- Home
- Sports
- Cricket
- RCB: వేలంలోకి టీ20 స్పెషలిస్టులు.. ఆర్సీబీ రిటైన్ లిస్టు ఇదిగో.. ఎవరెవరున్నారో తెలుసా.?
RCB: వేలంలోకి టీ20 స్పెషలిస్టులు.. ఆర్సీబీ రిటైన్ లిస్టు ఇదిగో.. ఎవరెవరున్నారో తెలుసా.?
RCB: 2025లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే సీజన్ కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. మినీ వేలానికి ముందుగా పలువురు ప్లేయర్స్‌ను వదులుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

18 ఏళ్ల కల తీరింది
18 ఏళ్ల కలను తొలిసారిగా 2025లో నెరవేర్చుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలి ట్రోఫీని ముద్దాడిన ఆ జట్టు.. వచ్చే సీజన్‌కు ముందుగా తమ ప్రాబబుల్స్‌లో చిన్న చిన్న మార్పులు చేయాలని చూస్తోంది. అందులో భాగంగా పలువురు ప్లేయర్స్‌ను రిలీజ్ చేయడానికి సిద్దమైంది. అందులో టీ20 స్పెషలిస్టులు ఉండటం గమనార్హం. డిసెంబర్‌లో మినీ వేలం జరగనుండగా.. అర్సీబీ వదిలేసే ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం.
రిటైన్ లిస్టు ఇదే
ఇటీవల విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని పలు కథనాలు వచ్చినప్పటికీ.. అతడికి ఇదే లాస్ట్ సీజన్ అయ్యి ఉండొచ్చునని మరొకొందరు అన్నారు. సో.! ఆర్సీబీలో కోహ్లీ కొనసాగింపు అనివార్యం. అనుభవం, యువతపై ప్రత్యేక దృష్టి సారించి.. కీలక ఆటగాళ్ళను ఆర్సీబీ అట్టిపెట్టుకునే ఛాన్స్ ఉంది. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తొలి ఐపీఎల్ టైటిల్ వైపు విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రజత్ పాటిదార్.. జట్టు టాప్ రన్ స్కోరర్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్యా రిటైన్ లిస్టులో ముందు వరుసలో ఉంటారు.
వారికి గుడ్ బై
ఆపై స్వస్తిక్ ఛికారా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మనోజ్ భాండాగే, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాథీ, స్వాప్ యశ్ దయాల్ తర్వాతి వరుసలో ఉంటారు. ఇక ఎవరైతే ఆశించదగ్గ ప్రదర్శన ఇవ్వలేదో.. ఆ క్రికెటర్లకు గుడ్ బై చెప్పొచ్చు ఆర్సీబీ. ఆ లిస్టులో టిమ్ సీఫెర్ట్, మయాంక్ అగర్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్లెస్సింగ్ ముజారబానీ, రసిఖ్ దార్, నువాన్ తుషార ఉన్నారు.
ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేయగా.. అతడు 10 మ్యాచ్‌ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. రసిఖ్ దార్ బౌలింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ జమ్మూ కాశ్మీర్ పేసర్‌ను ఆర్‌సిబి దాదాపు రూ. 6 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. మయాంక్ అగర్వాల్, నువాన్ తుషార వంటి ఆటగాళ్ళను కూడా రిలీజ్ చేయవచ్చు.
మినీ వేలానికి ముందు పర్స్ ఇలా..
దాదాపు రూ. 15-18 కోట్ల పర్స్‌తో ఆర్సీబీ జట్టులో వేలంలోకి అడుగుపెత్తవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్‌ల జట్టు అద్భుతంగానే ఉన్నప్పటికీ.. ఈ వేలంలో వారు తమ లూప్ హోల్స్‌ను కవర్ చేసే ప్రయత్నం కచ్చితంగా చేస్తారని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి వారు వేలంలో ఏయే ఆటగాళ్ళను కొనుగోలు చేస్తారో వేచి చూడాలి.