MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Team India : టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసిన గౌతమ్ గంభీర్

Team India : టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసిన గౌతమ్ గంభీర్

Team India : టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మస్తు జోష్ లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ను కూడా ఫిక్స్ చేశారు. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 09 2026, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీ20 వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ సంచలన వ్యాఖ్యలు
Image Credit : X@BCCI

టీ20 వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ సంచలన వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో విజయం సాధించి, 2026 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. ఈ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, తన అసలు సవాలు ఇంకా ముందుందని ఆయన స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టీ20ల్లో 300 పరుగుల మార్కుపై కన్ను
Image Credit : Getty

టీ20ల్లో 300 పరుగుల మార్కుపై కన్ను

వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న గంభీర్, టీమిండియా బ్యాటింగ్ లైనప్‌పై తన ఆకాంక్షను బయటపెట్టారు. "మేము ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇది ముగింపు కాదు, కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఇప్పటివరకు మేము టీ20ల్లో 300 పరుగుల మార్కును తాకలేదు. కానీ, ఏదో ఒక రోజు నా జట్టు ఆ ఘనతను కూడా సాధిస్తుంది" అని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

36
ప్రతికూలతలను అధిగమించి భారత్ విజయం
Image Credit : Getty

ప్రతికూలతలను అధిగమించి భారత్ విజయం

ఈ టోర్నీలో భారత జట్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది. స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణా టోర్నీ ప్రారంభానికి ముందే దూరమవ్వగా, అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడ్డారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డారు. ఫీల్డింగ్‌లోనూ కొన్ని క్యాచ్‌లు చేజారాయి. అయినప్పటికీ, దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక్క మ్యాచ్‌ తప్ప మిగిలిన అన్నింట్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సార్లు 250 కంటే ఎక్కువ స్కోరు చేసిన తొలి టీ20 జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.

46
కోచ్ పాత్రపై గంభీర్ ఫిలాసఫీ
Image Credit : Getty

కోచ్ పాత్రపై గంభీర్ ఫిలాసఫీ

కోచ్ బాధ్యతలపై స్పందిస్తూ, మ్యాచ్ ఫలితాలు ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటాయని గంభీర్ పేర్కొన్నారు. "ఒక కోచ్ లేదా కెప్టెన్ ఎంత గొప్పవారనేది వారి జట్టు ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. మైదానం వెలుపల మేము అత్యుత్తమ వాతావరణాన్ని కల్పించగలం, ఆటగాళ్లకు భద్రతా భావాన్ని ఇవ్వగలం, నైపుణ్యాలను పంచుకోగలం. కానీ మైదానంలోకి దిగాక అంతా ఆటగాళ్ల చేతుల్లోనే ఉంటుంది" అని ఆయన అన్నారు. గంభీర్ హయాంలో భారత్ ఇప్పటికే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడం విశేషం.

56
హై రిస్క్ - హై రివార్డ్.. గంభీర్ వ్యూహం
Image Credit : ANI

హై రిస్క్ - హై రివార్డ్.. గంభీర్ వ్యూహం

ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ తన వ్యూహాలను పంచుకున్నారు. జట్టు విజయం వెనుక హై రిస్క్ - హై రివార్డ్ ఆలోచనా విధానం ఉందని చెప్పారు. ఆటగాళ్లను కేవలం నమ్మకం మీద కాకుండా, వారిపై ఉన్న విశ్వాసం ఆధారంగానే ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా అభిప్రాయాల కంటే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న 30 మంది ఆటగాళ్లే తనకు ముఖ్యం అని, వారికి మాత్రమే తాను జవాబుదారీ అని గంభీర్ కరాఖండిగా చెప్పారు.

66
గంభీర్ ముందున్న పెద్ద లక్ష్యం: 2027 వన్డే వరల్డ్ కప్
Image Credit : Getty

గంభీర్ ముందున్న పెద్ద లక్ష్యం: 2027 వన్డే వరల్డ్ కప్

గౌతమ్ గంభీర్ వైట్ బాల్ క్రికెట్‌లో తిరుగులేని కోచ్‌గా అవతరించారు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు పూర్తి సపోర్టు ఇస్తూ, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ విజయంలో మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ జై షా పాత్రలను ఆయన కొనియాడారు. గంభీర్ తదుపరి భారీ లక్ష్యం ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడమే. దాని కోసం ఎలాంటి మాస్టర్ ప్లాన్ లను సిద్ధం చేస్తారో చూడాలి మరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image3
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Related Stories
Recommended image1
Gautam Gambhir : ఒక్క ఫోటో.. వెయ్యి కథలు ! గంభీర్ వేసిన స్కెచ్ మామూలుగా లేదుగా !
Recommended image2
Team India : ఫ్లాప్ అవుతున్నా అభిషేక్ శర్మకే ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అసలు నిజం చెప్పిన గంభీర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved