MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • PAK vs NZ : పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. సెమీస్ కష్టమే.. అసలు కారణం ఇదే

PAK vs NZ : పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. సెమీస్ కష్టమే.. అసలు కారణం ఇదే

Pakistan vs New Zealand : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. అసలు ఏం జరిగింది? తర్వాతి మ్యాచ్‌ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 21 2026, 10:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pakistan vs New Zealand : వరుణుడి ప్రతాపం.. మ్యాచ్ రద్దు
Image Credit : X@ICC

Pakistan vs New Zealand : వరుణుడి ప్రతాపం.. మ్యాచ్ రద్దు

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సూపర్-8 పోరు వర్షార్పణమైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శనివారం జరగాల్సిన ఈ మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడకుండానే అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ను పంచుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితం ఇరు జట్ల సెమీఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

26
PAK vs NZ : టాస్ పడిన వెంటనే మొదలైన వర్షం
Image Credit : X@ICC

PAK vs NZ : టాస్ పడిన వెంటనే మొదలైన వర్షం

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. గ్రౌండ్ సిబ్బంది వెంటనే పిచ్‌ను కవర్లతో కప్పివేశారు. సమయం గడుస్తున్నా వర్షం తగ్గకపోగా, మరింత ఎక్కువైంది. మైదానంలో నీరు నిలిచిపోవడంతో రాత్రి 9:07 గంటలకు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Related Articles

Related image1
T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Related image2
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
36
ఇరు జట్ల ప్రయాణం: గ్రూప్ దశలో అదరగొట్టాయి
Image Credit : Getty

ఇరు జట్ల ప్రయాణం: గ్రూప్ దశలో అదరగొట్టాయి

పాకిస్థాన్ జట్టు గ్రూప్ ఏ లో అద్భుత ప్రదర్శన చేసి సూపర్-8కు అర్హత సాధించింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్‌పై 3 వికెట్లతో, యూఎస్‌ఏపై 32 పరుగులతో గెలిచిన పాకిస్థాన్, భారత్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత నమీబియాను 102 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.

మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ డీ లో రెండో స్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్థాన్‌పై 5 వికెట్లు, యూఏఈపై 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, కెనడాపై 8 వికెట్లతో గెలిచి సూపర్-8 దశకు చేరుకుంది.

46
తుది జట్టులో మార్పులు
Image Credit : x

తుది జట్టులో మార్పులు

ఈ కీలక మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ తుది జట్టులో కొన్ని మార్పులు చేశాయి. పాకిస్థాన్ జట్టు ఖ్వాజా నఫేను తప్పించి సీనియర్ ప్లేయర్ ఫఖర్ జమాన్‌ను జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ జట్టు ఏకంగా మూడు మార్పులు చేసింది. ముఖ్యంగా వారి కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తిరిగి జట్టులోకి రావడం విశేషం. అయితే, వరుణుడి అంతరాయం వల్ల ఈ మార్పులు మైదానంలో తమ ప్రభావాన్ని చూపలేకపోయాయి.

56
సెమీఫైనల్ సమీకరణాలు ఇవే
Image Credit : Getty

సెమీఫైనల్ సమీకరణాలు ఇవే

ఈ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. ఇరు జట్లకు ఇంకా రెండేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సెమీఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ ఓడిపోతే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే టోర్నీ నుండి అవుట్ అవుతాయి.

66
తర్వాతి పోరాటాలు ఎప్పుడంటే?
Image Credit : X@ICC

తర్వాతి పోరాటాలు ఎప్పుడంటే?

సూపర్-8లో పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 24న ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 28న శ్రీలంకతో తలపడనుంది. న్యూజిలాండ్ జట్టు ఫిబ్రవరి 25న శ్రీలంకతో, ఫిబ్రవరి 27న ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది. ఇక ఆదివారం జరగబోయే సూపర్-8 మ్యాచ్‌ల్లో పల్లెకెలెలో ఇంగ్లాండ్-శ్రీలంక, అహ్మదాబాద్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SA : భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?
Recommended image2
IND vs SA : వరల్డ్ కప్ వేళ భారత్‌కు షాక్ మీద షాక్.. గాయంతో స్టార్ పేసర్ అవుట్
Recommended image3
అభిషేక్ శర్మ డకౌట్స్ వెనక అక్క కోమల్..? ఇదేం దిక్కుమాలిన లాజిక్ రా సామీ..!
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?
Recommended image2
T20 World Cup: సూప‌ర్ 8కి ముందు కీల‌క మార్పులు.. ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి స్టార్ ప్లేయ‌ర్‌.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved