MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi : మొన్న ఐపీఎల్ సెంచరీ.. నేడు 331 స్ట్రైక్ రేట్ తో అరాచకం.. ఈ కుర్రాడికి ఆకాశమే హద్దు

Vaibhav Suryavanshi : మొన్న ఐపీఎల్ సెంచరీ.. నేడు 331 స్ట్రైక్ రేట్ తో అరాచకం.. ఈ కుర్రాడికి ఆకాశమే హద్దు

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ లో సరికొత్త సంచలనం నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వైభవ్ సూర్యవంశీ, మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 26 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మైదానంలో పరుగుల వరద.. వైభవ్ సూర్యవంశీ అరాచకం భయ్యా
Image Credit : Getty

మైదానంలో పరుగుల వరద.. వైభవ్ సూర్యవంశీ అరాచకం భయ్యా

భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణం, 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్‌తో గర్జించారు. డీవై పాటిల్ టీ20 కప్‌లో భాగంగా ఇండియన్ నేవీతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. డీవై పాటిల్ బ్లూ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్.. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 19 బంతుల్లోనే 63 పరుగులు సాధించారు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఆయన స్ట్రైక్ రేట్ ఏకంగా 331.58గా నమోదైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మెరుపు ఆరంభం.. బౌలర్లను దంచికొట్టాడు
Image Credit : Getty

మెరుపు ఆరంభం.. బౌలర్లను దంచికొట్టాడు

ఇండియన్ నేవీ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డీవై పాటిల్ బ్లూ ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగారు. తొలి ఓవర్ నుంచే తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. మొదటి ఓవర్‌లోనే నాలుగు బంతుల్లో 16 పరుగులు రాబట్టారు. కేవలం 12 బంతులు ముగిసేసరికి వ్యక్తిగత స్కోరు 43 పరుగులకు చేరుకుంది. ఐదో ఓవర్ ముగియకముందే కేవలం 14 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నారు. వైభవ్ బ్యాటింగ్ శైలి చూస్తుంటే ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే ఆయన తన ఫామ్‌ను ప్రపంచానికి చాటిచెప్పినట్లు కనిపిస్తోంది.

Related Articles

Related image1
IND vs ZIM : సూర్యకుమార్ యాదవ్ ఔట్? ఓడితే కెరీర్ డేంజర్‌లో పడ్డట్టే
Related image2
T20 World Cup 2026 : కోచ్ హింట్ ఇచ్చేశాడు.. కేరళ కింగ్ రీఎంట్రీ.. ఎవరెవరు అవుట్?
36
రికార్డుల రారాజు ఈ 14 ఏళ్ల కుర్రాడు
Image Credit : Getty

రికార్డుల రారాజు ఈ 14 ఏళ్ల కుర్రాడు

వైభవ్ సూర్యవంశీకి రికార్డులు కొత్తేమీ కాదు. 2025 ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించారు. ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించారు. అండర్-19 స్థాయిలోనూ ఆయన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 25 యూత్ వన్డేల్లో 56.48 సగటుతో, 165.72 స్ట్రైక్ రేట్‌తో 1,412 పరుగులు చేశారు. ఇందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా యూత్ వరల్డ్ కప్ ఫైనల్‌లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని అందించడం ఆయన కెరీర్‌లో మరో మైలురాయి.

46
చదువు కంటే క్రికెట్‌కే ప్రాధాన్యమంటున్న వైభవ్
Image Credit : Getty

చదువు కంటే క్రికెట్‌కే ప్రాధాన్యమంటున్న వైభవ్

క్రికెట్ పట్ల వైభవ్ సూర్యవంశీకి ఉన్న అంకితభావం ఎంతటిదంటే, ఇటీవల ఆయన తన పదో తరగతి బోర్డు పరీక్షలను సైతం వదులుకున్నారు. ఆటపై ఉన్న మక్కువతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ టీ20 గణాంకాలను పరిశీలిస్తే, 18 మ్యాచ్‌ల్లో 701 పరుగులు చేశారు. టీ20ల్లో ఆయన కెరీర్ స్ట్రైక్ రేట్ 204.37గా ఉంది. స్థిరమైన ప్రదర్శనతో ఆయన జాతీయ జట్టు సెలెక్టర్ల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు.

56
ఇతర ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంది?
Image Credit : Instagram/vaibhav_sooryavanshi09

ఇతర ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంది?

ఈ మ్యాచ్‌లో ఇండియన్ నేవీ తరపున కువర్ పాఠక్ 53 బంతుల్లో 87 పరుగులతో రాణించారు. కెప్టెన్ సూరజ్ వశిష్ఠ్ 9 బంతుల్లో 13 పరుగులు చేయగా, నితిన్ తన్వర్ 31 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. వికెట్ కీపర్ నకుల్ శర్మ 5 బంతుల్లో 15 పరుగులు సాధించారు. డీవై పాటిల్ బ్లూ జట్టులో వైభవ్ మినహా మిగిలిన వారు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. యశ్ ధుల్ 8 బంతుల్లో 12 రన్స్ చేయగా, సర్ఫరాజ్ ఖాన్ 19 బంతుల్లో 27 పరుగులు చేశారు.

66
అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్, ఆనంద్ బైస్
Image Credit : Getty

అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్, ఆనంద్ బైస్

మ్యాచ్ చివరి దశలో ఆనంద్ బైస్, అర్జున్ టెండూల్కర్ జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. ఆనంద్ బైస్ 24 బంతుల్లో 35 పరుగులు చేయగా, అర్జున్ టెండూల్కర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అర్జున్ 29 బంతులు ఎదుర్కొని 55 పరుగులతో అజేయంగా నిలిచారు. అలాగే కెప్టెన్ శశాంక్ సింగ్ 12 బంతుల్లో 20 పరుగులు జోడించారు. అయినప్పటికీ, మ్యాచ్ మొత్తానికి వైభవ్ సూర్యవంశీ ఆడిన 19 బంతుల మెరుపుదాడి హైలైట్‌గా నిలిచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Recommended image2
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Recommended image3
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Related Stories
Recommended image1
IND vs ZIM : సూర్యకుమార్ యాదవ్ ఔట్? ఓడితే కెరీర్ డేంజర్‌లో పడ్డట్టే
Recommended image2
T20 World Cup 2026 : కోచ్ హింట్ ఇచ్చేశాడు.. కేరళ కింగ్ రీఎంట్రీ.. ఎవరెవరు అవుట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved