MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • IND vs WI : ఈడెన్ గార్డెన్స్‌లో హైటెన్షన్.. కోల్‌కతా వాతావరణ రిపోర్ట్ వచ్చేసింది.. గెలుపు ఎవరిది?

IND vs WI : ఈడెన్ గార్డెన్స్‌లో హైటెన్షన్.. కోల్‌కతా వాతావరణ రిపోర్ట్ వచ్చేసింది.. గెలుపు ఎవరిది?

India vs West Indies : మార్చి 1న కోల్‌కతాలో భారత్-వెస్టిండీస్ డూ ఆర్ డై పోరుకు సిద్ధమయ్యాయి. మరి ఈ సూపర్ 8 మ్యాచ్‌కు వాతావరణం అనుకూలించనుందా? భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ ఫలితం ఎందుకు కీలకమో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 28 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
IND vs WI: గెలవకపోతే ఇంటికే.. కోల్‌కతా పోరులో టీమిండియా భవితవ్యం తేలేది ఇక్కడే
Image Credit : Getty

IND vs WI: గెలవకపోతే ఇంటికే.. కోల్‌కతా పోరులో టీమిండియా భవితవ్యం తేలేది ఇక్కడే

టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. కోల్‌కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం (మార్చి 1) జరగనున్న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య పోరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం సూపర్ 8 మ్యాచ్ మాత్రమే కాదు, ఇరు జట్లకు ఇది చావో రేవో. ఒక రకంగా వర్చువల్ క్వార్టర్ ఫైనల్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్స్ చేరుకుంటుంది, ఓడిన జట్టు టోర్నీ నుండి అవుట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే సమయంలో కోల్‌కతా వాతావరణం ఎలా ఉండబోతోంది? వర్షం కురిసే అవకాశం ఉందా? అనే అంశాలు కీలకంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మార్చి 1న కోల్‌కతా వాతావరణం ఎలా ఉండనుంది?
Image Credit : Getty

మార్చి 1న కోల్‌కతా వాతావరణం ఎలా ఉండనుంది?

వివిధ వాతావరణ సంస్థల రిపోర్టుల ప్రకారం, ఆదివారం కోల్‌కతాలో మ్యాచ్‌కు ఎటువంటి ఆటంకం కలగకపోవచ్చు. పూర్తి స్థాయి 40 ఓవర్ల ఆట సాధ్యమవుతుందని అంచనా. ఆకాశం రోజంతా నిర్మలంగా, ఎండగా ఉంటుంది. సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు అస్సలు లేదు. 0% వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఎటువంటి జల్లులు కురిసే అవకాశం లేదు.

పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. మ్యాచ్ ప్రారంభ సమయానికి ఇది 25–26 డిగ్రీలకు పడిపోవచ్చు. దీనివల్ల ఆటగాళ్లకు వేడి నుండి ఉపశమనం లభిస్తుంది.

Related Articles

Related image1
IND vs WI : భారత అభిమానులకు టెన్షన్.. విండీస్‌తో తలపడితే మనోళ్లకి గండమేనా?
Related image2
IND vs WI: భారత్ vs వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?
36
IND vs WI సూపర్ 8 పోరు పై మంచు ప్రభావం ఉంటుందా?
Image Credit : Getty

IND vs WI సూపర్ 8 పోరు పై మంచు ప్రభావం ఉంటుందా?

ఈ మ్యాచ్‌లో వాతావరణం కంటే ఎక్కువగా మంచు ప్రభావం చూపే అవకాశం ఉంది. కోల్‌కతాలో తేమ శాతం 70% దాటే అవకాశం ఉండటంతో, ఫ్లడ్ లైట్ల కింద మైదానంలో మంచు కురుస్తుంది. దీనివల్ల బంతి తడిగా మారి బౌలర్లకు పట్టు దొరకడం కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని, తర్వాత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతుంది.

46
సూపర్ 8 గ్రూప్ 1 సమీకరణాలు: భారత్‌కు ఎందుకు ముఖ్యం?
Image Credit : Getty

సూపర్ 8 గ్రూప్ 1 సమీకరణాలు: భారత్‌కు ఎందుకు ముఖ్యం?

గ్రూప్ 1లో ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. మిగిలిన ఒక స్థానం కోసం భారత్, వెస్టిండీస్ పోటీ పడుతున్నాయి. జింబాబ్వేపై భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోయింది. ప్రస్తుతం భారత్, వెస్టిండీస్ రెండూ 2 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు 4 పాయింట్లతో సెమీస్‌కు వెళ్తారు.

56
వర్షం పడితే భారత్ కథ ముగిసినట్లేనా?
Image Credit : X@BCCI

వర్షం పడితే భారత్ కథ ముగిసినట్లేనా?

ఒకవేళ అద్భుతం జరిగి వాతావరణం మారి మ్యాచ్ రద్దయితే, అది టీమ్ ఇండియాకు భారీ దెబ్బ అవుతుంది. ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం వెస్టిండీస్ నెట్ రన్ రేటు +1.791 గా ఉండగా, భారత్ నెట్ రన్ రేటు -0.100 గా ఉంది.

అంటే వెస్టిండీస్ రన్ రేట్ చాలా మెరుగ్గా ఉండటంతో, మ్యాచ్ రద్దయితే వారు సెమీస్ చేరుకుంటారు, భారత్ టోర్నీ నుండి అవుట్ అవుతుంది. అందుకే ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం భారత్‌కు అత్యంత కీలకం.

66
సెమీ ఫైనల్ దిశగా భారత్ అడుగులు
Image Credit : Getty

సెమీ ఫైనల్ దిశగా భారత్ అడుగులు

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, మార్చి 4 లేదా 5 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ లేదా మరో క్వాలిఫైయర్ జట్టుతో తలపడుతుంది. మరోవైపు, రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ ఈ మ్యాచ్ గెలిచి మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. కోల్‌కతా క్రికెట్ అభిమానుల కేకల మధ్య ఈ ఆదివారం ఒక ఉత్కంఠభరిత పోరు ఖాయంగా కనిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
IND vs WI : భారత అభిమానులకు టెన్షన్.. విండీస్‌తో తలపడితే మనోళ్లకి గండమేనా?
Recommended image2
IND vs WI: భారత్ vs వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved