MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup : పాకిస్థాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ రద్దుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

T20 World Cup : పాకిస్థాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ రద్దుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Pakistan vs New Zealand : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. దీంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 21 2026, 11:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్‌ 8లో మారిన లెక్కలు.. పాక్ కివీస్ మ్యాచ్ రద్దుతో మరో రచ్చ
Image Credit : X@ICC

సూపర్‌-8లో మారిన లెక్కలు.. పాక్-కివీస్ మ్యాచ్ రద్దుతో మరో రచ్చ

టీ20 వరల్డ్ కప్ 2026లో అసలైన మజాను అందించే సూపర్-8 పోరు అప్పుడే ఉత్కంఠను రేపుతోంది. అయితే, శనివారం కొలంబోలో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సూపర్-8 పోరుకు వరుణుడు అడ్డుపడ్డాడు. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. దీంతో అభిమానులకు నిరాశ ఎదురవ్వడమే కాకుండా, గ్రూప్-2లో సెమీఫైనల్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

25
టాస్ పడగానే మొదలైన వర్షం
Image Credit : Getty

టాస్ పడగానే మొదలైన వర్షం

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ ప్రక్రియ ముగిసిన వెంటనే వర్షం మొదలైంది. ఎంతసేపు వేచి చూసినా వాన తగ్గకపోవడంతో, పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్ల ఖాతాలోకి చెరో పాయింట్ వచ్చి చేరింది.

Related Articles

Related image1
T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Related image2
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
35
మ్యాచ్ రద్దుతో పాక్, కీవీస్ కు జరిగే నష్టం ఏమిటి?
Image Credit : X@ICC

మ్యాచ్ రద్దుతో పాక్, కీవీస్ కు జరిగే నష్టం ఏమిటి?

ఈ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇరు జట్ల వద్ద 1-1 పాయింట్ ఉంది. సూపర్-8లో ఇవి కాకుండా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తమ తదుపరి మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంకతో తలపడనున్నాయి. ఈ స్థితిలో పాక్, కివీస్ జట్లకు తదుపరి రెండు మ్యాచ్‌లు డూ ఆర్ డై గా మారాయి. ఒకవేళ వచ్చే మ్యాచ్‌లో ఏదైనా జట్టు ఓడిపోతే సెమీఫైనల్ రేసు నుంచి దాదాపు అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువ.

మరోవైపు, ఈ మ్యాచ్ రద్దు కావడం ఇంగ్లాండ్, శ్రీలంక జట్లకు పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్, శ్రీలంక తమ రాబోయే మ్యాచ్‌లలో విజయం సాధిస్తే, వారు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుని సులభంగా సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

45
టీ ప్రపంచ కప్ 2026 సూపర్-8 రూల్స్ ఇవే
Image Credit : X Handle - Blackcaps

టీ ప్రపంచ కప్ 2026 సూపర్-8 రూల్స్ ఇవే

ప్రస్తుత వరల్డ్ కప్‌లో మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

• గ్రూప్-1: భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే.

• గ్రూప్-2: పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్.

ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ టాపర్ మరొక గ్రూప్‌లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్‌లో తలపడాల్సి ఉంటుంది. పాక్-కివీస్ మ్యాచ్ పాయింట్ల పంపకంతో గ్రూప్-2లో పోటీ మరింత తీవ్రమైంది.

55
గ్రూప్ దశలో ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉంది?
Image Credit : Getty

గ్రూప్ దశలో ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉంది?

పాకిస్థాన్ జట్టు గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 4 మ్యాచ్‌లలో 3 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల విజయం, అమెరికాపై 32 పరుగుల తేడాతో గెలుపు, నమీబియాపై 102 పరుగుల భారీ విజయం నమోదు చేసింది. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం 61 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

అటు న్యూజిలాండ్ సైతం గ్రూప్-డిలో 4 మ్యాచ్‌లలో 3 గెలిచి రెండో స్థానాన్ని దక్కించుకుంది. అఫ్గానిస్థాన్‌పై 5 వికెట్లు, యూఏఈపై 10 వికెట్లు, కెనడాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయాలు సాధించింది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పొందింది.

తర్వాతి మ్యాచ్ లు ఏ జట్లు ఆడనున్నాయి?

ఆదివారం సూపర్-8లో రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. పల్లెకెలె లో ఇంగ్లాండ్, శ్రీలంక తలపడనున్నాయి. గ్రూప్-2 సమీకరణాల దృష్ట్యా ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఇక రెండో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
PAK vs NZ : పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. సెమీస్ కష్టమే.. అసలు కారణం ఇదే
Recommended image2
IND vs SA : భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?
Recommended image3
IND vs SA : వరల్డ్ కప్ వేళ భారత్‌కు షాక్ మీద షాక్.. గాయంతో స్టార్ పేసర్ అవుట్
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Recommended image2
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved