14 ఏళ్ల చరిత్రలో ఒకే ఒక్క విజయం.. శ్రీలంక మరోసారి రికార్డులు తిరగరాస్తుందా.!
T20 World Cup 2026: గడిచిన 14 ఏళ్లుగా ఇంగ్లండ్‌పై శ్రీలంక ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. చివరిసారిగా 2014లో శ్రీలంక ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆ తర్వాత జరిగిన గత 11 టీ20 మ్యాచ్‌లలో..

శ్రీలంక, ఇంగ్లండ్ ఫైట్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం సూపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడించి అద్భుత ప్రదర్శన చేసిన ఆతిథ్య శ్రీలంకకు, సూపర్-8లో ఇంగ్లండ్ రూపంలో ఒక పెద్ద సవాల్ ఎదురైంది.
ఒక్క టీ20 మ్యాచ్ కూడా
గడిచిన 14 ఏళ్లుగా ఇంగ్లండ్‌పై శ్రీలంక ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. చివరిసారిగా 2014లో శ్రీలంక ఇంగ్లండ్‌ను ఓడించింది. ఆ తర్వాత జరిగిన గత 11 టీ20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్ జట్టు శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వరుస విజయాలను నమోదు చేసింది.
ఇప్పటివరకు 6 సార్లు తలపడగా
ప్రపంచకప్ రికార్డులను పరిశీలిస్తే, ఇరు జట్లు ఇప్పటివరకు 6 సార్లు తలపడగా, ఇంగ్లండ్ 5 సార్లు గెలిచి, శ్రీలంక కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించింది. విశేషమేమిటంటే, టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక సాధించిన ఆ ఏకైక విజయం కూడా సరిగ్గా ఇదే పల్లెకెలె స్టేడియంలో 2012లో నమోదైంది.
చరిత్రను పునరావృతం చేసి..
ఇప్పుడు మళ్ళీ అదే మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో శ్రీలంక చరిత్రను పునరావృతం చేసి, తన 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. సొంత గడ్డ కావడంతో శ్రీలంకకు కలిసొచ్చే అంశం కాగా, ఇంగ్లండ్ తన విజయ పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది.
మ్యాచ్ లకు వర్షం గండం..
శ్రీలంక సూపర్ 8 మ్యాచ్ లన్నీ కూడా లంక పిచ్ లపై జరుగుతుండటంతో.. వర్షం కారణంగా ఎన్ని జరుగుతాయో.. అలాగే ఎన్ని జరగవో చూడాలంటున్నారు అభిమానులు..
