- Home
- Sports
- అయ్యో.! సరిగ్గా 7 గంటల్లోనే విరాట్ కోహ్లీ ఆనందం ఆవిరైంది.. వన్డేల్లో అగ్రస్థానం కోల్పోయాడు..
అయ్యో.! సరిగ్గా 7 గంటల్లోనే విరాట్ కోహ్లీ ఆనందం ఆవిరైంది.. వన్డేల్లో అగ్రస్థానం కోల్పోయాడు..
Virat Kohli: భారత్‌తో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇది అతని వన్డే కెరీర్‌లో ఎనిమిదోది. అలాగే ఓ విషయంలో విరాట్ కోహ్లీని అధిగమించాడు.

భారత్ ఓటమి..
రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో స్టార్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ న్యూజిలాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్‌కు 285 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ఛేజింగ్‌లో డారిల్ మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 96 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు.
డారిల్ మిచెల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్
డారిల్ మిచెల్ ఇన్నింగ్స్ ఈ వన్డేలో కీలకమని చెప్పొచ్చు. సిరీస్‌లో నిలవాలంటే న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డారిల్ మిచెల్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. 117 బంతుల్లో 131 పరుగులు సాధించాడు.
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లో
ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. దీనిలో విరాట్ కోహ్లీ 785 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో, డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు, కేవలం 1 పాయింట్ తేడాతో ఇద్దరు ఉన్నారు.
కేవలం 23 పరుగులు మాత్రమే..
కానీ రాజ్‌కోట్‌లో విరాట్ కోహ్లీ కేవలం 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనితో మిచెల్‌కు అవకాశం లభించింది. అతడి సెంచరీ విరాట్‌ను దాటేసింది. మిచెల్ దాదాపుగా నెంబర్ 1 బ్యాట్స్‌మెన్ కానున్నాడు. అయితే, తదుపరి ర్యాంకింగ్స్ అప్‌డేట్ అయ్యేసరికి మిచెల్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకొనున్నాడు.
భారత్‌పై బలమైన రికార్డు
డారిల్ మిచెల్‌కు భారత జట్టుపై అద్భుతమైన రికార్డు ఉంది. అది కూడా భారత్‌లో అతడికి ఇది వరుసగా నాలుగో హయ్యెస్ట్ స్కోర్. మునుపటి మ్యాచ్‌లో కూడా 84 పరుగులు చేశాడు. అంతకముందు అతడు 134, 130 పరుగులు చేశాడు.

