MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • CSK ధోనీ మాస్టర్ ప్లాన్: ఐపీఎల్ 2026లో సీఎస్కే తో ప్రత్యర్థులకు వణుకే !

CSK ధోనీ మాస్టర్ ప్లాన్: ఐపీఎల్ 2026లో సీఎస్కే తో ప్రత్యర్థులకు వణుకే !

CSK : ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. కొత్త ఓపెనింగ్ జోడీ, యువ ఆటగాళ్ల రాకతో ధోనీ సేన ఆరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరి చెన్నై సూపర్ కింగ్స్ బలం, బలహీనతలు ఏంటో మీకు తెలుసా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 18 2026, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్ ప్లానేంటి?
Image Credit : Getty

ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్ ప్లానేంటి?

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గత సీజన్ వైఫల్యాలను మర్చిపోయి, సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. గత ఏడాది పాయింట్ల పట్టికలో అడుగున నిలిచిన చెన్నై, ఈసారి తన అదృష్టాన్ని మార్చుకోవాలని పట్టుదలతో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భారీ మార్పులతో చెన్నై సూపర్ కింగ్స్
Image Credit : Getty

భారీ మార్పులతో చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 43.4 కోట్ల రూపాయల భారీ పర్స్ విలువతో బరిలోకి దిగింది. జట్టులో ఉన్న తొమ్మిది ఖాళీలను భర్తీ చేసేందుకు ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత ఆటగాళ్లను వదిలేసి, యువ రక్తాన్ని జట్టులోకి ఆహ్వానించింది. ముఖ్యంగా దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ వంటి అనుభవజ్ఞులతో పాటు స్టార్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను కూడా జట్టు నుంచి తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Related Articles

Related image1
IPL : క్రికెట్ లవర్స్ కు షాక్.. ధోనీ రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ ! ఆ నలుగురు కూడా అవుట్?
Related image2
IPL 2026 : రింకూ సింగ్ ను దెబ్బకొట్టిన షారుఖ్ కేకేఆర్ !
36
చెన్నై జట్టులో కొత్త ముఖాలు
Image Credit : Getty

చెన్నై జట్టులో కొత్త ముఖాలు

వేలం ద్వారా అఖీల్ హుస్సేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, రాహుల్ చాహర్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను సీఎస్కే సొంతం చేసుకుంది. ఇప్పుడు జట్టులో అనుభవజ్ఞులైన ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ వంటి వారితో పాటు మెరుపులు మెరిపించే యువ ఆటగాళ్ల కలయిక కనిపిస్తోంది. ఈ సమతుల్యత జట్టుకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి మరి.

46
సీఎస్కే బలం : బలమైన బ్యాటింగ్ లైనప్
Image Credit : Getty

సీఎస్కే బలం : బలమైన బ్యాటింగ్ లైనప్

2026 సీజన్‌లో చెన్నైకి అతిపెద్ద బలం వారి బ్యాటింగ్ విభాగం. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. గత సీజన్‌లో గాయం కారణంగా ఆయన కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం జట్టుపై ప్రభావం చూపింది. కానీ ఈసారి సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి హిట్టర్ల చేరికతో బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. వెటరన్ ఫినిషర్ ఎంఎస్ ధోనీ ఉండనే ఉన్నాడు.

ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీ

ఈసారి చెన్నై కొత్త ఓపెనింగ్ జోడీని ప్రయోగించనుంది. యువ సంచలనం ఆయుష్ మ్హాత్రేతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. వీరి తర్వాత రుతురాజ్ గైక్వాడ్, డెవాల్డ్ బ్రెవిస్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ధోనీ రానున్నారు. ఈ బ్యాటింగ్ ఆర్డర్ ఏ బౌలింగ్ విభాగన్నైనా చెల్లాచెదురు చేసే సామర్థ్యం కలిగి ఉంది.

56
సీఎస్కే బలహీనత : అనుభవం లేని బౌలింగ్
Image Credit : X/DVtweetx

సీఎస్కే బలహీనత : అనుభవం లేని బౌలింగ్

జట్టులో ప్రతిభ ఉన్నప్పటికీ, కీలక సమయాల్లో అనుభవం లేకపోవడం చెన్నైకి పెద్ద మైనస్. యువ ఆటగాళ్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకం. బౌలింగ్ విభాగంలో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే స్టార్ బౌలర్ల కొరత కనిపిస్తోంది. ఖలీల్ అహ్మద్ భారత పేసర్లకు నాయకత్వం వహిస్తుండగా, ముఖేష్ చౌదరి, గుర్జప్‌నీత్ సింగ్, అన్షుల్ కంబోజ్ అతనికి సహకరించనున్నారు. విదేశీ కోటాలో నాథన్ ఎల్లిస్, మాట్ హెన్రీ వంటి వారు ఉన్నా, కీలక మ్యాచ్‌లలో వారి ప్రదర్శన ఎలా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కు అద్భుతమైన అవకాశం

2023లో చివరిసారి టైటిల్ గెలిచిన చెన్నై, మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు ఇది మంచి అవకాశం. 2025లో చాలా మంది యువ ఆటగాళ్లు లీగ్‌లో రాణించారు. అదే తరహాలో చెన్నైలోని కుర్రాళ్లు చెలరేగితే, ఆరో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటం ధోనీ సేనకు కష్టమేమీ కాదు. యువ ఆటగాళ్లు క్లిక్ అయితే సీఎస్కే మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది.

66
చెన్నై సూపర్ కింగ్స్ ముందున్న సవాళ్లు ఏంటి?
Image Credit : ipl media

చెన్నై సూపర్ కింగ్స్ ముందున్న సవాళ్లు ఏంటి?

జట్టులో అనుభవం లేని ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెట్టడం ఒక రిస్క్ అని చెప్పాలి. ముఖ్యంగా ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మల కోసం ఫ్రాంచైజీ 14.2 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. వీరిద్దరూ భవిష్యత్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నా, ఐపీఎల్ వంటి హై-ప్రెజర్ టోర్నీలో విఫలమైతే జట్టు ఆశలు దెబ్బతింటాయి. సీజన్ ఆరంభంలోనే వరుస ఓటములు ఎదురైతే, యువ ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది.

ఐపీఎల్ 2026 కోసం చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్ ఇదే

మహేంద్ర సింగ్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, జేమీ ఓవర్టన్, గుర్జప్‌నీత్ సింగ్, అన్షుల్ కంబోజ్, అఖీల్ హుస్సేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫోల్క్స్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
IPL : క్రికెట్ లవర్స్ కు షాక్.. ధోనీ రిటైర్మెంట్ డేట్ ఫిక్స్ ! ఆ నలుగురు కూడా అవుట్?
Recommended image2
IPL 2026 : రింకూ సింగ్ ను దెబ్బకొట్టిన షారుఖ్ కేకేఆర్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved