MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • IND vs NED : దూబే శివతాండవం.. చక్రవర్తి స్పిన్ మాయకు నెదర్లాండ్స్‌ విలవిల

IND vs NED : దూబే శివతాండవం.. చక్రవర్తి స్పిన్ మాయకు నెదర్లాండ్స్‌ విలవిల

India vs Netherlands : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు హాఫ్ సెంచరీ, వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలంతో నెదర్లాండ్స్‌ను 17 రన్స్‌తో ఓడించి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 18 2026, 11:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అభిషేక్ శర్మ హ్యాట్రిక్ డకౌట్.. అయినా తగ్గేదేలే అన్న భారత్.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం
Image Credit : X@BCCI

అభిషేక్ శర్మ హ్యాట్రిక్ డకౌట్.. అయినా తగ్గేదేలే అన్న భారత్.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ ఏ ఆఖరి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత జట్టు లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, 100 శాతం రికార్డుతో అజేయంగా సూపర్-8 దశకు చేరుకుంది. శివమ్ దూబే (66) బ్యాటింగ్‌లో, వరుణ్ చక్రవర్తి (3 వికెట్లు) బౌలింగ్‌లో రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తడబడిన ఓపెనర్లు.. ఆకట్టుకున్న దూబే
Image Credit : Getty

తడబడిన ఓపెనర్లు.. ఆకట్టుకున్న దూబే

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆర్యన్ దత్ బౌలింగ్‌లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (18) కూడా త్వరగానే వెనుదిరిగాడు. 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. దూబే కేవలం 31 బంతుల్లో 66 పరుగులు చేసి నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇందులో భారీ సిక్సర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31), హార్దిక్ (30) కీలక పరుగులు జోడించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Related Articles

Related image1
IND vs NED : దూబే దుమ్మురేపాడు భయ్యా.. హార్దిక్ షాక్ !
Related image2
Abhishek Sharma : సున్నాల హ్యాట్రిక్.. అభిషేక్ శర్మకు ఏమైంది?
36
చివరలో పాండ్యా పవర్.. భారీ స్కోరు
Image Credit : X@BCCI

చివరలో పాండ్యా పవర్.. భారీ స్కోరు

చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా తన మార్క్ పవర్ హిట్టింగ్‌తో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 19వ ఓవర్లో పాండ్యా వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాది భారత్ స్కోరును 180 దాటించాడు. పాండ్యా 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డచ్ బౌలర్లలో ఆర్యన్ దత్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ, మిగిలిన బౌలర్లు భారత బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు.

46
ఛేదనలో నెదర్లాండ్స్ పోరాటం
Image Credit : Getty

ఛేదనలో నెదర్లాండ్స్ పోరాటం

194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ పోరాటపటిమ చూపించింది. ఓపెనర్లు మాక్స్ ఓడౌడ్, లెవిట్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే, భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు రాకుండా అడ్డుకున్నారు. వరుణ్ చక్రవర్తి తన మొదటి ఓవర్లోనే మాక్స్ ఓడౌడ్‌ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత బాస్ డి లీడే (33) పోరాడినప్పటికీ, భారత బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ క్రమంగా వికెట్లు కోల్పోయింది.

56
చక్రవర్తి స్పిన్ మాయాజాలం
Image Credit : Getty

చక్రవర్తి స్పిన్ మాయాజాలం

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి నెదర్లాండ్స్ వెన్ను విరిచాడు. కోలిన్ అకెర్మాన్, ఆర్యన్ దత్‌లను పెవిలియన్ పంపిన వరుణ్, 3 వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ మెరిసి 2 వికెట్లు తీశాడు. చివరకు నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ ఆఖరి ఓవర్లో అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

66
సూపర్-8 ఫైట్ కు సిద్ధంగా భారత్
Image Credit : Getty

సూపర్-8 ఫైట్ కు సిద్ధంగా భారత్

ఈ విజయంతో భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా 12వ విజయాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తన మొదటి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలవడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరోవైపు, ఈ ఓటమితో నెదర్లాండ్స్ టోర్నీ నుండి అవుట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ను శివమ్ దూబే గెలుచుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
IND vs NED : దూబే దుమ్మురేపాడు భయ్యా.. హార్దిక్ షాక్ !
Recommended image2
Abhishek Sharma : సున్నాల హ్యాట్రిక్.. అభిషేక్ శర్మకు ఏమైంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved