MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వైభవ్ విధ్వంసం కూడా నారాయణ్ రికార్డును బద్దలుగొట్టలేకపోయిందిగా! ఎవరితడు, ఏమిటా రికార్డు?

వైభవ్ విధ్వంసం కూడా నారాయణ్ రికార్డును బద్దలుగొట్టలేకపోయిందిగా! ఎవరితడు, ఏమిటా రికార్డు?

వైభవ్ సూర్యవంశీ అతితక్కువ బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబులు సెంచరీ చేసి ఎన్నో రికార్డులను బద్దలుగొట్టాడు. కానీ యువ క్రికెటర్ నారాయణ్ జగదీసన్ రికార్డును టచ్ చేయలేకపోయాడు. ఇంతకీ ఎవరీ నారాయణ్, ఏమిటా రికార్డు?

3 Min read
Author : Arun Kumar P
Published : Nov 25 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వైభవ్ బద్దలుగొట్టలేకపోయిన రికార్డు ఇదే..
Image Credit : Facebook/ Indian Cricket Team

వైభవ్ బద్దలుగొట్టలేకపోయిన రికార్డు ఇదే..

15 ఏళ్ల కుర్రాడు.. మైదానంలోకి దిగితే బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అతడే భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ బ్యాటింగ్ చూసిన క్రికెట్ అభిమానులు ఔరా అంటున్నారు. ఇంతటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును మాత్రం వైభవ్ అందుకోలేకపోయాడు. ఈ రికార్డు ఇప్పటికీ తమిళనాడుకు చెందిన ఓ బ్యాటర్ పేరిటే ఉంది. అసలు ఈ క్రికెటర్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ బద్దలుగొట్టలేకపోయిన ఆ రికార్డు ఎప్పుడు, ఎలా నమోదైంది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లిస్ట్ ఏ క్రికెట్లో టాప్ స్కోరర్ ఎవరో తెలుసా?
Image Credit : Instagram/Jagadeesan

లిస్ట్ ఏ క్రికెట్లో టాప్ స్కోరర్ ఎవరో తెలుసా?

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇటీవల యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 53 బంతుల్లో 204 పరుగులు సాధించి లిస్ట్-ఎ క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌లో బౌండరీల కంటే సిక్సర్లే ఎక్కువగా కనిపించాయి. ఏకంగా 28 సిక్సర్లు, 7 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. అతడి బ్యాటింగ్ ధాటికి భారత జట్టు అద్భుత విజయం అందుకుంది.

ఇంత చిన్న వయసులోనే భారీ స్కోర్లు సాధిస్తూ రికార్డులను తిరగరాస్తున్న వైభవ్… భవిష్యత్తులో భారత క్రికెట్‌కు పెద్ద ఆస్తిగా మారతాడనే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా అతడు సాధించిన 204 పరుగులు లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కాదు. ఆ రికార్డు ఇంకా నారాయణ్ జగదీసన్ పేరిటే కొనసాగుతోంది.

ఎవరీ నారాయణ్ జగదీశన్?

తమిళనాడుకు చెందిన నారాయణ్ జగదీసన్ భారత దేశవాళీ క్రికెట్‌లో మంచి గుర్తింపు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్. 2022 నవంబర్ 21న విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 141 బంతుల్లో 277 పరుగులు సాధించి అప్పటివరకు ఉన్న లిస్ట్-ఎ క్రికెట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలుగొట్టాడు.

ఈ ఇన్నింగ్స్‌లో జగదీసన్ 25 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. అతడి స్ట్రైక్ రేట్ 196.45గా నమోదైంది. కేవలం వ్యక్తిగత రికార్డే కాదు.. ఈ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు కూడా చరిత్ర సృష్టించింది. జగదీసన్, సాయి సుదర్శన్ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 416 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తమిళనాడు జట్టు 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో అప్పటికి ఇదే అత్యధిక జట్టు స్కోరు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ 71 పరుగులకే ఆలౌట్ కావడంతో తమిళనాడు 435 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

34
జగదీసన్ రికార్డు వైభవ్ బద్దలుగొట్టేనా?
Image Credit : BCCI/X

జగదీసన్ రికార్డు వైభవ్ బద్దలుగొట్టేనా?

లిస్ట్-ఎ క్రికెట్‌లో 277 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు నారాయణ్ జగదీసన్ పేరిట కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ తాజాగా 204 పరుగులు చేసినప్పటికీ ఈ రికార్డుకు ఇంకా 73 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. భవిష్యత్తులో వైభవ్ ఇదే దూకుడుతో బ్యాటింగ్ కొనసాగిస్తే ఈ రికార్డును కూడా బద్దలుగొట్టే అవకాశం లేకపోలేదు.

రోహిత్ రికార్డుపై కన్నేసిన వైభవ్

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పేరిట ఉంది. 2014లో శ్రీలంకతో కోల్‌కతాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఏకంగా 264 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికీ చెరిగిపోని రికార్డుగా నిలిచింది.

వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో అంతర్జాతీయ వన్డేల్లో కూడా ఇదే స్థాయిలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే రోహిత్ రికార్డును అందుకోవడం లేదా బద్దలుగొట్టడం సాధ్యమే. అయితే ప్రస్తుతం వైభవ్ సాధించిన 204 పరుగులు దేశవాళీ, గుర్తింపు పొందిన లిస్ట్-ఎ క్రికెట్ రికార్డుల్లో భాగం. రోహిత్ 264 పరుగులు అంతర్జాతీయ వన్డే రికార్డు.

44
వైభవ్ సాధించిన రికార్డులివే..
Image Credit : X

వైభవ్ సాధించిన రికార్డులివే..

వైభవ్ సూర్యవంశీ తాజా ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు బాదడం మరో సంచలన రికార్డు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. బౌండరీల రూపంలోనే భారీ స్కోరు సాధించడం అతడి బ్యాటింగ్ శైలికి నిదర్శనం. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించాడు.

ఇప్పటికే అత్యంత వేగంగా 50, 100, 150 పరుగుల మార్కులను అందుకున్న వైభవ్, లిస్ట్-ఎ క్రికెట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. అతడి రికార్డుల జాబితా చూస్తే భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైభవ్ సూర్యవంశీ పేరిట నమోదైన రికార్డులు

- 11 బంతుల్లో అత్యంత వేగవంతమైన లిస్ట్-ఎ అర్ధ సెంచరీ

- 28 బంతుల్లో అత్యంత వేగవంతమైన లిస్ట్-ఎ సెంచరీ

- 40 బంతుల్లో అత్యంత వేగవంతమైన 150 పరుగులు

- 50 బంతుల్లో డబుల్ సెంచరీ

- ఒకే లిస్ట్-ఎ ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు

- లిస్ట్-ఎ సెంచరీల్లో అత్యంత భారీ స్ట్రైక్ రేట్.. 384.90

ఇలా చిన్న వయసులోనే అసాధారణ రికార్డులు సాధిస్తున్న వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో కొత్త ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అతడి దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో నారాయణ్ జగదీసన్ 277 పరుగుల రికార్డు మాత్రమే కాదు, అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ 264 పరుగుల రికార్డుపై కూడా అభిమానుల్లో చర్చ మొదలవుతోంది. మరి ఈ యువ సంచలనం భవిష్యత్తులో ఏ స్థాయికి చేరుకుంటాడో చూడాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఆట‌కు ప్ర‌పంచ‌మే ఫిదా.. పాకిస్థానీ ఆట‌గాళ్లు సైతం ప్ర‌శంస‌లు
Recommended image2
ఐపీఎల్ 2027 వేలంలో బిగ్ ట్విస్ట్.. రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ లిస్ట్‌లో ఇద్దరే ఇండియన్స్.. ఆ స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ
Recommended image3
28 బంతుల్లో సెంచ‌రీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ.. ప్ర‌పంచ క్రికెట్‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచిన 15 ఏళ్ల కుర్రాడు
Related Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : ఇషాన్ కెప్టెన్, వైభవ్ వైస్ కెప్టెన్... ఇది కదా టీం అంటే..!
Recommended image2
Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఆట‌కు ప్ర‌పంచ‌మే ఫిదా.. పాకిస్థానీ ఆట‌గాళ్లు సైతం ప్ర‌శంస‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved