MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi Net Worth : 14 ఏళ్లకే కోట్ల సామ్రాజ్యం.. వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంత?

Vaibhav Suryavanshi Net Worth : 14 ఏళ్లకే కోట్ల సామ్రాజ్యం.. వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంత?

Vaibhav Suryavanshi Net Worth : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ లోనూ దుమ్మురేపుతున్నాడు. అండర్ 19 ప్రపంచ కప్ 2026 పైనల్ లో సునామీ నాక్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ నికర విలువ, జీతం, రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 06 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్: ఐపీఎల్ జీతం, కార్ కలెక్షన్, రికార్డుల వేట
Image Credit : INSTA/vaibhav_sooryavanshi09

వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్: ఐపీఎల్ జీతం, కార్ కలెక్షన్, రికార్డుల వేట

భారత క్రికెట్ లో ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. అతడే 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించడమే కాకుండా, తన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. తాజాగా అండర్ 19 వరల్డ్ కప్ 2026 లో ఇంగ్లాండ్ బౌలింగ్ ను చిత్తు చేశాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు సునామీ నాక్ ఆడాడు.

బీహార్‌కు చెందిన ఈ ఎడమచేతి వాటం ఓపెనర్, కేవలం మైదానంలోనే కాకుండా సంపాదనలోనూ దూసుకుపోతున్నాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ అతని నికర విలువ, ఐపీఎల్ ద్వారా వస్తున్న ఆదాయం, ఇతర ఆస్తుల వివరాలు గమనిస్తే..

26
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ జీతం, కాంట్రాక్ట్ వివరాలు
Image Credit : Getty

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ జీతం, కాంట్రాక్ట్ వివరాలు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీని ఏకంగా రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పుడు అతని వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. 2025 సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో, 2026 సీజన్‌కు కూడా రాజస్థాన్ రాయల్స్ అతడిని అదే ధరకు (రూ. 1.1 కోట్లు) అట్టిపెట్టుకుంది. దీనితో కేవలం రెండు సీజన్లలోనే ఐపీఎల్ ద్వారా అతను రూ. 2.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు. ఐపీఎల్ జీతం ర్యాంకింగ్‌లో అతను ప్రస్తుతం 219వ స్థానంలో ఉన్నాడు.

Related Articles

Related image1
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Related image2
Vaibhav Suryavanshi : 15 ఫోర్లు, 15 సిక్సర్లు.. వార్నీ వీడు మనిషా రాక్షసుడా ! వరల్డ్ రికార్డులు బద్దలు
36
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ, దేశవాళీ ఆట ఆదాయాలు
Image Credit : Instagram/vaibhav_sooryavanshi09

వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ, దేశవాళీ ఆట ఆదాయాలు

బీసీసీఐ (BCCI) అండర్-19 క్రికెటర్లకు ఇచ్చే పారితోషికం అధికారికంగా వెల్లడించనప్పటికీ, పాత లెక్కల ప్రకారం రోజుకు రూ. 10,500 వరకు చెల్లిస్తారు. కూచ్ బెహర్ ట్రోఫీ వంటి టోర్నీల్లో ఆడిన వైభవ్, దేశవాళీ మ్యాచ్‌ల ద్వారా కూడా చెప్పుకోదగ్గ ఆదాయాన్ని పొందుతున్నాడు. 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి, అతి పిన్న వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన రెండో ఆటగాడిగా నిలిచిన ఈ కుర్రాడు, తన ప్రతిభతో స్పాన్సర్ల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాడు.

46
వైభవ్ సూర్యవంశీ విలాసవంతమైన కార్ల కలెక్షన్ ఇదే
Image Credit : X/@ImTanujSingh

వైభవ్ సూర్యవంశీ విలాసవంతమైన కార్ల కలెక్షన్ ఇదే

ఐపీఎల్ 2025 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధారణమైన స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేసినందుకు గానూ, అతనికి 'సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్' అవార్డుతో పాటు టాటా కర్వ్ (Tata Curvv) కారు బహుమతిగా లభించింది.

అభిషేక్ శర్మ, నికోలస్ పూరన్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. అయితే, 18 ఏళ్ల లోపు వయసు ఉన్నందున అతను ఈ కారును స్వయంగా నడపలేడు. పలు రిపోర్టుల ప్రకారం.. ఈ కారును అతను తన తల్లికి కానుకగా ఇచ్చాడు.

56
వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ ఎంత?
Image Credit : Instagram/vaibhav_sooryavanshi09

వైభవ్ సూర్యవంశీ నెట్ వర్త్ ఎంత?

వైభవ్ సూర్యవంశీ మొత్తం ఆదాయ వనరులను విశ్లేషిస్తే, 2026 నాటికి అతని నికర విలువ సుమారు రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్ల ($0.7 - $1.3 Million) మధ్య ఉంటుందని అంచనా. ఇందులో ఐపీఎల్ జీతం, దేశవాళీ మ్యాచ్ ఫీజులు, వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కలిసి ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెరుగుతున్న అతని ఫాలోయింగ్ కూడా అతని సంపాదనకు అదనపు బలాన్ని ఇస్తోంది.

66
చరిత్ర సృష్టించిన రికార్డుల సెంచరీ
Image Credit : ANI

చరిత్ర సృష్టించిన రికార్డుల సెంచరీ

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 38 బంతుల్లో 101 పరుగులు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 35 బంతుల్లోనే వంద మార్కును చేరుకుని, క్రిస్ గేల్ (30 బంతులు) తర్వాత రెండో వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా, ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 58 బంతుల్లోనే సెంచరీ చేసి, భారత్ తరపున ఫాస్టెస్ట్ యూత్ టెస్ట్ సెంచరీ రికార్డును కూడా నెలకొల్పాడు. ఇప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో దుమ్మురేపే నాక్ ఆడాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్
Recommended image2
T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?
Recommended image3
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Related Stories
Recommended image1
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Recommended image2
Vaibhav Suryavanshi : 15 ఫోర్లు, 15 సిక్సర్లు.. వార్నీ వీడు మనిషా రాక్షసుడా ! వరల్డ్ రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved