MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : కప్పు మనదేనా? టీ20 ప్రపంచకప్ విజేతను తేల్చేసే 5 మంది సూపర్ స్టార్లు వీళ్లే

T20 World Cup 2026 : కప్పు మనదేనా? టీ20 ప్రపంచకప్ విజేతను తేల్చేసే 5 మంది సూపర్ స్టార్లు వీళ్లే

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ మెగా టోర్నీలో భారత్‌కు సవాల్ విసరబోయే ఆటగాళ్లు ఎవరు? అభిషేక్ శర్మ, బుమ్రా ఎలాంటి ప్రభావం చూపగలరు? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 04 2026, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ శర్మ: భారత్ కొత్త ఆయుధం
Image Credit : Getty

అభిషేక్ శర్మ: భారత్ కొత్త ఆయుధం

టీ20 ఫార్మాట్‌ అంటే అభిషేక్ శర్మనే.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం ఇతని ఆట స్టైల్. పవర్‌ప్లేను అద్భుతంగా ఉపయోగించుకుని షేక్ చేస్తాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అభిషేక్ శర్మ 194.74 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 1,297 పరుగులు సాధించాడు. అతని దూకుడు భారత జట్టుకు భారీ స్కోర్లు అందించడంలో కీలకం కానుంది. తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం ఈ యంగ్ ఓపెనర్‌కు ఉంది.

25
జస్ప్రీత్ బుమ్రా: భారత్ ట్రంప్ కార్డ్
Image Credit : AFP

జస్ప్రీత్ బుమ్రా: భారత్ ట్రంప్ కార్డ్

ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ ఎవరంటే అది జస్ప్రీత్ బుమ్రా మాత్రమే. భారత జట్టు విజయాల్లో బుమ్రా పాత్ర ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు 87 టీ20 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 107 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 6.54 ఎకానమీ రేటుతో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో అతను దిట్ట. పవర్‌ప్లేలో వికెట్లు తీయడం, డెత్ ఓవర్లలో కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టడి చేయడం బుమ్రా ప్రత్యేకత. 2026 ప్రపంచకప్‌లో భారత్ ఆశలన్నీ బుమ్రాపైనే ఉన్నాయి.

Related Articles

Related image1
Tilak Varma Net Worth : క్రికెట్ పిచ్‌పైనే కాదు.. సంపాదనలోనూ తిలక్ వర్మ సెంచరీ !
Related image2
T20 World Cup 2026 సందడి షురూ.. ఫ్రీగా ఎక్కడ చూడాలి? ఇండియా మ్యాచ్‌ల టైమింగ్స్ ఇవే !
35
వనిందు హసరంగా: లంక గడ్డపై డెంజరస్ ప్లేయర్
Image Credit : Getty

వనిందు హసరంగా: లంక గడ్డపై డెంజరస్ ప్లేయర్

2026 టీ20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సొంత గడ్డపై జరిగే ఈ టోర్నీలో శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా అత్యంత కీలకం కానున్నాడు. 94 టీ20 మ్యాచ్‌ల్లో ఏకంగా 151 వికెట్లు తీసిన రికార్డు ఇతని సొంతం. లంకలోని స్పిన్ అనుకూల పిచ్‌లపై హసరంగా బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఏ బ్యాటర్‌కైనా కష్టమే. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడు. భారత్ ఈ ఆటగాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

45
ట్రావిస్ హెడ్: ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు
Image Credit : Getty

ట్రావిస్ హెడ్: ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు

పెద్ద మ్యాచ్‌ల్లో, ముఖ్యంగా నాకౌట్ పోరులో అద్భుతంగా ఆడటం ట్రావిస్ హెడ్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా జట్టుకు మెరుపు ఆరంభాలను ఇవ్వడంలో ఇతను ఎప్పుడూ ముందుంటాడు. 49 టీ20 మ్యాచ్‌ల్లో 156 స్ట్రైక్ రేట్‌తో 1,224 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఇతనికి భారత పిచ్‌లపై ఎలా ఆడాలో నేర్పింది. ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్ రేసులో ఉండాలంటే హెడ్ ఇచ్చే ఆరంభం చాలా ముఖ్యం. టీమ్ ఇండియా బౌలర్లకు ఇతను ప్రధాన సవాల్‌గా మారే అవకాశం ఉంది.

55
రషీద్ ఖాన్: ఆఫ్ఘన్ ఎక్స్ ఫ్యాక్టర్
Image Credit : Getty

రషీద్ ఖాన్: ఆఫ్ఘన్ ఎక్స్ ఫ్యాక్టర్

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌కు పేరుంది. 111 మ్యాచ్‌ల్లో 187 వికెట్లతో అతను టీ20 వికెట్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం బౌలింగ్‌తోనే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్ చేయగలడు. అలాగే మైదానంలో చురుకైన ఫీల్డింగ్‌తో జట్టుకు అదనపు బలాన్ని ఇస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రపంచకప్‌లో ముందడుగు వేయించగల సత్తా ఉన్న ఏకైక ఆటగాడు రషీద్ ఖాన్. ఏ జట్టుకైనా ఇతని 4 ఓవర్లు దాటడం ఒక పెద్ద పరీక్ష లాంటిదే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 సందడి షురూ.. ఫ్రీగా ఎక్కడ చూడాలి? ఇండియా మ్యాచ్‌ల టైమింగ్స్ ఇవే !
Recommended image2
T20 World Cup 2026 : ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్, సంజూకు షాక్.. భారత్ కొత్త వ్యూహం
Recommended image3
T20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టాప్ 5 అన్‌బ్రేకేబుల్ రికార్డ్స్
Related Stories
Recommended image1
Tilak Varma Net Worth : క్రికెట్ పిచ్‌పైనే కాదు.. సంపాదనలోనూ తిలక్ వర్మ సెంచరీ !
Recommended image2
T20 World Cup 2026 సందడి షురూ.. ఫ్రీగా ఎక్కడ చూడాలి? ఇండియా మ్యాచ్‌ల టైమింగ్స్ ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved