రాసిపెట్టుకోండి.! ఆ పిచ్చోళ్లు RCBకి మళ్లీ కప్పు తెస్తారు.. రిలీజ్ లిస్టు ఇదిగో..
RCB: డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ట్రోఫీని కాపాడుకోవడానికి బరిలోకి దిగుతోంది. దానికి తగ్గట్టుగానే మినీ వేలానికి ముందు పక్కా ప్లాన్‌తో సన్నద్ధం అవుతోంది.

డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి..
18 ఏళ్ల తన కలను నెరవేర్చుకుంది RCB. ఐపీఎల్‌లో తొలి ట్రోఫీని ముద్దాడింది. 2025 సీజన్‌లో అద్భుతమైన ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో అందరినీ అలరించింది. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ జట్టుకు కొత్త కెప్టెన్‌గా అవతరించాడు రజత్ పాటిదర్.
మినీ వేలానికి సన్నద్ధం..
మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్, రిలీజ్ లిస్టులు కచ్చితంగా ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేస్తోంది. తమ జట్టు కూర్పును కదపకుండా.. ఫామ్ లేమితో సతమతమవుతున్న ప్లేయర్స్‌ను విడుదల చేయనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
కోర్ టీం ఇదే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోర్ టీం కచ్చితంగా మీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ ప్లేస్‌లో విరాట్ కోహ్లీ ఉంటాడు. అతడితో పాటు కెప్టెన్ రజత్ పాటిదర్, ఓపెనర్ ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా, జితీష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్ ఉన్నారు.
రిటైన్, రిలీజ్ లిస్టు ఇదిగో..
రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, స్వస్తిక్ చికారా, జితీష్ శర్మ, లియాం లివింగ్‌స్టన్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, జాకబ్ బెథల్, రొమారియో షేపెర్డ్, స్వప్నిల్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ శర్మ, నువాన్ తుషారా, అభినందన్ సింగ్, దేవ్‌దూత్ పడిక్కల్ రిటైన్ లిస్టులో ఉండగా.. రసిఖ్ సలామ్, మనోజ్ భండాగే, ఎనిగిడి, మొహిత్ రథీ, బ్లెస్సింగ్ ముజారబని, సిఫెర్ట్, మయాంక్ అగర్వాల్, యష్ దయాల్ రిలీజ్ లిస్టులో ఉన్నారు.
గత సీజన్ సూపర్ హిట్..
కెప్టెన్ రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఆడిన 14 మ్యాచ్‌లలో తొమ్మిదింట విజయం సాధించి.. ఒక డ్రా, కేవలం 4 మాత్రమే ఓడిపోయి.. 19 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్‌లో పంజాబ్‌ను ఓడించి.. ఐపీఎల్‌లో మొదటి ట్రోఫీ అందుకుంది.