MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Vaibhav Sooryavanshi : వారెవ్వా వైభవ్... ఒకేసారి ఇన్ని రికార్డులు బద్దలుగొట్టేశావా నాయనా..!

Vaibhav Sooryavanshi : వారెవ్వా వైభవ్... ఒకేసారి ఇన్ని రికార్డులు బద్దలుగొట్టేశావా నాయనా..!

SRH vs RR : IPL 2026 లో పదిహేనేళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న కీలకమైన ప్లేఆఫ్ మ్యాచ్ లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో అతడు బద్దలుగొట్టిన రికార్డులివే..

3 Min read
Author : Arun Kumar P
Published : May 27 2026, 09:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత..
Image Credit : ANI

వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత..

SRH vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుట్టినప్పుడు అతడు భూమిపైకే రాలేదు... కానీ ఆ బుడ్డోడే ఇప్పుడు ఐపిఎల్ చరిత్రను తిరగరాస్తున్నాడు. ''ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా..'' అన్నట్లుగా రికార్డుల మోత మోగిస్తున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికి ఆరేస్తున్నాడు... ఇక యంగ్ బౌలర్లకు అయితే చుక్కలే. క్రీజులో అడుగుపెడుతూనే బౌండరీల మోత మోగిస్తున్నాడు.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఎంత ఎలివేషన్ ఇచ్చినా అతడి గురించి తక్కువే... ఆ క్రికెటర్ ఎవరో కాదు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశి.

ఈ ఐపిఎల్ లో ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఓ సెంచరీ బాదిన వైభవ్ మరోసారి చెలరేగాడు. కీలకమైన ప్లేఆఫ్ లో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. ఐపిఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతుల్లో 100 పరుగులు) రికార్డునI మిస్ అయ్యాడు. కానీ ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అనేక రికార్డులు బద్దలుగొట్టాడు వైభవ్. అవేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైభవ్ బద్దలుగొట్టిన గేల్ రికార్డులివే..
Image Credit : X/rajasthanroyals

వైభవ్ బద్దలుగొట్టిన గేల్ రికార్డులివే..

క్రిస్ గేల్ హయ్యెస్ట్ సిక్సర్ల రికార్డు..

ఓ ఐపిఎల్ సీజన్లో హయ్యెస్ట్ సిక్సర్లు బాదిన రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది... దీన్ని వైభవ్ సూర్యవంశి బద్దలుగొట్టాడు. సన్ రైజర్స్ తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో ఏకంగా 12 సిక్సర్లు బాదాడు... దీంతో ఈ సీజన్లో అతడు బాదిన సిక్సర్లు 60 ని మించిపోయింది. ఇలా 2012 నుండి గేల్ పేరిట ఉన్న రికార్డును ఈ 15 ఏళ్ల బుడ్డోడు బద్దలుగొట్టాడు.

10+ సిక్సులు అత్యధికసార్లు బాదిన రికార్డు..

ఐపిఎల్ చరిత్రలో అత్యధికసార్లు 10+ సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది... దీన్ని కూడా వైభవ్ సమం చేశాడు. గేల్ నాలుగుసార్లు ఈ ఫీట్ సాధించగా తాజా ఇన్నింగ్స్ తో వైభవ్ కూడా ఇదే రికార్డు సాధించాడు. అభిషేక్ శర్మ, ఫిన్ అలెన్ లు రెండుసార్లు 10+ సిక్సర్లు బాదారు.

Related Articles

Related image1
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Related image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
35
సూర్యవంశీ ఐపిఎల్ రికార్డులు
Image Credit : X/IPL

సూర్యవంశీ ఐపిఎల్ రికార్డులు

ఐపిఎల్ సీజన్లో అత్యధిక పవర్ ప్లే పరుగులు..

ఒకే సీజన్ పవర్ ప్లే లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు అతడు పవర్ ప్లే (1 నుండి 6 ఓవర్ల లోపు) సాధించిన పరుగులు 490. గతంలో డేవిడ్ వార్నర్ పవర్ ప్లే లో అత్యధికంగా 467 పరుగులు సాధించాడు. 2016 లో వార్నర్ సాధించిన రికార్డును సరిగ్గా పదేళ్ల తర్వాత వైభవ్ బద్దలుగొట్టాడు.

పవర్ ప్లే లో అత్యధిక సిక్సర్ల రికార్డు..

పవర్ ప్లే లో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా వైభవ్ సూర్యవంశీ పేరిట నమోదయ్యింది. ఇతడు కేవలం పవర్ ప్లే లోనే 8 సిక్సర్లు బాదాడు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సనత్ జయసూర్య పవర్ ప్లే లో 7 సిక్సర్లు బాదాడు. అలాగే జోస్ బట్లర్, బెయిర్ స్టో, అభిషేక్ శర్మలతో పాటు వైభవ్ కూడా 7 సిక్సర్లు బాదాడు.. ఇప్పుడు ఎనిమిది సిక్సర్లతో ఈ రికార్డును తిరగరాశాడు.

45
వైభవ్ సూర్యవంశీ ప్లేఆఫ్ రికార్డులు
Image Credit : ANI

వైభవ్ సూర్యవంశీ ప్లేఆఫ్ రికార్డులు

ప్లేఆఫ్ లో 50 కంటే ఎక్కువ పరుగులు..

కీలకమైన ప్లేఆఫ్స్ లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. గతంలో సురేష్ రైనా 87, ఆడమ్ గిల్ క్రిస్ట్ 74 పరుగులు చేశారు. కానీ తాజాగా సన్ రైజర్స్ పై ఏకంగా 97 పరుగులు సరికొత్త రికార్డు నెలకొల్పాడు వైభవ్.

ప్లేఆఫ్ లో అత్యధిక సిక్సర్లు..

ప్లేఆఫ్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. సన్ రైజర్స్ బౌలర్లలను ఊచకోత కోస్తూ ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. గతంలో గిల్ క్రిస్ట్ 10 సిక్సర్లే ప్లేఆఫ్ మ్యాచ్ లో హయ్యెస్ట్. అయితే నిన్న (మే 26, మంగళవారం) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా 9 సిక్సర్లు బాదాడు. దీంతో ఇతడు మూడో స్థానంలో ఉన్నాడు.

55
అత్యధిక పరుగులు సాధించిన అన్ క్యాప్ ప్లేయర్...
Image Credit : ANI

అత్యధిక పరుగులు సాధించిన అన్ క్యాప్ ప్లేయర్...

ఒకే ఐపిఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన అన్ క్యాప్డ్ ప్లేయర్ గా కూడా వైభవ్ చరిత్ర నెలకొల్పాడు. ఇప్పటివరకు ఇతడు 680 పరుగులు చేశాడు. గతంలో యశస్వి జైస్వాల్ 625, మార్ష్ 616, రియాన్ పరాగ్ 573, ప్రభుసిమ్రన్ సింగ్ 549 పరుగులు చేశారు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ వైభవ్ సూర్యవంశీదే. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
SRH vs RR : ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ పై గెలిచేది హైదరాబాదే... టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Recommended image3
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Related Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Recommended image2
Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved