IND vs NZ: చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ సిద్ధం.. ఆ ఒక్క ఇన్నింగ్స్ కోసమే వెయిటింగ్ !
Virat Kohli : జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ మరో సెంచరీ చేస్తే కివీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతాడు.

కివీస్ సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు.. సెహ్వాగ్ రికార్డు కనుమరుగేనా?
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో టీమిండియా తమ 2026 ప్రచారాన్ని ఘనంగా ఆరంభించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వడోదర లో జరగనుంది.
ఇప్పటికే బీసీసీఐ ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. జట్టులో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు తిరిగి చేరగా, మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ వంటి వారికి నిరాశే ఎదురైంది. అయితే, ఈ సిరీస్‌లో అందరి కళ్లు టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో కోహ్లీ ఒక అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశం ఉంది.
వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుకు కోహ్లీ ఎసరు
న్యూజిలాండ్ జట్టుపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా ప్రస్తుతం విరాట్ కోహ్లీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ కివీస్‌పై తలో 6 సెంచరీలు సాధించారు.
రాబోయే మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ గనక ఒక్క సెంచరీ సాధిస్తే, సెహ్వాగ్ రికార్డును అధిగమించి, న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు బాదిన భారత బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈ రికార్డు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
కివీస్‌పై కోహ్లీ అద్భుత రికార్డులు
గత గణాంకాలను పరిశీలిస్తే న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీకి ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు కివీస్‌పై ఆడిన 33 మ్యాచ్‌లలోని 33 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఏకంగా 55.56 సగటుతో 1657 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
న్యూజిలాండ్‌పై అతని అత్యధిక స్కోరు 154 పరుగులు. ఈ గణాంకాలు కివీస్ బౌలర్లపై కోహ్లీ ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించి 13 మైలురాళ్లను అందుకోవాలని కోహ్లీ భావిస్తున్నాడు.
సూపర్ ఫామ్‌లో కింగ్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. 2025లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతను టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ సిరీస్‌లో రెండు సెంచరీల సాయంతో 302 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలోనూ ఢిల్లీ తరఫున ఆడుతూ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు.
ఆంధ్రాపై 131 పరుగులు, ఆ తర్వాతి మ్యాచ్‌లో 77 పరుగులు చేసి, 2026 సీజన్‌కు తాను ఎంత దృఢమైన మనస్తత్వంతో సిద్ధంగా ఉన్నానో చాటిచెప్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశం.
జట్టులో కీలక మార్పులు.. సారథిగా గిల్
ఈ సిరీస్ కోసం భారత జట్టు కూర్పులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగి రావడం టీమిండియాకు బలాన్నిచ్చింది. అలాగే గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకున్న శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడు.
వీరిద్దరూ టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నేపథ్యంలో, ఈ 50 ఓవర్ల ఫార్మాట్‌లో తమ సత్తా చాటాలనుకుంటున్నారు. మరోవైపు, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ మరోసారి జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం, అతని వన్డే కెరీర్‌పై సందేహాలను రేకెత్తిస్తోంది.

