MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !

Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం.. ఆ A సెలబ్రేషన్ సీక్రెట్ ఇదే బ్రో !

Vaibhav Sooryavanshi : లక్నోపై 93 పరుగులతో చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన వైరల్ 'A' సింబల్ సెలబ్రేషన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్, ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 20 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆ సింబల్ వెనుక ఉన్నది ఎవరో చెప్పేసిన వైభవ్.. షాక్ అవుతున్న అభిమానులు
Image Credit : ANI

ఆ సింబల్ వెనుక ఉన్నది ఎవరో చెప్పేసిన వైభవ్.. షాక్ అవుతున్న అభిమానులు

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్థాన్ రాయల్స్ టీమ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే అందుకుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఈ కుర్రాడి విధ్వంసమే. 

గ్రౌండ్‌లో ఫోర్లు, సిక్సర్లతో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు, ఏకంగా 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి ఆర్ఆర్ టీమ్‌కు సాలిడ్ విక్టరీని అందించాడు. దీంతో రాజస్థాన్ 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది.

Scorching FIFTY for Vaibhav Sooryavanshi ⚡️

How many times have we heard this in the season? 😅 

Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/Hgoh4n3QIe

— IndianPremierLeague (@IPL) May 19, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Vaibhav Sooryavanshi
Image Credit : X/IPL

Vaibhav Sooryavanshi

ఈ మ్యాచ్‌లో వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే పక్కా ప్లానింగ్‌తో వచ్చినట్టు కనిపించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను టచ్ చేసిన ఈ వండర్ కిడ్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. అయితే మోహ్‌సిన్ ఖాన్ వేసిన 13వ ఓవర్లో ఒక ఆసక్తికర డ్రామా జరిగింది. ఓవర్ ఫస్ట్ బాల్‌కే వైభవ్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

నాన్-స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న వైభవ్ రన్ కోసం ట్రై చేయగా.. బౌలర్ మోహ్‌సిన్ ఖాన్ వికెట్లను సరిగ్గా హిట్ చేయలేకపోయాడు. దాంతో బతికిపోయిన వైభవ్.. అదే ఓవర్ లాస్ట్ బాల్‌కి పెద్ద షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్సైనా.. లక్నోకి చేయాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో వైభవ్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.

35
వైరల్ అయిన A సింబల్ సెలబ్రేషన్ సీక్రెట్ ఏంటి?
Image Credit : ANI

వైరల్ అయిన A సింబల్ సెలబ్రేషన్ సీక్రెట్ ఏంటి?

హాఫ్ సెంచరీ కంప్లీట్ అవ్వగానే వైభవ్ సూర్యవంశీ తన చేతి వేళ్లతో ‘A’ సింబల్ చూపిస్తూ డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ పిక్ తెగ వైరల్ అయింది. మ్యాచ్ అయిపోయాక ప్రెజెంటేషన్ లో కామెంటేటర్ మురళీ కార్తిక్ దీని గురించి అడగ్గా.. వైభవ్ మొదట తనదైన స్టైల్లో ఫన్నీగా సమాధానమిచ్చాడు.

"ఏమో సార్.. నాకే తెలియదు! నేను ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త స్టైల్ ట్రై చేస్తాను. ముందేం ప్లాన్ చేసుకోను, దీని వెనుక పెద్దగా అర్థం కూడా లేదు" అంటూ నవ్వేశాడు. కానీ ఆ తర్వాత అసలు గుట్టు విప్పాడు. ఈ క్రేజీ ఇన్నింగ్స్‌ను తన తల్లికి అంకితం ఇస్తున్నానని, ఆమె పేరు 'A' అక్షరంతో స్టార్ట్ అవుతుందని, అందుకే ఆ సింబల్ చూపించానని చెప్పి అందరి మనసులు గెలుచుకున్నాడు.

An entertainer on the field and even off it 😄

That's Vaibhav Sooryavanshi for you 😌

Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/XO3ZKPPJWb

— IndianPremierLeague (@IPL) May 19, 2026

45
నాకు ప్రశంసలు వద్దు.. మైండ్ అంతా ఆట పైనే
Image Credit : ANI

నాకు ప్రశంసలు వద్దు.. మైండ్ అంతా ఆట పైనే

ఈ సీజన్‌లో మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నా వైభవ్ తలకెక్కించుకోవడం లేదు. ఎంతో మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ.. "మా బౌలింగ్ టైమ్‌లోనే డగౌట్‌లో కూర్చుని పిచ్‌ను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను. వికెట్ బ్యాటింగ్‌కు బాగా హెల్ప్ అవుతుందని అర్థమైంది. అందుకే స్టార్టింగ్‌లోనే అనవసరంగా తొందరపడకుండా, కొంచెం టైమ్ తీసుకుని క్రీజులో నిలబడాలి అనుకున్నాను. నేను ఎక్కువ సేపు ఉంటే అవతలి బ్యాటర్‌కు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. నాపై వచ్చే పొగడ్తలను నేను అస్సలు పట్టించుకోను. అసలు న్యూస్ పేపర్లే చదవను. ఇది కేవలం నా కెరీర్ బిగినింగ్ మాత్రమే. లాంగ్ రన్ ఆడడమే నా టార్గెట్" అని క్లారిటీ ఇచ్చాడు.

𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀

Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇

Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx

— IndianPremierLeague (@IPL) May 19, 2026

55
ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్ దూకుడు
Image Credit : X@IPL/Vaibhavsuryavanshi instagram

ప్లే ఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్ దూకుడు

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ టీమ్ మైండ్ సెట్ చాలా సింపుల్‌గా ఉందని వైభవ్ తెలిపాడు. ఎలాంటి ప్రెజర్ తీసుకోకుండా ప్రతీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయడమే తమ ప్లాన్ అని చెప్పాడు. టోర్నీలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశామని, కానీ చివరి మ్యాచ్‌లో కూడా ఇదే జోష్ కంటిన్యూ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

కాగా, లక్నోపై గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే నెక్స్ట్ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. ఆల్రెడీ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: విధి ఎంత విచిత్రమైందో.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్, ప్రస్తుతం దారుణ పరిస్థితి
Recommended image2
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image3
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Related Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. గేల్ రికార్డ్ ఇక అవుట్!
Recommended image2
Weather : బాబోయ్ ఎండలు.. ఈ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved