MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • 7 మ్యాచ్‌ల్లో 640 పరుగులు.! తోపు తురమ్‌ఖాన్ అనుకున్నా.. కోహ్లీ భక్తుడికి పంగనామాలే.!

7 మ్యాచ్‌ల్లో 640 పరుగులు.! తోపు తురమ్‌ఖాన్ అనుకున్నా.. కోహ్లీ భక్తుడికి పంగనామాలే.!

Team India: విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. వరుసగా నాలుగు సెంచరీలు, మూడు సీజన్లలో 600కిపైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రిషభ్ పంత్ గాయం కారణంగా జట్టు నుంచి వైదొలిగినా.. పడిక్కల్‌కి స్థానం దక్కలేదు. 

2 Min read
Author : Pavithra D
Published : Jan 13 2026, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేశవాళీ క్రికెట్‌లో రాణించాల్సిందే..
Image Credit : Padikkal\BCCI

దేశవాళీ క్రికెట్‌లో రాణించాల్సిందే..

టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో తప్పక రాణించాల్సిందే. అయితే కొన్నిసార్లు దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా, కొంతమందికి దురదృష్టవశాత్తు భారత స్క్వాడ్‌లో చోటు దక్కదు. ఈ కోవలోకి కర్ణాటకకు చెందిన బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వస్తాడు. కొన్నేళ్లుగా పడిక్కల్ నిలకడైన ప్రదర్శనతో భారత వన్డే జట్టులో కచ్చితంగా స్థానం దక్కించుకునేందుకు కృషి చేస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్..
Image Credit : Devdutt Padikkal Instagram

విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్..

ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను వరుసగా 147, 124, 22, 113, 108, 91, 35 పరుగులు సాధించాడు. అంతేకాదు, అంతకుముందు సీజన్లలో కూడా ఈ కర్ణాటక ప్లేయర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. తొలి వన్డేకి ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంతో పడిక్కల్‌కు టీమిండియాలో చోటు దక్కుతుందని భావించారు. అయితే పంత్ వికెట్ కీపర్ కావడంతో అతని స్థానంలో మరొక వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు.

35
పడిక్కల్ మాట్లాడుతూ..
Image Credit : Social Media

పడిక్కల్ మాట్లాడుతూ..

ఈ విషయంపై పడిక్కల్ మాట్లాడుతూ, పంత్ గాయంతో సిరీస్‌కు దూరమైనా, తనను ఎంపిక చేస్తారని తాను అనుకోలేదని చెప్పాడు. రిషభ్ వికెట్ కీపర్. అతను గాయపడితే, బ్యాకప్ వికెట్ కీపర్‌ను ఎంపిక చేస్తారు. దీంతో తనకు స్క్వాడ్‌లో పిలుపు వస్తుందని అనుకోలేదని అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్ నాలుగు సెంచరీలు బాదేశాడు. తాజాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో త్రిపురపై సెంచరీతో సత్తా చాటిన పడిక్కల్ ఈ సీజన్‌లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు.

45
టోర్నీలో టాప్ స్కోరర్..
Image Credit : ANI

టోర్నీలో టాప్ స్కోరర్..

ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో ఇప్పటివరకు 640 పరుగులు చేసి ఈ టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. పడిక్కల్ వరుసగా మూడోసారి విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేయడం విశేషం. విజయ్ హజారే ట్రోఫీలో ఒక ప్లేయర్ మూడు సీజన్లలో 600కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. జార్ఖండ్ పై 147 పరుగులతో ఈ టోర్నీలో తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకున్న ఈ కర్ణాటక బ్యాటర్, ఆ తర్వాత కేరళపై 124 పరుగులు చేశాడు. తమిళనాడుపై 22 పరుగులు మాత్రమే చేసినా, పుదుచ్చేరిపై 113 పరుగులతో మరో సెంచరీ చేశాడు.

55
కొనసాగింపు ఇలా..
Image Credit : Getty

కొనసాగింపు ఇలా..

ఆ తర్వాత త్రిపురపై 108 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్ 120 బంతుల్లో 108 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా లిస్ట్-ఏ ఫార్మాట్లో పడిక్కల్‌కు ఇది 13వ సెంచరీ. అయితే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులు చేసి ఈ టోర్నీలో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇంత ఫామ్‌లో ఉన్నా కూడా దేవదత్ పడిక్కల్‌కు భారత జట్టులో స్థానం దక్కకపోవడం అనేది జట్టులో ఎంత పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
రాసిపెట్టుకోండి.! చిన్నస్వామి స్టేడియానికి ఇక కోహ్లీ రానట్లే.? కొత్త గ్రౌండ్ కోసం వెతుకులాట..
Recommended image2
4 వన్డేల్లో ఒక్క విజయం.. ఆ మైదానం పేరు వింటేనే టీమిండియా సుస్సుపోయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved