MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం

Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం

Cricket Unique Records : బంగ్లాదేశ్ స్కూల్ క్రికెట్‌లో ముస్తాకిమ్ హౌలాదర్ 170 బంతుల్లో 404 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. తన ఇన్నింగ్స్ లో ఏకంగా 50 ఫోర్లు, 22 సిక్సర్ల బాదాడు. సునామీ బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 09 2026, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బౌలర్లను ఉతికారేసిన బ్యాటర్.. వన్డేలో 50 ఫోర్లు, 22 సిక్సర్లతో వీరవిహారం
Image Credit : Gemini

బౌలర్లను ఉతికారేసిన బ్యాటర్.. వన్డేలో 50 ఫోర్లు, 22 సిక్సర్లతో వీరవిహారం

క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏ రికార్డు బద్దలవుతుందో ఎవరూ ఊహించలేరు. సాధారణంగా వన్డే క్రికెట్‌లో ఒక జట్టు మొత్తం కలిసి 400 పరుగులు చేయడం గొప్ప విషయంగా భావిస్తారు. అలాంటిది ఒకే బ్యాటర్ ఏకంగా 404 పరుగులు చేయడం అనేది కలలో కూడా ఊహించలేని విషయం. చాలా మందికి ఇది వింటే ఒక జోక్‌లా అనిపించవచ్చు. కానీ, క్రికెట్ మైదానంలో ఈ అసంభవం సుసాధ్యమైంది. ఒక భయంకరమైన బ్యాటర్ తన బ్యాటింగ్ విన్యాసాలతో బౌలర్లను హడలెత్తించి, కేవలం 170 బంతుల్లోనే అజేయంగా 404 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.

26
వన్డేలో 170 బంతుల్లో 404 పరుగులు.. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు?
Image Credit : Facebook/TL14 Sports

వన్డేలో 170 బంతుల్లో 404 పరుగులు.. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు?

ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించిన క్రికెటర్ పేరు ముస్తాకిమ్ హౌలాదర్. బంగ్లాదేశ్‌లో గుర్తింపు పొందిన క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో ఈ సంచలనం నమోదైంది. 2025లో ఢాకా యూనివర్సిటీ సెంట్రల్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముస్తాకిమ్ హౌలాదర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కాంబ్రియన్ స్కూల్ అండ్ కాలేజ్ తరఫున బరిలోకి దిగిన ముస్తాకిమ్, ప్రత్యర్థి జట్టు అయిన సెయింట్ గ్రెగోరీ స్కూల్ అండ్ కాలేజ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 404 పరుగులు సాధించాడు. ఇందులో 332 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం గమనార్హం.

Related Articles

Related image1
T20 World Cup: పాకిస్థాన్ బాయ్‌కాట్ డ్రామాలో బిగ్ ట్విస్ట్.. ఐసీసీ మీటింగ్‌లో ఏం జరిగింది?
Related image2
Abhishek Sharma : తెలుగింటి అల్లుడి విధ్వంసం.. అభిషేక్ శర్మ ఎందుకు స్పెషలో తెలుసా?
36
బౌలర్లను హడలెత్తించిన బ్యాటింగ్
Image Credit : ChatGPT

బౌలర్లను హడలెత్తించిన బ్యాటింగ్

ముస్తాకిమ్ హౌలాదర్ బ్యాటింగ్ ధాటికి సెయింట్ గ్రెగోరీ స్కూల్ అండ్ కాలేజ్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మైదానంలో బౌలర్లు తమను కాపాడమని వేడుకుంటున్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇది స్కూల్ క్రికెట్‌లోని జిల్లా స్థాయి మ్యాచ్ అయినప్పటికీ, బంగ్లాదేశ్ క్రికెట్ అధికారుల గుర్తింపు ఉన్న మ్యాచ్ కావడం విశేషం. కేవలం తొమ్మిదో తరగతి చదువుతున్న ముస్తాకిమ్ హౌలాదర్, తన డాషింగ్ బ్యాటింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో ఇలాంటి విధ్వంసాన్ని ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడలేదంటే అతిశయోక్తి కాదు.

46
క్రీజులో 4 గంటల 20 నిమిషాలతో రికార్డు
Image Credit : Gemini

క్రీజులో 4 గంటల 20 నిమిషాలతో రికార్డు

కాంబ్రియన్ స్కూల్ అండ్ కాలేజ్ తరఫున టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ముస్తాకిమ్ హౌలాదర్, ఏకంగా 4 గంటల 20 నిమిషాల పాటు క్రీజులో గడిపాడు. మొత్తం 170 బంతులను ఎదుర్కొన్న అతడు, 237.64 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు సాధించాడు. అతని ఈ మారథాన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 50 ఫోర్లు, 22 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ముస్తాకిమ్ తన జట్టు కెప్టెన్ సోద్ పర్వేజ్‌తో కలిసి 699 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నిలిచింది.

56
సోద్ పర్వేజ్ కూడా డబుల్ సెంచరీ
Image Credit : our own

సోద్ పర్వేజ్ కూడా డబుల్ సెంచరీ

మరోవైపు కెప్టెన్ సోద్ పర్వేజ్ కూడా తక్కువేమీ తినలేదు. ముస్తాకిమ్‌కు చక్కటి సహకారం అందిస్తూనే, తను కూడా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సోద్ పర్వేజ్ 124 బంతుల్లో 206.45 స్ట్రైక్ రేట్‌తో 256 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సోద్ ఇన్నింగ్స్‌లో 32 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్‌తో కాంబ్రియన్ స్కూల్ అండ్ కాలేజ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 770 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

66
738 పరుగుల భారీ తేడాతో విజయం
Image Credit : our own

738 పరుగుల భారీ తేడాతో విజయం

ముస్తాకిమ్ హౌలాదర్, సోద్ పర్వేజ్ జోడి ప్రత్యర్థి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. సెయింట్ గ్రెగోరీ బౌలర్ల గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అద్రిట్టో బానిక్ 10 ఓవర్లలో 164 పరుగులు సమర్పించుకోగా, తన్వీర్ రెహమాన్ 9 ఓవర్లలో 132 పరుగులు, శాంసన్ రెహమాన్ 10 ఓవర్లలో 115 పరుగులు ఇచ్చారు. ఇఫాజ్ ఉద్దీన్ అయితే కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు ఇచ్చేశాడు. 

ఆ తర్వాత 771 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ గ్రెగోరీ జట్టు ఒత్తిడికి చిత్తయ్యింది. కేవలం 11.4 ఓవర్లలో 32 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో కాంబ్రియన్ స్కూల్ అండ్ కాలేజ్ 738 పరుగుల రికార్డు స్థాయి తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టులో కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే రెండంకెల స్కోరు (10 పరుగులు) చేయగలిగాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NAM : టీమిండియాలో 3 భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్ !
Recommended image2
T20 World Cup: పాకిస్థాన్ బాయ్‌కాట్ డ్రామాలో బిగ్ ట్విస్ట్.. ఐసీసీ మీటింగ్‌లో ఏం జరిగింది?
Recommended image3
Ind vs Pak : భారత్ అంటే అంత భయమా? కొలంబోలో రసవత్తర పోరు.. పాక్ అసలు గుట్టు ఇదే
Related Stories
Recommended image1
T20 World Cup: పాకిస్థాన్ బాయ్‌కాట్ డ్రామాలో బిగ్ ట్విస్ట్.. ఐసీసీ మీటింగ్‌లో ఏం జరిగింది?
Recommended image2
Abhishek Sharma : తెలుగింటి అల్లుడి విధ్వంసం.. అభిషేక్ శర్మ ఎందుకు స్పెషలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved