MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • T20 World Cup లో సిక్సర్ల సునామీ.. అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే

T20 World Cup లో సిక్సర్ల సునామీ.. అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే

Most Sixes in T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ఆటగాళ్లలో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 02 2026, 11:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బౌలర్లకు చుక్కలు చూపించారు.. T20 వరల్డ్ కప్ దుమ్మురేపారు
Image Credit : Getty

బౌలర్లకు చుక్కలు చూపించారు.. T20 వరల్డ్ కప్ దుమ్మురేపారు

టీ20 ప్రపంచకప్ 2026 మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ టోర్నీ ప్రారంభానికి ముందే అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. 

మరోవైపు, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్‌ను ఆడేందుకు పాకిస్థాన్ కూడా నిరాకరించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఛాంపియన్ భారత్ అన్ని జట్ల కంటే బలంగా కనిపిస్తూ, మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 ప్లేయర్లు ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్
Image Credit : Getty

1. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్

టీ20 ఫార్మాట్‌లో యూనివర్సల్ బాస్ గా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు గేల్ పేరిటే ఉంది. అతను తన కెరీర్‌లో మొత్తం 33 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. 

ఈ క్రమంలో 31 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి, 34.56 సగటు, 142.78 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 63 సిక్సర్లు బాదాడు. ఇప్పటివరకు ఏ ఇతర బ్యాటర్ కూడా ఈ మైలురాయిని చేరుకోలేకపోవడం విశేషం. సిక్సర్లతో పాటు అతను వరల్డ్ కప్‌లో 965 పరుగులు కూడా సాధించాడు.

Related Articles

Related image1
Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం
Related image2
Pakistan : పాకిస్థాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది.. గల్లీ క్రికెట్ ఆడుకోవాల్సిందే !
36
2. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ
Image Credit : Getty

2. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ

అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచారు. రోహిత్ ఇప్పటివరకు 47 మ్యాచ్‌ల్లో 44 ఇన్నింగ్స్‌లు ఆడి 50 సిక్సర్లు నమోదు చేశారు. 133.89 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన రోహిత్, ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం 1220 పరుగులు సాధించారు.

 భారత్ తరపున ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో రోహిత్ అగ్రస్థానంలో ఉన్నారు. హిట్ మ్యాన్ తనదైన శైలిలో పుల్ షాట్లతో బౌలర్లను వణికించి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు.

46
3. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం
Image Credit : Getty

3. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ విధ్వంసం

ఈ జాబితాలో ఉన్న ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్. అత్యధిక సిక్సర్ల విషయంలో అతను మూడో స్థానంలో ఉన్నాడు. బట్లర్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 35 మ్యాచ్‌లు ఆడి, 34 ఇన్నింగ్స్‌ల్లో 147.89 స్ట్రైక్ రేట్‌తో 43 సిక్సర్లు బాదాడు. మొత్తం 1013 పరుగులు చేసిన బట్లర్, ఆధునిక క్రికెట్‌లో ప్రమాదకరమైన బ్యాటర్‌గా గుర్తింపు పొందారు. అతని దూకుడు ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

56
4. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు
Image Credit : Getty

4. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు

కంగారూల తరపున ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు డేవిడ్ వార్నర్. వార్నర్ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో 41 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాల్గొన్నారు. 41 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన వార్నర్, 134.67 స్ట్రైక్ రేట్‌తో 35 సిక్సర్లు బాదారు. డేవిడ్ వార్నర్ తన కెరీర్ అంతటా అత్యంత నిలకడైన ఆటగాడిగా రాణించారు. గతేడాది 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

66
5. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ
Image Credit : AFP

5. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ

ఈ జాబితాలో ఐదవ స్థానంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలిచారు. కోహ్లీ తన కెరీర్‌లో ఆడిన 35 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో 31 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 35 సిక్సర్లు సాధించారు. ఆయన స్ట్రైక్ రేట్ 128.90గా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం
Recommended image2
Pakistan : పాకిస్థాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది.. గల్లీ క్రికెట్ ఆడుకోవాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved