MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : సూర్య సేన సిద్ధం.. కోహ్లీ, రోహిత్ లేని లోటు తీర్చేస్తారా?

T20 World Cup 2026 : సూర్య సేన సిద్ధం.. కోహ్లీ, రోహిత్ లేని లోటు తీర్చేస్తారా?

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 కు సర్వం సిద్ధమైంది. తొలిరోజు భారత్ వర్సెస్ అమెరికా సహా మూడు హోరాహోరీ మ్యాచ్ లు ఉన్నాయి. మ్యాచ్ టైమింగ్స్, చూడాల్సిన స్టార్ ప్లేయర్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 06 2026, 10:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీ20 ప్రపంచకప్ 2026 షురూ: తొలిరోజే 3 బిగ్ ఫైట్స్
Image Credit : INSTAGRAM/surya_14kumar

టీ20 ప్రపంచకప్ 2026 షురూ: తొలిరోజే 3 బిగ్ ఫైట్స్

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం భారత్, శ్రీలంకలలో ఈ మెగా టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ మార్చి 8 వరకు సాగనుంది. తొలి రోజే మూడు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనుండటంతో అభిమానులకు అసలైన మజా అందనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తొలిరోజు షెడ్యూల్: ఏయే మ్యాచ్‌లు ఎప్పుడంటే?
Image Credit : AFP

తొలిరోజు షెడ్యూల్: ఏయే మ్యాచ్‌లు ఎప్పుడంటే?

టోర్నీ ప్రారంభ రోజైన ఫిబ్రవరి 7న ఉదయం నుంచి రాత్రి వరకు క్రికెట్ సందడి ఉంటుంది.

  1. తొలి మ్యాచ్: ఉదయం 11:00 గంటలకు కొలంబో లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి.
  2. రెండో మ్యాచ్: మధ్యాహ్నం 3:00 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్ల మధ్య పోరు జరగనుంది.
  3. మూడో మ్యాచ్: రాత్రి 7:00 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ తన తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది.
36
నజర్ ఉండాల్సిన ఆరుగురు తుపాను ప్లేయర్లు వీరే
Image Credit : Getty

నజర్ ఉండాల్సిన ఆరుగురు తుపాను ప్లేయర్లు వీరే

తొలిరోజు జరిగే మ్యాచ్‌ల్లో ఆరు జట్ల నుంచి ఆరుగురు కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి ఉంది. వీరు తమ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగలరు. వారిలో

1. అభిషేక్ శర్మ (భారత్): టీమిండియా నయా సెన్సేషన్, 'సిక్స్ హిట్టింగ్ మెషిన్'గా పేరు తెచ్చుకున్న అభిషేక్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాటర్‌గా ఉన్న అతను, తన తొలి ప్రపంచకప్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు.

2. సయీమ్ అయూబ్ (పాకిస్థాన్): పాక్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్న ఈ యువ ఓపెనర్ తన సరికొత్త షాట్లతో పరుగుల వర్షం కురిపించగలడు.

3. షిమ్రాన్ హెట్మేయర్ (వెస్టిండీస్): ఈసారి నంబర్ 3లో బ్యాటింగ్‌కు రానున్న షిమ్రాన్ హెట్మేయర్, కరీబియన్ జట్టుకు వెన్నెముకగా మారనున్నాడు.

4. మొనాంక్ పటేల్ (అమెరికా): అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్ తన జట్టును ముందుండి నడిపించడమే కాకుండా వేగంగా పరుగులు సాధించడంలో గుర్తింపు పొందాడు.

5. రిచీ బెరింగ్టన్ (స్కాట్లాండ్): స్కాట్లాండ్ కెప్టెన్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చి జట్టుకు భారీ స్కోరును అందించగలడు.

6. మాక్స్ ఓడౌడ్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై సునామీ బ్యాటింగ్ తో విరుచుకుపడగల సత్తా ఉన్న ప్లేయర్.

46
టీమిండియా డిఫెండింగ్ ప్రస్థానం: రికార్డులపై గురి
Image Credit : Tilak Varma\Twitter

టీమిండియా డిఫెండింగ్ ప్రస్థానం: రికార్డులపై గురి

2007, 2024లో విజేతగా నిలిచిన టీమిండియా, ఇప్పుడు మూడోసారి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండుసార్లు టైటిల్‌ను డిఫెండ్ చేసుకోలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు రిటైర్ అయిన తర్వాత, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ ఇండియా ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధమైంది. జట్టులో అభిషేక్ శర్మతో పాటు తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ రక్తం తోడైంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులు జట్టుకు బలాన్ని ఇస్తున్నారు.

56
టీ20 ప్రపంచ కప్ 2026 : టోర్నీ ఫార్మాట్, గ్రౌండ్స్ ఇవే
Image Credit : Getty

టీ20 ప్రపంచ కప్ 2026 : టోర్నీ ఫార్మాట్, గ్రౌండ్స్ ఇవే

ఈ మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశ ఫిబ్రవరి 7 నుంచి 20 వరకు జరుగుతుంది. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. సూపర్ 8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు జరుగుతాయి. సెమీఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరగనుండగా, గ్రాండ్ ఫినాలే మార్చి 8న నిర్వహించనున్నారు. ఒకవేళ పాకిస్థాన్ సెమీస్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి, లేనిపక్షంలో ఫైనల్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది.

66
టీ20 ప్రపంచ కప్ 2026 లైవ్ ఎక్కడ చూడాలి?
Image Credit : Getty

టీ20 ప్రపంచ కప్ 2026 లైవ్ ఎక్కడ చూడాలి?

భారతదేశంలోని క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే, జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ భాషల్లో కూడా కామెంటరీ అందుబాటులో ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
WPL 2026 : వయసు పెరిగినా వేట తగ్గలేదు.. పర్పుల్ క్యాప్ సోఫీ సొంతం.. టాప్ 5 బౌలర్లు వీరే !
Recommended image2
T20 World Cup : రెండు దేశాల తరపున టీ20 వరల్డ్ కప్ ఆడిన ఆరుగురు మొనగాళ్లు వీరే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved