తక్కువగా చూడొద్దు.! టీమిండియాను సైతం ఓడించగలం.. జింబాబ్వే కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Zimbabwe: టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశకు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వరుస విజయాలతో ఓటమి ఎరుగకుండా సూపర్ 8కు చేరుకున్న జింబాబ్వే జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రజా స్పష్టం చేశాడు.

మంచి క్రికెట్ ఆడుతుందని..
సూపర్ 8లో తమ మ్యాచ్‌లు స్టార్ట్ అయ్యే ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. ఓటమి లేకుండా సూపర్ 8కు చేరిన తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుందని, అండర్‌డాగ్స్‌గా తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నామని తెలిపాడు. రాబోయే పోరుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.
కెప్టెన్ రజా వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశకు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వరుస విజయాలతో ఓటమి ఎరుగకుండా సూపర్ 8కు చేరుకున్న జింబాబ్వే జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రజా స్పష్టం చేశాడు. తమ సూపర్ 8 మ్యాచ్‌ల ముందు పిచ్ పరిస్థితులను అంచనా వేసి వ్యూహాలు సిద్ధం చేస్తామని తెలిపాడు.
ఈ నెల 23న పోరు..
ఈ నెల 23న జరగనున్న మ్యాచ్ తమకు నిజమైన పోరాటమని, ఫలితాల గురించి ఆందోళన చెందకుండా తమ శక్తి మేరకు పోరాడతామని రజా పేర్కొన్నాడు. మూడు మ్యాచులలో రెండింటిని గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, సూపర్ 8లో తొలి మ్యాచ్ గెలిస్తే అవకాశాలు మరింత మెరుగవుతాయని రజా అభిప్రాయపడ్డాడు. తమ జట్టు చూపించిన శ్రమ అద్భుతమని, తాము సూపర్ 8 చేరుతామని ఎవరూ ఊహించలేదని చెప్పాడు. అభిమానుల మనసులు గెలుచుకుని, వారి గౌరవం పొందడం గొప్ప విషయంగా భావిస్తున్నట్లు సికిందర్ రజా వెల్లడించాడు. తాము మంచి క్రికెట్ ఆడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయని తన జట్టు సభ్యులకు మెసేజ్ ఇచ్చినట్లు వివరించాడు.
తొలి మ్యాచ్ గెలిస్తే
సూపర్ 8లో తొలి మ్యాచ్ గెలిస్తే అవకాశాలు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాము ఎప్పుడూ ముందున్న లక్ష్యం పైనే దృష్టి పెడుతున్నామని, గత రెండు వారాల్లో తమ జట్టు చూపించిన శ్రమ అద్భుతమని కొనియాడాడు. నిజం చెప్పాలంటే, తాము సూపర్ 8కు చేరుతామని ఎవరూ ఊహించలేదని రజా వ్యాఖ్యానించాడు.
అదే గొప్ప విషయం..
అభిమానుల మనసులు గెలుచుకుని, వారి గౌరవం పొందటం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు. టాస్ ఓడిన వెంటనే తన జట్టు సభ్యులకు ఒకటే చెప్పానని, "మనం మంచి క్రికెట్ ఆడితే టాస్ ఫలితం మన మైండ్ సెట్ పై ఎలాంటి ప్రభావం చూపదు. పరిస్థితి ఏదైనా సరే మనం మంచి క్రికెట్ ఆడితే ఫలితాలు అవే వస్తాయి" అని వివరించాడు.
