాడు. ఫైనల్ గా 2013లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు.
తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా ఎడుల్జీ
డయానా ఎడుజి భారత మహిళల క్రికెట్‌పై తన ముద్ర వేశారు. డయానా ఎడుల్జీ 1976 నుంచి 1993 వరకు దాదాపు 17 సంవత్సరాలు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఎడుజి విశిష్ట సేవలను గుర్తిస్తూ అందుకుగానూ ఐసీసీ ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేసింది. ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మహిళ గా డయానా ఎడుల్జీ ఘనత సాధించింది. భారత్ తరఫున ఆమె 20 టెస్టులు, 34 వన్డేలు ఆడి వరుసగా 63, 46 వికెట్లు పడగొట్టాడు. ఆమె 1993 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ ప్రకటించారు.
ప్రపంచకప్ గెలవడంలో కీలకం
అరవింద డి సిల్వా శ్రీలంక తరపున 93 టెస్టులు, 308 వన్డేలు ఆడాడు. 2003 ODI ప్రపంచకప్ తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 15,645 అంతర్జాతీయ పరుగులు, 135 వికెట్లను పడగొట్టారు. 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక విజయంలో అరవింద డిసిల్వా కీలక పాత్ర పోషించారు. అతను టోర్నమెంట్ సెమీ-ఫైనల్స్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు.అలాగే.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అజేయ సెంచరీ చేశాడు.