MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం

Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం

Tilak Varma : టీ20 ప్రపంచకప్ 2026కు ముందు తిలక్ వర్మ ఫిట్‌నెస్ సాధించి ఫామ్‌లోకి రావడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఊరటనిచ్చింది. అమెరికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తిలక్ మెరుపులు మెరిపించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 02 2026, 09:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముంబైలో తిలక్ వర్మ సిక్సర్ల వర్షం.. టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ ఖాయం
Image Credit : Getty

ముంబైలో తిలక్ వర్మ సిక్సర్ల వర్షం.. టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ ఖాయం

టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. ఈ తరుణంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఉన్న అతిపెద్ద ఆందోళన దూరమైంది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి పూర్తిగా కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టారు. 

సోమవారం ఇండియా-ఏ తరపున అమెరికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తిలక్ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. తన బ్యాటింగ్ చూస్తుంటే ప్రపంచకప్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దూకుడుగా ఆడిన తిలక్ వర్మ
Image Credit : Twitter/BCCI

దూకుడుగా ఆడిన తిలక్ వర్మ

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు తిలక్ వర్మపైనే ఉన్నాయి. ఈ ఏడాది తిలక్ భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే టీ20 ప్రపంచకప్ జట్టులో ఆయనను ఎంపిక చేశారు. 

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్, ఏమాత్రం తడబడకుండా ఆడారు. 158.33 స్ట్రైక్ రేట్‌తో కేవలం 24 బంతుల్లోనే 38 పరుగులు సాధించారు. ఇందులో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. చివరకు శుభం రంజనే వేసిన బంతిని పుల్ షాట్ ఆడే క్రమంలో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగారు.

Related Articles

Related image1
Pakistan : పాకిస్థాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది.. గల్లీ క్రికెట్ ఆడుకోవాల్సిందే !
Related image2
IND vs PAK : రూ. 200 కోట్ల ఫైన్.. జట్టుపై బ్యాన్! భారత్‌తో పెట్టుకుంటే పాకిస్థాన్‌కు చుక్కలే
35
తీరిన గంభీర్ టెన్షన్
Image Credit : Getty

తీరిన గంభీర్ టెన్షన్

గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్‌కు తిలక్ ఫిట్‌నెస్ అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. గత ఏడాది పాకిస్థాన్‌పై గెలిచి ఆసియా కప్ సాధించడంలో తిలక్ కీలక పాత్ర పోషించారు. టీ20 ఫార్మాట్‌లో తిలక్ జట్టుకు వెన్నెముకగా మారారు. 

అయితే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు గ్రోయిన్ ఇంజరీ కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఆదివారం బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి ఆయనకు క్లియరెన్స్ లభించింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆయన తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు.

45
ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఖాయమా?
Image Credit : X/ICC

ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఖాయమా?

ఫిబ్రవరి 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే మ్యాచ్‌తో టీమ్ ఇండియా తన ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. తిలక్ వర్మ రాకతో తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన సంజూ శాంసన్ పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. తిలక్ మూడో స్థానంలో వస్తే, అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్ గత మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసి వచ్చే అంశం.

55
టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమైన భారత్
Image Credit : X/BCCI

టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమైన భారత్

తిలక్ వర్మ ఫామ్‌లోకి రావడం వల్ల భారత మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం తిలక్‌కు అదనపు బలం. ఒత్తిడిలో కూడా వేగంగా పరుగులు రాబట్టగల ఆయన సామర్థ్యం గంభీర్ వ్యూహాలకు సరిగ్గా సరిపోతుంది. 

వార్మప్ మ్యాచ్‌లో ఆయన చూపిన తెగువ అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. గాయం తర్వాత కూడా అదే దూకుడును ప్రదర్శించడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.

ప్రపంచకప్ పోరుకు అంతా సిద్ధం

ఈసారి ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దేశీయ పరిస్థితులపై తిలక్ వర్మకు మంచి పట్టు ఉంది. వాంఖడే స్టేడియం వంటి పిచ్‌లపై ఆయన గతంలో ఐపీఎల్‌లో అద్భుతాలు చేశారు. ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కావడమే కాకుండా, బ్యాట్‌తో కూడా సమాధానం చెప్పడంతో భారత్ బలం పెరిగింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
FIFA World Cup : ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2026 లో టాప్ 5 కోచ్‌లు వీళ్లే..!
Recommended image2
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image3
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
Pakistan : పాకిస్థాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది.. గల్లీ క్రికెట్ ఆడుకోవాల్సిందే !
Recommended image2
IND vs PAK : రూ. 200 కోట్ల ఫైన్.. జట్టుపై బ్యాన్! భారత్‌తో పెట్టుకుంటే పాకిస్థాన్‌కు చుక్కలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved