MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Tilak Varma Net Worth : క్రికెట్ పిచ్‌పైనే కాదు.. సంపాదనలోనూ తిలక్ వర్మ సెంచరీ !

Tilak Varma Net Worth : క్రికెట్ పిచ్‌పైనే కాదు.. సంపాదనలోనూ తిలక్ వర్మ సెంచరీ !

Tilak Varma Net Worth : హైదరాబాద్‌ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తిలక్ వర్మ.. ప్రస్తుతం భారీగానే సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ₹8 కోట్ల రిటెన్షన్ డీల్ తిలక్ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 03 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎలక్ట్రీషియన్ కొడుకు నుంచి కోటీశ్వరుడి వరకు.. తిలక్ వర్మ రేంజ్ మార్చేసిన ఐపీఎల్!
Image Credit : Getty

ఎలక్ట్రీషియన్ కొడుకు నుంచి కోటీశ్వరుడి వరకు.. తిలక్ వర్మ రేంజ్ మార్చేసిన ఐపీఎల్!

ఆధునిక భారత క్రికెట్ ఒక సామాన్య ఆటగాడి జీవితాన్ని ఎంత వేగంగా మార్చగలదో చెప్పడానికి తిలక్ వర్మ ఒక నిలువెత్తు సాక్ష్యం. హైదరాబాద్‌లోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తిలక్.. ప్రస్తుతం టీమ్ ఇండియా నమ్మదగ్గ ఆటగాడిగా ఎదగడమే కాకుండా ఆర్థికంగానూ బలమైన స్థితికి చేరుకున్నారు. 2026 నాటికి తిలక్ వర్మ నికర ఆస్తి విలువ సుమారు ₹8 నుంచి ₹10 కోట్లుగా ఉంటుందని అంచనా. ఐపీఎల్ జీతం, బీసీసీఐ ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా ఈ ఆదాయం సాధ్యమైంది.

26
తిలక్ వర్మ ఆర్థిక స్థితిని మార్చిన ఐపీఎల్ రిటెన్షన్
Image Credit : our own

తిలక్ వర్మ ఆర్థిక స్థితిని మార్చిన ఐపీఎల్ రిటెన్షన్

తిలక్ వర్మ కెరీర్‌లో 2025 ఐపీఎల్ రిటెన్షన్ అతిపెద్ద మలుపుగా నిలిచింది. అంతకుముందు 2022 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్ ఆయనకు ఏడాదికి ₹1.70 కోట్లు చెల్లించేది. అయితే, 2025 వేలానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తిలక్ వర్మను ₹8 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ ఒక్క ఒప్పందం ఆయన ఆదాయాన్ని భారీగా పెంచింది. 2026 నాటికి ఆయన మొత్తం నికర ఆస్తిలో 60 శాతానికి పైగా వాటా ఐపీఎల్ ఆదాయానిదే కావడం విశేషం.

Related Articles

Related image1
Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం
Related image2
T20 World Cup లో సిక్సర్ల సునామీ.. అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
36
బీసీసీఐ కాంట్రాక్ట్, తిలక్ వర్మ మ్యాచ్ ఫీజుల వివరాలు
Image Credit : our own

బీసీసీఐ కాంట్రాక్ట్, తిలక్ వర్మ మ్యాచ్ ఫీజుల వివరాలు

ఐపీఎల్ మాత్రమే కాకుండా, టీమ్ ఇండియా తరఫున నిలకడగా రాణిస్తుండటంతో బీసీసీఐ నుంచి కూడా తిలక్ వర్మకు భారీ ఆదాయం అందుతోంది. ప్రస్తుతం తిలక్ వర్మ బీసీసీఐ గ్రేడ్ సీ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నారు. దీని ద్వారా ఆయనకు ఏడాదికి ₹1 కోటి రిటైనర్ ఫీజు లభిస్తుంది. దీనికి అదనంగా ఆయన ఆడే ప్రతి టీ20, వన్డే మ్యాచ్‌లకు విడిగా మ్యాచ్ ఫీజులు అందుతాయి. ఆసియా కప్, ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన జట్టులో సభ్యుడిగా ఉండటం ఆయన బ్రాండ్ విలువను మరింత పెంచింది.

46
బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల తో తిలక్ వర్మ జోరు
Image Credit : Tilak Varma\Twitter

బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల తో తిలక్ వర్మ జోరు

మైదానంలో తిలక్ వర్మ చూపిస్తున్న ప్రతిభను చూసి ప్రముఖ కంపెనీలు ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయన బూస్ట్ (Boost), ఎస్ఎస్ (SS),ఈబైక్ గో (eBikeGo) వంటి బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. 2026 నాటికి ఆయన ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏడాదికి ₹1 నుంచి ₹1.5 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని టాప్ బ్రాండ్లకు సంతకం చేసే అవకాశం ఉంది.

56
తిలక్ వర్మ లగ్జరీ కార్లు.. సొంత ఇల్లు
Image Credit : X/BCCI

తిలక్ వర్మ లగ్జరీ కార్లు.. సొంత ఇల్లు

ఆదాయం పెరగడంతో తిలక్ వర్మ తన జీవనశైలిని కూడా అద్భుతంగా మార్చుకున్నారు. హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో ఆయనకు సొంతంగా ఒక బహుళ అంతస్తుల ఇల్లు ఉంది. కార్ల విషయానికి వస్తే, ఆయన గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (Mercedes-Benz S-Class), బీఎండబ్ల్యూ 7 సిరీస్ (BMW 7 Series) వంటి అత్యంత విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తక్కువ వయసులోనే ఇలాంటి ఖరీదైన ఆస్తులను కూడబెట్టడం ఆయన ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం.

66
తిలక్ వర్మ భవిష్యత్తులో మరింత ఆదాయం
Image Credit : Getty

తిలక్ వర్మ భవిష్యత్తులో మరింత ఆదాయం

2026 నాటికి 23 ఏళ్ల వయసులోనే తిలక్ వర్మ ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచారు. ఒకవేళ ఆయన భారత వైట్ బాల్ క్రికెట్ జట్టులో శాశ్వత స్థానం సంపాదించి, ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడిగా కొనసాగితే, రాబోయే ఐపీఎల్ ఎడిషన్ నాటికి ఆయన నికర ఆస్తి ₹15 నుంచి ₹20 కోట్లకు చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI: భారత్ vs వెస్టిండీస్ డూ ఆర్ డై మ్యాచ్ రద్దయితే సెమీస్ చేరేది ఎవరు?
Recommended image2
IND vs WI : వెస్టిండీస్‌తో చావో రేవో.. హోం గ్రౌండ్ లో రింకూ సింగ్ ఆడేనా?
Recommended image3
IND vs WI : భారత అభిమానులకు టెన్షన్.. విండీస్‌తో తలపడితే మనోళ్లకి గండమేనా?
Related Stories
Recommended image1
Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం
Recommended image2
T20 World Cup లో సిక్సర్ల సునామీ.. అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved