MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Team India XI : జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే

Team India XI : జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే

ICC Men's T20 World Cup 2026 : ఐసిసి టీ20 వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై టీమిండియా పక్కా గెలవాల్సిందే. ఇంతటి కీలకమైన మ్యాచ్ లో భారత జట్టులోకి వచ్చేదెవరు? బైటకు వెళ్లేదెవరు..? తుది జట్టు ఎలా ఉండనుందో చూద్దాం.  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 25 2026, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇండియా vs జింబాబ్వే...
Image Credit : ANI

ఇండియా vs జింబాబ్వే...

T20 World Cup 2026 : టీమిండియా ఇకపై కఠిన పరీక్షలు ఎదుర్కోనుంది. టీ20 వరల్డ్ కప్ ను విజయాలతో ప్రారంభించినా... ఒక్క ఓటమి.. కేవలం ఒకేఒక్క ఓటమి భారత జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. సూపర్-8 లో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత్ ఓడింది... దీంతో అన్ని సమీకరణలు మారిపోయాయి. టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ విజయంపై ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఇకపై ఆడే ప్రతిమ్యాచ్ గెలవాలి. అంటే ప్రతి మ్యాచ్ ఓ అగ్నిపరీక్షే... రేపు (ఫిబ్రవరి 26, గురువారం) జింబాబ్వేతో జరిగే మ్యాచ్ తో సహా. అందుకే జింబాబ్వేపై పక్కా వ్యూహాలతో బరిలోకి దిగబోతోంది... జట్టులో భారీ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్‌లో లేని కీలక ఆటగాళ్లను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వైస్ కెప్టెన్ రీఎంట్రీ
Image Credit : ANI

వైస్ కెప్టెన్ రీఎంట్రీ

దక్షిణాఫ్రికాతో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నాడు. చెన్నై స్పిన్ పిచ్‌పై సుందర్‌ను ఆడించాలనే వాదన ఉంది. కానీ జింబాబ్వే టాప్ ఆర్డర్‌లోని ఏడుగురిలో ఐదుగురు రైట్ హ్యాండ్ బ్యాటర్లు కావడంతో ఆఫ్ స్పిన్నర్ అవసరం అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి అక్షర్ పటేల్ రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.

37
రింకూ స్ధానంలో బౌలర్ కు ఛాన్స్
Image Credit : Getty

రింకూ స్ధానంలో బౌలర్ కు ఛాన్స్

ఫినిషర్‌గా విఫలమవుతున్న రింకూ గత ఐదు మ్యాచుల్లో రెండంకెల స్కోరు కూడా చేయలేదు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 29 బంతులు ఎదుర్కొని కేవలం 24 పరుగులే చేశాడు. దీనికి తోడు తండ్రి అనారోగ్యం కారణంగా అతను హుటాహుటిన ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడే అవకాశం లేదు. అతని స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావచ్చు... లేదంటే పేసర్ మహ్మద్ సిరాజ్ కు అవకాశం కల్పించవచ్చు.

47
తిలక్ ఔట్... సంజూ ఇన్
Image Credit : Getty

తిలక్ ఔట్... సంజూ ఇన్

తక్కువ స్ట్రైక్ రేట్, ఇంటెంట్ లేదనే విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ వర్మకు రేపటి మ్యాచ్‌లో చోటు దక్కకపోవచ్చు. మూడో స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన తిలక్ స్థానంలో కుడిచేతి వాటం బ్యాటర్‌ను ఆడించాలని భావిస్తే, సంజూ శాంసన్ జట్టులోకి వస్తాడు. సంజూను మూడో నంబర్‌లో లేదా ఓపెనర్‌గా ఆడించవచ్చు. అతను ఓపెనింగ్ చేస్తే ఇషాన్ కిషన్ మూడో స్థానంలోకి వస్తాడు. ప్రత్యర్థుల ఆఫ్ స్పిన్ ఉచ్చును సంజూతో ఛేదించవచ్చని భారత్ ఆశిస్తోంది.

సంజూ శాంసన్ చివరిసారిగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. సంజూ జట్టులోకి వస్తే ఓపెనింగ్‌లో కుడి-ఎడమ చేతి కాంబినేషన్‌ను ప్రయత్నించే అవకాశం ఉంటుంది.

57
జింబాబ్వేపై స్పిన్ త్రయాన్ని ప్రయోగించనున్న భారత్..
Image Credit : Getty

జింబాబ్వేపై స్పిన్ త్రయాన్ని ప్రయోగించనున్న భారత్..

చెన్నై చిదంబరం స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. రేపు జింబాబ్వేతో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో కూడిన స్పిన్ త్రయంపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. అంతేకాదు చెన్నై వరుణ్ చక్రవర్తికి హోమ్ గ్రౌండ్ కూడా. అందుకే అతడు చెలరేగిపోతాడని భావిస్తున్నారు. 

67
బుమ్రా, అర్షదీప్ పేస్ అటాక్...
Image Credit : X@bcci

బుమ్రా, అర్షదీప్ పేస్ అటాక్...

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇతర బౌలర్లు తేలిపోయినప్పటికీ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌తో బౌలింగ్ చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో కూడా బుమ్రా పాత్ర కీలకం కానుంది. అర్షదీప్ సింగ్ కూడా తుది జట్టులో ఉంటాడు. ఇంకా అవసరం అనుకుంటే సిరాజ్ ను కూడా ఆడించే అవకాశాలున్నాయి.

77
జింబాబ్వేతో ఆడే భారత జట్టు ఇదే..?
Image Credit : Getty

జింబాబ్వేతో ఆడే భారత జట్టు ఇదే..?

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : రింకూ సింగ్ ఔట్.. జట్టులోకి హైదరబాదీ ప్లేయర్..?
Recommended image2
T20 World Cup 2026: హ్యారీ బ్రూక్ vs సూర్యకుమార్ యాదవ్‌.. వీరి మధ్య తేడా ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved