MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!

Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సునామీ కొనసాగుతోంది. సిక్సర్ల వర్షం కురిపిస్తూ లక్నోపై 93 రన్స్‌తో దుమ్మురేపాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డుకు ఎసరు పెట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 20 2026, 07:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
15 బంతుల్లోనే కాదు.. ఇప్పుడు 10 సిక్సర్లతో లక్నోని ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ!
Image Credit : ANI

15 బంతుల్లోనే కాదు.. ఇప్పుడు 10 సిక్సర్లతో లక్నోని ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ!

ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం మామూలుగా లేదు. జైపూర్‌లో జరిగిన 64వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఊచకోత కోశాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది.

భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ యంగ్ బ్యాటర్ కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులు చేసి లక్నో బౌలర్లను ఆడేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 10 లాంగ్ సిక్సర్లు ఉన్నాయి. రాజస్థాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ లాస్ట్ బాల్‌కి మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టబోయి అబ్దుల్ సమద్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో కొద్దిలో సెంచరీ మిస్ అయింది. కానీ, ఈ 10 సిక్సర్లతో వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రమాదంలో క్రిస్ గేల్ హిస్టారికల్ రికార్డు
Image Credit : ANI

ప్రమాదంలో క్రిస్ గేల్ హిస్టారికల్ రికార్డు

ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డుకు వైభవ్ ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చాడు. 2012లో గేల్ 59 సిక్సర్లు కొట్టగా, వైభవ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 53 సిక్సర్లు బాదేశాడు. ఈ ప్రాసెస్ లో ఆండ్రీ రస్సెల్ (52 సిక్సర్లు, 2019) రికార్డుతో పాటు గేల్ కి ఉన్న మరికొన్ని రికార్డులను కూడా దాటేశాడు. 

ఒకే సీజన్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లను మూడుసార్లు కొట్టిన రెండో ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ ఇలా నాలుగు సార్లు చేసి టాప్‌లో ఉన్నాడు.

34
పవర్‌ప్లేలో పరుగుల సునామీ
Image Credit : ANI

పవర్‌ప్లేలో పరుగుల సునామీ

ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ పవర్‌ప్లే లోనూ తన రేంజ్ చూపించాడు. ఐపీఎల్ 2026 పవర్‌ప్లేలో వైభవ్ ఇప్పటివరకు ఏకంగా 426 పరుగులు సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక సీజన్ పవర్‌ప్లేలో డేవిడ్ వార్నర్ (467 రన్స్, 2016) తర్వాత ఇదే రెండో అత్యధిక స్కోరు. ఈ విషయంలో ట్రావిస్ హెడ్, సాయి సుదర్శన్ లాంటి స్టార్లను కూడా వెనక్కి నెట్టేశాడు.

విశేషం ఏంటంటే, లక్నోపై అతను 23 బంతుల్లో చేసిన హాఫ్ సెంచరీనే ఈ సీజన్‌లో అతని స్లోయెస్ట్ ఫిఫ్టీ. ఎందుకంటే అంతకుముందే అతను కేవలం 15 బంతుల్లోనే ఈ సీజన్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టి రికార్డు సెట్ చేశాడు.

44
రాజస్థాన్ రాయల్స్ నయా సిక్సర్ కింగ్స్
Image Credit : ANI

రాజస్థాన్ రాయల్స్ నయా సిక్సర్ కింగ్స్

వైభవ్ సూర్యవంశీ మాస్ బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కూడా ఒక క్రేజీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2026లో మొదటి 6 ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ టీమ్ మొత్తం 60 సిక్సర్లు కొట్టింది. 

ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్ పవర్‌ప్లేలో ఏ టీమ్ కూడా ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. దీనితో 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రియేట్ చేసిన 59 సిక్సర్ల రికార్డును రాజస్థాన్ రాయల్స్ బద్దలు కొట్టింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Recommended image2
IPL : ఈడు మామూలోడు కాదు బాబోయ్! ఇషాన్ కిషన్ ఊచకోతకు చెన్నై ఖేల్ ఖతం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved