MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • T20 World Cup 2026 సందడి షురూ.. ఫ్రీగా ఎక్కడ చూడాలి? ఇండియా మ్యాచ్‌ల టైమింగ్స్ ఇవే !

T20 World Cup 2026 సందడి షురూ.. ఫ్రీగా ఎక్కడ చూడాలి? ఇండియా మ్యాచ్‌ల టైమింగ్స్ ఇవే !

T20 World Cup 2026 :  టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. టీ20 వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్, ఇండియా మ్యాచ్‌ల టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 04 2026, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ చూడాలా? ఫోన్, టీవీలో లైవ్ వివరాలు ఇవే
Image Credit : Getty

ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ చూడాలా? ఫోన్, టీవీలో లైవ్ వివరాలు ఇవే

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఈ క్రికెట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. మార్చి 8వ తేదీ ఆదివారంతో ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో క్రికెట్ ప్రియులకు కావాల్సిన అసలైన వినోదం అందనుంది.

ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా, నేపాల్, ఇటలీ, ఆఫ్ఘనిస్థాన్, కెనడా, యూఏఈ, స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారత జట్టు మ్యాచ్‌ల వివరాలు ఇవే
Image Credit : AFP

భారత జట్టు మ్యాచ్‌ల వివరాలు ఇవే

ఈ మెగా టోర్నీలో భారత జట్టు గ్రూప్-ఏ లో చోటు దక్కించుకుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ప్రారంభ రోజున అంటే ఫిబ్రవరి 7న ముంబై లో అమెరికాతో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో రెండో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఇక ఫిబ్రవరి 18న అహ్మదాబాద్ లో నెదర్లాండ్స్‌తో భారత జట్టు తన చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడుతుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లు ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతాయి.

Related Articles

Related image1
T20 World Cup 2026 : ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్, సంజూకు షాక్.. భారత్ కొత్త వ్యూహం
Related image2
Tilak Varma Net Worth : క్రికెట్ పిచ్‌పైనే కాదు.. సంపాదనలోనూ తిలక్ వర్మ సెంచరీ !
36
భారత్ - పాక్ మ్యాచ్ జరిగేనా?
Image Credit : X@BCCI

భారత్ - పాక్ మ్యాచ్ జరిగేనా?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే దాయాదుల పోరు భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో లో జరగాల్సి ఉంది. అయితే, భారత్‌తో ఆడేందుకు తాము సిద్ధంగా లేమని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఆ రోజు మ్యాచ్ సమయానికి పాక్ జట్టు మైదానంలోకి వస్తుందా లేదా అనే అంశంపైనే అందరి దృష్టి నెలకొంది.

46
టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్, ఫైనల్ షెడ్యూల్
Image Credit : X/BCCI

టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్, ఫైనల్ షెడ్యూల్

లీగ్ దశ ముగిసిన తర్వాత సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు జరుగుతాయి. ఆ తర్వాత అత్యంత కీలకమైన సెమీఫైనల్స్ మార్చి 4, 5వ తేదీల్లో నిర్వహిస్తారు. ఇక విశ్వవిజేత ఎవరో తేల్చే మహా సమరం అంటే ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు ఉండటంతో గ్రూప్ దశలో ప్రతిరోజూ మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

56
టీ20 వరల్డ్ కప్ 2026: టీవీలో ఎక్కడ చూడాలి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే
Image Credit : INSTAGRAM/surya_14kumar

టీ20 వరల్డ్ కప్ 2026: టీవీలో ఎక్కడ చూడాలి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే

2026 టీ20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. అభిమానులు స్టార్ స్పోర్ట్స్ (Star Sports) ఛానళ్లలో ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసం స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు (Star Sports 1 Telugu) ఛానల్‌లో ప్రత్యక్షంగా తెలుగు కామెంటరీతో మ్యాచ్‌లను ఎంజాయ్ చేయవచ్చు. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

66
టీ20 వరల్డ్ కప్ 2026 : మ్యాచ్ ప్రారంభ సమయాలు ఇవే
Image Credit : Getty

టీ20 వరల్డ్ కప్ 2026 : మ్యాచ్ ప్రారంభ సమయాలు ఇవే

భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లు మూడు వేర్వేరు సమయాల్లో ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం 11:00 గంటలకు మొదటి మ్యాచ్, మధ్యాహ్నం 3:00 గంటలకు రెండో మ్యాచ్, రాత్రి 7:00 గంటలకు మూడో మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత జట్టు ఆడే అన్ని లీగ్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకే మొదలవుతాయి. దీనివల్ల భారత అభిమానులు ప్రైమ్ టైమ్‌లో తమ జట్టు ఆటను వీక్షించే అవకాశం లభిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్, సంజూకు షాక్.. భారత్ కొత్త వ్యూహం
Recommended image2
Tilak Varma Net Worth : క్రికెట్ పిచ్‌పైనే కాదు.. సంపాదనలోనూ తిలక్ వర్మ సెంచరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved