MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • అభిషేక్ కు దోకా లేదు.. టచ్ చేసే సాహసం కూడా టీమిండియా చేయలేదు.. ఎందుకో తెలుసా..?

అభిషేక్ కు దోకా లేదు.. టచ్ చేసే సాహసం కూడా టీమిండియా చేయలేదు.. ఎందుకో తెలుసా..?

T20 World Cup 2026 : జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ లో టీమిండియాలో ఎవరున్నా లేకపోయినా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం పక్కా ఉంటాడు. ఇంత కచ్చితంగా చెప్పడానికి కారణమేంటో తెలుసా?   

3 Min read
Author : Arun Kumar P
Published : Feb 25 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభి'షేక్' చేస్తాడా..?
Image Credit : AFP

అభి'షేక్' చేస్తాడా..?

ICC Men's T20 World Cup 2026 : స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే... ఇదీ టీమిండియా టార్గెట్. ఇందుకు తగినట్లుగానే గ్రూప్ స్టేజ్ లో ఓటమన్నదే ఎరగకుండా విజయపరంపర కొనసాగించింది. కానీ కీలకమైన సూపర్-8 కు వచ్చేసరికి మొదటి అడుగే తడబడింది... సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇది టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది.

ప్రస్తుతం సూపర్-8 గ్రూప్ 1 లో వెస్టిండిస్, సౌతాఫ్రికా ఒక్కో విజయంతో టాప్ లో ఉన్నాయి... ఇండియా, జింబాబ్వే ఒక్కో ఓటమితో చివర్లో ఉన్నాయి. ఈ క్రమంలో రేపు (ఫిబ్రవరి 26, గురువారం) ఇండియా, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు టీ20 వరల్డ్ కప్ రేసు నుండి తప్పుకున్నట్లే. 

ఇక ఇండియా vs జింబాబ్వే మ్యాచ్ లో గెలిచే జట్టు కూడా అంత సేఫ్ ఏమీ కాదు... భారీ విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అంతేకాదు సౌతాఫ్రికా, వెస్టిండిస్ జట్ల ప్రదర్శనపై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే భారత్ పక్కా జింబాబ్వేను చిత్తుగా ఓడించే ప్లాన్ తో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇందుకోసం టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పైనే ఆశలు పెట్టుకోక తప్పదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభిషేక్ పైనే టీమిండియా ఆశలు...
Image Credit : Getty

అభిషేక్ పైనే టీమిండియా ఆశలు...

టీ20 వరల్డ్ కప్ సూపర్-8 కొనసాగుతోంది... ఇందులోంచి నాలుగు (గ్రూప్ 2 నుండి 2, గ్రూప్ 2 నుండి 2) జట్లు సెమీస్ కు చేరతాయి. ఈ క్రమంలో గ్రూప్ 1 లో ఇప్పటికే జింబాబ్వేను భారీ పరుగుల తేడాతో ఓడించి వెస్టిండిస్ 2 పాయింట్లు, +5.350 నెట్ రన్ రేట్ సాధించింది. టీమిండియాపై కూడా సౌతాఫ్రికా ఘన విజయం సాధించి 2 పాయింట్లు, +3.800 రన్ రేట్ సాధించింది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే సెమీస్ కు చేరాలంటే విన్నింగ్ పాయింట్లే కాదు నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. అంటే టీమిండియా జింబాబ్వేపై భారీ విజయం సాధించాలన్నమాట... ఇది జరగాలంటే అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లు జట్టులో ఉండాల్సిందే.

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైనరోజు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా ఉన్న క్రికెటర్. అతడి బ్యాటింగ్ టీ20 క్రికెట్ కు సరిగ్గా సరిపోతుంది. అంతేకాదు గత క్యాలెండర్ ఇయర్ లో అతడు అత్యధిక పరుగులతో అద్భుతంగా రాణించాడు... టీ20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ల ర్యాకింగ్ లో టాప్ లో నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి అతడి ఆటతీరు అంత గొప్పగా లేదు... ఫామ్ కోల్పోయి హ్యాట్రిక్ డకౌట్లతో చెత్త రికార్డు నెలకొల్పాడు. కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్ లోనూ ఇతడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్ లో ఇతడిని ఆడించరనే ప్రచారం జరిగింది... కానీ ఇది జరిగే అవకాశాలే లేవని స్పష్టంగా అర్థమవుతోంది.

35
తిలక్ వర్మ ఔట్...
Image Credit : AFP

తిలక్ వర్మ ఔట్...

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు ఉంది ప్రస్తుతం హైదరబాదీ క్రికెటర్ తిలక్ వర్మ పరిస్థితి. ఓపెనర్ అభిషేక్ వరుసగా విఫలం అవుతున్నా భారీ హిట్టర్ కావడంతో జింబాబ్వేతో మ్యాచ్ లో ఆడించక తప్పని పరిస్థితి. మరి ఎవరిని పక్కనబెట్టి సంజూ శాంసన్ ను జట్టులో చోటు కల్పించాలి... అక్కడ తిలక్ వర్మ తప్ప మరో ఆప్షన్ లేదు. అందుకే అభిషేక్ స్థాయిలో విఫలం కాకపోయినా.. కాస్త డీసెంట్ పరుగులే చేసినా తిలక్ వర్మపైనే వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

45
జింబాబ్వే మ్యాచ్ కు రింకూ సింగ్ దూరం...
Image Credit : X

జింబాబ్వే మ్యాచ్ కు రింకూ సింగ్ దూరం...

సూపర్-8 లో కీలకమైన మ్యాచ్ వేళ టీమిండియాకు షాక్ తగిలింది. యువ క్రికెటర్, మంచి ఫినిషర్ రింకూ సింగ్ జట్టుకు దూరమయ్యాడు. రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు... ప్రస్తుతం అతడి పరిస్థితి పూర్తిగా క్షీణించి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఇలా వ్యక్తిగత కారణాలతో రింకూ జట్టుకు దూరమయ్యాడు. అతడిస్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఆడించే అవకాశాలున్నాయి.

55
జింబాబ్వేకూ చావో రేవో...
Image Credit : Getty

జింబాబ్వేకూ చావో రేవో...

గురువారం జరిగే మ్యాచ్ టీమిండియాకే కాదు జింబాబ్వేకు డూ ఆర్ డై మ్యాచ్. ఆస్ట్రేలియా వంటి బలమైన టీంను ఓడించి అనూహ్యంగా సూపర్-8 లోకి దూసుకువచ్చింది జింబాబ్వే. దీంతో ఆ జట్టుకు వరల్డ్ కప్ ట్రోఫీపై ఆశలు చిగురించాయి. కానీ వెస్టిండిస్ చేతిలో ఓటమితో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి... భారత్ చేతిలో ఓడిపోతే ఆ టీం వరల్డ్ కప్ నుండి నిష్క్రమించాల్సిందే. అందుకే ఈ మ్యాచ్ ను జింబాబ్వే కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది... టీమిండియాను ఓడించేందుకు పక్కా వ్యూహాలతో బరిలోకి దిగనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
నెక్ట్స్ మ్యాచ్ కాదు.. టీ20 వరల్డ్ కప్ నుండే అభిషేక్ ఔట్..? జట్టులోకి యంగ్ ప్లేయర్ ఎంట్రీ ఫిక్స్
Recommended image2
0,0,0 రన్స్ తో హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా అభిషేక్ నే ఎందుకు ఆడిస్తున్నారో తెలుసా? టాప్ రీజన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved