MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi : 15 ఫోర్లు, 15 సిక్సర్లు.. వార్నీ వీడు మనిషా రాక్షసుడా ! వరల్డ్ రికార్డులు బద్దలు

Vaibhav Suryavanshi : 15 ఫోర్లు, 15 సిక్సర్లు.. వార్నీ వీడు మనిషా రాక్షసుడా ! వరల్డ్ రికార్డులు బద్దలు

Vaibhav Suryavanshi : అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులతో వీరవిహారం చేశాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 06 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: 15 సిక్సర్లతో ప్రపంచ రికార్డు.. ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు!
Image Credit : Getty

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: 15 సిక్సర్లతో ప్రపంచ రికార్డు.. ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు!

హరారేలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచిన వైభవ్, ఇంగ్లీష్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.

80 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 175 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం గమనార్హం. 218.75 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన సూర్యవంశీ, మేనీ లూమ్స్‌డెన్ బౌలింగ్‌లో థామస్ రియూకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత జట్టు 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

26
సిక్సర్ల వర్షం.. డెవాల్డ్ బ్రెవిస్ రికార్డు బ్రేక్
Image Credit : BCCI

సిక్సర్ల వర్షం.. డెవాల్డ్ బ్రెవిస్ రికార్డు బ్రేక్

ఈ ఇన్నింగ్స్ ద్వారా ఒక అండర్-19 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 15వ ఓవర్లో స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన వైభవ్, 2022లో డెవాల్డ్ బ్రెవిస్ (18 సిక్సర్లు) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.

ఈ టోర్నీలో వైభవ్ మొత్తం 28 సిక్సర్లు నమోదు చేయడం విశేషం. అంతేకాకుండా, ఒకే యూత్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (15) కొట్టిన ఆటగాడిగా తన పాత రికార్డును (14 సిక్సర్లు - యుఏఈ పై) తానే తిరగరాశాడు. ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ హిల్ 2008లో నెలకొల్పిన 12 సిక్సర్ల రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.

Related Articles

Related image1
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Related image2
WPL 2026: మంధానా మజాకా.. ఆరెంజ్ క్యాప్ తనదే.. టాప్ 5 బ్యాటర్లు వీరే
36
రెండో వేగవంతమైన సెంచరీ.. గజగజలాడిన ఇంగ్లాండ్
Image Credit : Getty

రెండో వేగవంతమైన సెంచరీ.. గజగజలాడిన ఇంగ్లాండ్

వైభవ్ సూర్యవంశీ కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. ఆస్ట్రేలియాకు చెందిన విల్ మాలాజ్చుక్ (51 బంతులు) రికార్డును వైభవ్ దగ్గరలో కోల్పోయాడు.

అంతకుముందు వైభవ్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంటే 50 నుండి 100 పరుగులకు చేరుకోవడానికి అతను కేవలం 23 బంతులు మాత్రమే తీసుకున్నాడు. భారత్ తరపున గతంలో రాజ్ బావా (69 బంతులు) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.

46
మ్హాత్రేతో కీలక భాగస్వామ్యం
Image Credit : Getty

మ్హాత్రేతో కీలక భాగస్వామ్యం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆరోన్ జార్జ్ (9) నాలుగో ఓవర్లోనే అవుట్ అయినప్పటికీ, కెప్టెన్ ఆయుష్ మ్హాత్రేతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 90 బంతుల్లో 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్హాత్రే 19వ ఓవర్లో 51 బంతుల్లో 53 పరుగులు (7 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి అవుట్ అయ్యాడు. మ్హాత్రే అవుట్ అయినా వైభవ్ ఏమాత్రం తగ్గకుండా ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

56
ఫైనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు
Image Credit : Getty

ఫైనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో సెంచరీ సాధించిన మూడో భారతీయుడిగా వైభవ్ నిలిచాడు. గతంలో ఉన్ముక్త్ చంద్ (2012లో ఆస్ట్రేలియాపై 111 నాటౌట్), మన్జోత్ కల్రా (2018లో ఆస్ట్రేలియాపై 101 నాటౌట్) ఈ ఘనత సాధించారు. అయితే, 175 పరుగులు చేసిన వైభవ్, ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ విలియమ్స్ (108 పరుగులు) పేరిట ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు.

66
చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ

ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన షినోజాదా (436 పరుగులు) రికార్డును అతను అధిగమించాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు సార్లు 50+ స్కోర్లను 100+ స్ట్రైక్ రేట్‌తో సాధించిన తొలి బ్యాటర్‌గా వైభవ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 250 పరుగులు దాటిందంటే అది వైభవ్ సృష్టించిన ప్రభంజనమే కారణం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Cricketer: కోహ్లీ, ధోనీ కాదు.. భార‌త్‌లో రిచెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా.? రూ. 1450 కోట్ల ఆస్తులు
Recommended image2
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Recommended image3
టీమిండియా కాదు.. ఇది గుర్తుపెట్టుకోండి.! ఈసారి టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే
Related Stories
Recommended image1
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Recommended image2
WPL 2026: మంధానా మజాకా.. ఆరెంజ్ క్యాప్ తనదే.. టాప్ 5 బ్యాటర్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved